Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
నేటి ఉరుకుల పరుగుల జీవతంలో చాలా మంది డిప్రెషన్‌కు గురౌతున్నారు. ఒకప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే మాసనసిక రోగం లాంటివి ఉండేవి, ఇప్పుడు మానసిక రోగమనేది చాలా సాధారణమైన విషయం. డిప్రెషన్‌ను బయటకు చెప్పుకుంటే మెదడులోంచి కొంత బరువు దిగినట్లు అవుతుంది. అయితే పురుషుల్లోకన్నా మహిళలు డిప్రెషన్ గురించి ఎక్కువ ప్రకటనలు చేస్తున్నారు. అధికారిక లెక్కలు కూడా చెబుతున్నాయ్. పరువు, మర్యాద లాంటి కొన్ని సున్నితమైన అంశాల కారణంగా పురుషులు తాము డిప్రెషన్‌కు గురౌతున్నట్లు చెప్పుకోరు. అయితే పురుషుల్లో డిప్రెషన్ ఉందో లేదో తెలుసుకోవడానికి వారికి ఉన్న లక్షణాలను గమనించాలి. ఆ లక్షనాలు ఏంటో చూద్దాం.
కోపం, ఇరిటేషన్
డిప్రెషన్‌లో బాధగా ఉండటం సహజమే కానీ చాలా మంది పురుషులు బాధను దాచి వుంచుతారు. అదే బాధ లోలోపల పెరిగి కోపాన్ని పెరిగేలా చేస్తుంది. తరచుగా కోపగించుకొనే వారు కూడా డిప్రెషన్‌కు గురైనట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. బాధను అణుచుకున్నా అది తరువాత తీవ్రమైన కోపంగా బయటకు బరస్ట్ అవుతుంది.
అనారోగ్య సమస్యలు
డిప్రెషన్‌లో ఉన్న పురుషులు తలనొప్పి, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులకు గురౌతారు. మానసికంగా బాగా వత్తిడికి గురైనప్పుడే ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురౌతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాధులు వెంటనే నయం అయిపోతాయ్.

ప్రత్యామ్నాయంగా రిస్క్ పనులు చేయడం
మానసిక వత్తిడిని తగ్గించుకొవడానికి కొంత మంది పురుషులు మత్తుమందు తీసుకోవడం, శృతికి మించి ఫాస్ట్ డ్రైవింగ్ చేయడం, జూదం ఆడడం ఇంకా భయంకరమైన చర్యలకు పాల్పడుతుంటారు. ఈ పనులు చేసినప్పుడు డిప్రెషన్ నుంచొ కొంత పక్కకు తప్పుకుంటామనుకుంటారు కానీ దీర్ఘకాలికంగా ఇది వారి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది.
సమాజం నుంచి దూరం కావడం
పురుషులు తమను తాము సమాజం నుంచి దూరం చేసుకుంటారు. అందరితో కలిసి ఉన్నట్లే ఉంటారు కానీ కలిసి ఉండరు. తమ మానసిక సమస్యల గురించి చర్చించడానికి ముందుకు రారు. కేవలం ముఖ్యమైన విషయాలను మాత్రమే చర్చించడానికి అందరితో కలుస్తారు. ఈ విషయంలో ఇతరుల సహాయాన్ని కూడా తీసుకోవడానికి వెనకాడతారు.
నిరంతరం పనిలో మునగడం
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కొంతమంది పురుషులు తమను తాము పూర్తిగా పనిలో నిమగ్నం చేసుకుంటారు. వారు తమ కనీస సమయాన్ని కుటుంబసభ్యులకు, జీవితభాగస్వామికి, హాబీలకు కూడా కేటాయించరు. ఇది వారిని వత్తిడి నుంచి కొంత బయట పడవేస్తుంది కానీ అంతిమంగా వారు తమ డిప్రెషన్‌ను బాంబు పేల్చినట్లు ఒకేసారి బయటపెడతారు.
నిద్రించడంలో సమస్య
నిద్రలేమితో బాధపడ్డం లేదా అదుపులేకుండా ఎక్కువగా నిద్రపోవడం ఈ రెండూ నిద్రకు సంబంధించి ఒత్తిడికి గురైన పురుషుల్లో కనిపిస్తాయ్. నిద్రించడంలో సమస్య లేకున్నా కొందరు పురుషులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కావాలని ఎక్కువగా నిద్రిస్తుంటారు. ఇది వారి మానసిక సమస్యను మరింత పెంచుతుంది కానీ తగ్గదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
