Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
రోజూ 30 నిమిశాలు నడిస్తే.. 20 ఏళ్ల ఆయుశ్శు పెరుగుతుంది..!
నడక అనేది చాలా సహజమైన పని. ఏ కష్టం లేకుండా ఈ వ్యాయామాన్ని మనం చేసుకోవచ్చు. కాళ్లు చాలా బలహీనంగా లేనంత వరకు ఎవ్వరైనా ఈ వ్యాయామాన్ని చయవచ్చు. నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. మనం ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో 1 కిలోమీటరు దూరానికి కూడా ర్యాపిడోనే, క్యాబ్‌నో బుక్ చేసుకుంటాం. అలా బుక్ చేసుకోకుండా నడవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. నగక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఎక్కువగా నడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయ్. గుండెపోటు వచ్చే అవకాశాలు భారీగా తగ్గుతాయ్. నడవడం వల్ల గుండె పనీతీరు మెరుగుపడ్డమే కాకుండా, శ్వాస కూడా బాగా ఆడుతుంది. ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడే వారు నడవడం వల్ల ఆ ఒత్తిడి నుంచి కొంచం ఉపశమనం పొందుతారు.

నడవడం వల్ల యముకలు పఠిష్టంగా మారుతాయ్. యముకలు కదలకుండా అలాగే వుండడం వల్ల చచ్చుబడినట్లుగా అవుతాయ్. వాటిని కదిలించడం, యాక్టివ్ చేయడం వల్ల యముకలకు సంబంధించిన కణాలు చురుకుగా పనిచేస్తాయ్.
రోజూ నడవడం వల్ల శరీర కండరాలు బలంగా మారుతాయ్. శరీరాన్ని సమతుల్యంగా వుంచుతుంది. శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది, కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది.
బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. నడవడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయ్. దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు. ఉదయంపూట వాకింగ్ చేయడం వల్ల ఆకలిని కూడా అదుపులో వుంచుకోవచ్చు.
నడవడం వల్ల శరీరంలో, రక్తంలో చెక్కర స్థాయి అదుపులో వుంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా వుంటుంది. గుండె జబ్బులు, డయాబెటీస్‌కు కొవ్వు పేరుకుపోవడమే కారణం. ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరు కూడా నడక మెరుగుపరుస్తుంది.
నడక ఆయుష్షును పెంచుతుంది. నడవడం వల్ల 15 నుంచి 20 సంవత్సరాలు ఎక్కువగా జీవించగలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. నడక మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ కూడా అబ్బుతుంది.

ఉదయం బహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరంలో వైటమిన్ డి స్థాయిలు పెరుగుతాయ్. శరీరానికి సూర్య రశ్మి తాకడం వల్ల శరీరంలో వైటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. నడవడం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగవుతాయ్. దీని వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలా జలం బాగా ఉత్పత్తి అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
నడకవల్ల పేగుల్లోనే బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది. జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. నడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు వుంటే సరిపోతుంది. శరీరానికి సౌకర్యంగా వుండే దుస్తులు కూడా ధరించాలి. ఒకవేల ట్రెక్కింగ్ కు వెళ్లాలనుకుంటే సరైన బూట్లు దుస్తులు ధరించాలి.
మెల్లగా నడకను మొదలుపెట్టి మీ సామర్ధ్యాన్ని బట్టి వేగాన్ని పెంచాలి. రోజుకు 30 నిమిశాలు నడవడం వల్ల 15 రోజుల్లో మీరు ఊహించని మార్పులను మీ శరీరంలో, మీ ఆరోగ్యంలో మీరు చూస్తారు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తరువాత నడవడం వల్ల ఆరోజంగా యాక్టివ్‌గా వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications