Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
ఆల్కహాల్ తాగే ముందు ఏం తినాలో, ఏం తినవద్దో తెలుసా?
ఆల్కహాల్ తాగితే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాగే శరీరంలోని ఉప్పు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తాగిన మరుసటి రోజు హ్యాంగోవర్ కు ఇదే కారణం. చాలా వేగంగా లేదా ఎక్కువగా ఆల్కహాల్ తాగితే కాలేయం దానిని ప్రాసెస్ చేయలేక, దానిని జీర్ణించుకోలేని విషాన్ని వదిలించుకోవడానికి శరీరం నుండి వాంతుల రూపంలో బయటకు వస్తుంది. తీసుకునే ఆల్కహాల్ లో వాటర్ కంటెంట్ ఉన్నందు వల్ల ముందుగా తినడం వల్ల అది పలుచగా మారుతుంది. ఆల్కహాల్ రక్తప్రవాహంలోకి రావడానికి పట్టే సమయాన్ని ఆలస్యం చేస్తుంది.

ఆల్కహాల్ తీసుకునే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఆల్కహాల్ ప్రభావం శరీరంపై తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకల ఆహారాలు తినడం వల్ల ఆల్కహాల్ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. మందు తాగడానికి ముందు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో.. ఎలాంటివి తినవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.
(ALCOHOL IS INJURIOUS TO HEALTH)
ఆల్కహాల్ తాగేముందు ఏం తినాలంటే..:
1. అరటి పండ్లు, ఇతర పండ్లు:
పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నీరు ఆల్కహాల్ ను పలుచన చేస్తుంది. అరటి పండ్లలో ఫైబర్, పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
2. గుడ్లు:
గుడ్లలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఏ ఆహారమైనా ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
3. పసుపు, దాల్చిన చెక్క, నిమ్మ:
ఇవి కాలేయానికి మేలు చేస్తాయి. ఆల్కహాల్ తాగే ముందు నిమ్మరం, లేదా పసుపు కలిపిన నీటిని తాగడం మంచిది.
4. నీరు:
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో నీరు ముఖ్యం. ఇది ఆల్కహాల్ ను పలుచన చేస్తుంది. ఉప్పు సమతుల్యతను నియంత్రిస్తుంది. ఆల్కహాల్ తాగే ముందు, తాగుతున్నప్పుడు ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి.
5. గింజలు:
వేరుశెనగల్లో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. గింజల్లోని కొవ్వులు ఆల్కహాల్ శోషణను మందగించడంలో సహాయపడతాయి.
6. సాల్మన్:
సాల్మన్ లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి. సాల్మన్ లో ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
7. అవొకాడో:
అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆల్కహాల్ ప్రభావాలను నెమ్మదిస్తాయి. అవొకాడోలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది.
(ALCOHOL IS INJURIOUS TO HEALTH)
ఆల్కహాల్ తాగేముందు ఏం తినకూడదంటే..:
1. కెఫీన్:
ఒక కప్పు కాఫీ తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం ఇది. అయితే శరీరం డీహైడ్రేట్ కావడాన్ని వేగవంతం చేస్తుంది.
2. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్:
ప్రాసెస్డ్ ఫుడ్స్, అర్టిఫీషియల్ షుగరీ ఫుడ్స్, కార్బొనేటెడ్ వాటర్, కార్బోహైడ్రేట్ ఆహారాలు ఏమాత్రం ఆరోగ్యకరమైనవి కావు. ఇందులోని అధిక ఉప్పు వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది.
3. సాల్టీ ఫుడ్స్:
ఉప్పు లేకుండా ఏ వంటకాలు రుచిగా ఉండలేవు. అయితే అధికంగా ఉప్పు ఉండే ఆహారాల వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ ఆహారాలు తిన్న తర్వాత ఆల్కహాల్ తాగితే మరింతగా డీహైడ్రేట్ కు గురవుతారు.
Disclaimer: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications