Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
WHO Warns: కరోనా కంటే భయంకరమైన మహమ్మారి, ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని WHO వార్నింగ్
కరోనా కంటే అతి భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. కొవిడ్-19 కంటే ప్రాణాంతకరమైన మరో మహమ్మారి రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని చెప్పుకొచ్చారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ విషయాన్ని చెప్పారు.

కరోనా ముగిసిపోలేదు, ఇంకా ఉంది!:
ప్రపంచవ్యాప్తంగా కరోనా హెల్త్ ఎమర్జెన్సీ ముగిసినంత మాత్రాన కరోనా లేదని కాదని టెడ్రోస్ హెచ్చరించారు. కరోనాకు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, దాని వల్ల కలిగే ప్యాథోజన్లతో మరింత ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నం అవుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ చెప్పారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిపోర్టును ప్రజెంట్ చేశారు.
కరోనా చాలా నేర్పింది:
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్(SDG) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి తెలియజెప్పిందని తెలిపారు. ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీని ప్రకటించిన ట్రిపుల్ బిలియన్ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఒకరకంగా ఈ మహమ్మారి మనల్ని ఘోరంగా దెబ్బతీసి.. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ని నిర్వీర్యం చేసినప్పటికీ ఇలాంటి మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలనో పాఠం నేర్పించదని తెలిపారు.
చైనాలో మరింత పెరుగుతున్న కరోనా కేసులు:
కాగా.. కరోనా పోయిందని ప్రపంచం అంతా అనుకుంటున్నా.. ఈ మహమ్మారి పుట్టిన దేశంగా భావిస్తున్న చైనాలో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కరోనా కొత్త వేవ్ మొదలైందని బయోటెక్ సదస్సులో పాల్గొన్న ఆ దేశ వైద్య నిపుణుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెద్ద సంఖ్యల నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. ఒపిక్రాన్, ఎక్స్‌బీబీ వేరియంట్‌ల వల్లే కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నట్లు తెలిపారు.మే నెలలో ప్రతి వారం 4 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇంతకుముందే బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. జూన్ చివరి నాటికి ప్రతి వారం 6.5 కోట్ల కేసులు నమోదవుతాయని బ్లూమ్‌బర్గ్ నివేదిక అంచనా వేసింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications