Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఈ లక్షణాలుంటే స్కిన్ క్యాన్సర్.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి..!
క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయ్. మహిళల్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయ్. ఇటీవల సర్వికల్ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే జరిగే నష్టాన్ని ముందుగానే నివారించవచ్చు. ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ బారిన చాలా మంది పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్కిన్ క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయ్. దీన్ని ముందుగానే గుర్తిస్తే సులభంగా నివారించవచ్చు. అసలు స్కిన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాం.
స్కిన్ క్యాన్సర్‌లో ముందుగా కనిపించే లక్షనం పుట్టుమచ్చ. పుట్టుమచ్చ సైజు, రంగు, మారే విధానం బట్టి అది స్కిన్ క్యాన్సరా కాదా నిర్ధారణకు రావచ్చు. అమెరికాలో చర్మవ్యాధికి సంబంధించిన అమెరికాన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ విభాగం వారు స్కిన్ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలపై స్పష్టతనిచ్చారు.

30 ఏళ్ల తరువాత చర్మంపై కొత్త పుట్టుమచ్చ వచ్చి అది క్రమంగా పెరగడం లేదా దాని రంగులో మార్పు రావడం జరుగుతుందంటున్నారు. కొత్త పుట్టుమచ్చలు వస్తే దానికి అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. చర్మంపై ఎప్పుడు కొత్తగా పుట్టుమచ్చలు వచ్చినా వాటిని గమనిస్తూనే ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చర్మంపై చిన్న కురుపులా వచ్చి అది ఎన్ని రోజులైనా మానకపోతే వైద్యులను వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. బాసల్ సెల్ కార్సినోమా, స్క్వామోస్ సెల్ కార్సినోమాలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.
స్కిన్ క్యాన్సర్ వచ్చినట్టయితే చర్మం ఎక్కువగా దురదపెడుతుంది. కొన్ని ప్రదేశాల్లో దద్దుర్లు వస్తాయ్. సాధారణంగా చర్మంపై కురుపులు వచ్చినా దద్దుర్లు వచ్చినా కొన్ని రోజుల్లో తగ్గిపోతాయ్. ఒక వేల ఎంతకీ తగ్గకపోతే అప్పుడు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
చర్మంపై కురుపులు ఎర్రగా మారినా చాలా ప్రమాదకరం. స్కిన్ క్యాన్సర్‌లో ఇది ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఆ కురుపుల నుంచి రక్తం వచ్చే అవకాశాలున్నాయ్. అందువల్ల స్కిన్ క్యాన్సర్ మొదటి దశలోనే అప్రమత్తం కావాల్సిన అవసరం చాలా ఉంది. చర్మం ఉండే తీరు కూడా మొత్తం మారిపోతుందని అంటున్నారు.
స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఆహారం..
స్కిన్ క్యాన్సర్ రాకుండా వుండాలంటే బీటీ కిరోటిన్, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, లైసోపీన్ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే అకవాశాలు ఉన్నా వెంటనే తగ్గిపోతాయ్. బీటా కిరోటిన్ అందాలంటే బత్తాయి, క్యారెట్లు, మామిడి పళ్లను తినాలి. వైటమిన్ సీ క్యాన్సర్ పట్ల విషంగా పనిచేస్తుంది. వైటమిన్ సీ అందాలంటే నిమ్మకాయ, స్ట్రాబెర్రీలు, ఆకుకూరలు, బత్తయి తినాలి. వైటమిన్ డీ లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు వుంటాయ్. వైటమిన్ డీ కోసం సాల్మన్ చేప, పాల పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవాలంటే వైటమిన్ ఈ వల్లే సాధ్యం. వైటమిన్ ఈ కోసం బాదాం, పొద్దతిరుగు పువ్వు విత్తనాలు, ఆకుకూరలు, సోయా బీన్స్ తీసుకోవాలి.
టమాటలో ఉండే లైసోపీన్ వల్ల టమాట చెడిపోకుండా వుంటుంది. అదే లైసోపీన్‌తో చర్మం కూడా పాడవకుండా ఉండాలంటే టమాటలు తినాల్సిందే. వీటితో పాటు పుచ్చపండు, ఆప్రికోట్లు, ద్రాక్ష తీసుకోవాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మంపై మంటను తగ్గిస్తాయ్. సాల్మన్ చేప, వాల్‌నట్స్‌లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుంటాయ్. వీటిని ఆహారంలో రెగులర్‌గా తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
