Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
రెయిన్‌బో డైట్ అంటే ఏంటి? ఈ కొత్త డైట్ ట్రెండ్ ప్రయోజనాలు బోలెడు
రెయిన్‌బో కలర్ డైట్.. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న డైట్ ఇది. దీని వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల రెయిన్‌బో డైట్ బాగా ప్రాచుర్యం పొందింది. రెయిన్‌బో డైట్ లో రోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలు తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరానికి రోజూ కొన్ని సూక్ష్మ, స్థూల పోషకాలు అవసరం.

ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్యమైన ఆహారం తినడం చాలా కీలకం. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు దొరికేలా డైట్ ను సిద్ధం చేసుకోవడం ముఖ్యం. రెయిన్‌బో డైట్ తో అన్ని రకాల పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలా ఈ డైట్ ట్రెండ్ ప్రజాదరణ పొందుతోంది.
రెయిన్‌బో డైట్‌ను ఎలా ఫాలో అవ్వాలంటే..:
ఎరుపు:
ఆహారంలో రెడ్ కలర్ ను జోడించడానికి టమోటాల, ఎర్రని క్యాప్సికం, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ వంటి ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి. ఈ రెడ్ కలర్ ఫుడ్స్ గుండె, మూత్ర నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆరెంజ్:
క్యారెట్, ఆరెంజ్, స్వీట్ పొటాటో(చిలగడదుంప), ఆప్రికాట్‌లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆరెంజ్ కలర్ ఆహారాలు రోగనిరోధక వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తాయి.
పసుపు:
పసుపు రంగు ఆహారాలు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. పైనాపిల్స్, అరటిపండ్లు, పసుపు రంగు క్యాప్సికం, నిమ్మకాయలు వంటి పసుపు పండ్లు, కూరగాయలను రెయిన్‌బో డైట్ లో చేర్చుకోవచ్చు.
ఆకుపచ్చ:
బచ్చలికూర, బ్రొకలీ, అవకాడోలు, కివి, ఇతర ఆకు కూరలు రెయిన్‌బో డైట్ కి సరైనవి. ఆకుపచ్చ రంగు కూరలు గర్భంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుసతాయి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది కాబట్టి అవి గర్భం దాల్చిన వారికి ఎంతో మేలు చేస్తాయి.
బ్లూ, పర్పుల్:
నీం, ఊదా రంగు కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లూ బెర్రీస్, పర్పుల్ గ్రేప్స్, వంకాయ, పర్పుల్ క్యాబేజీలను రెయిన్‌బో డైట్ లో చేర్చుకోవచ్చు.
తెలుపు:
ఆహారంలో తెలుపు రంగును జోడించడం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు రెయిన్‌బో డైట్ లో చేర్చుకోవడానికి మంచి ఎంపికలు.
రెయిన్‌బో డైట్ ఆరోగ్య ప్రయోజనాలు:
రంగురంగుల పండ్లు, కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువును నిర్వహించవచ్చు. వీటిని తినడం ద్వారా కడుపు నిండిన భావన కలిగి ఆకలి నియంత్రణలో ఉంటుంది.
రంగురంగుల ఆహారం శరీరంలో ఫైటోకెమికల్స్ ను నింపుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. అలాగే వీటిల్లో కేలరీలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన రంగురంగుల పండ్లు, కూరగాయలు చర్మ సౌందర్యానికి సహాయపడతాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు కాంతివంతం చేస్తాయి. శరీరానికి రోజూ అవసరమయ్యే పోషకాలు ఈ రెయిన్‌బో డైట్ వల్ల లభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications