Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మామిడి పండ్లు తింటే ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?
పండ్లలో మామిడి పండ్లను రారాజు అంటారు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చేసినట్లే. ఈ సీజనల్ ఫ్రూట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని భయపడుతుంటారు చాలా మంది.

మామిడి పండ్లు తింటే మొటిమలు ఎందుకొస్తాయి?
మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. మామిడి పండ్లలో ఉండే తెల్లటి రసవంతమైన ద్రవంలో యాంటీ-న్యూట్రియంట్ ఫైటిక్ యాసిడే మొటిమలకు కారణం. ఇది శరీరంలో థర్మో జెనిసిస్ ను ఉత్పత్తి చేస్తుంది.
మొటిమలు రావొద్దంటే ఏం చేయాలి?
మామిడి పండ్లు తిన్నా కూడా మొటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటింంచాలి. మామిడి పండ్లు తినడానికి ముందు వాటిని కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచి మార్గం. ఇలా చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అలా అవి ఉత్పత్తి చేసే వేడిని తగ్గిస్తుంది. మామిడిలోని యాంటీ న్యూట్రీయెంట్ ఫైటిక్ యాసిడ్.. విటమిన్లు, ఖనిజాలు గ్రహించే శరీర సామర్థ్యానికి కూడా ఇది ఆటంకం కలిగిస్తుంది. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల థర్మోజెనిసిస్ ప్రభావం తగ్గి శరీరం వేడికి గురవ్వదు. అలా మొటిమలు రాకుండా ఉంటాయి.
అసిడిటీ, గుండెల్లో మంటను తగ్గించడానికి ఏం చేయాలంటే..:
మామిడి పండ్లను నానబెట్టకుండా తినడం వల్ల మొటిమలు రావడంతో పాటు అసిడిటీ, గుండెల్లో మంట కూడా వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ చిట్కా పాటించడం ఈ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పిత్తదోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా?
ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పిత్త దోషం ఉన్న వారి శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల ఆ వేడి మరింతగా పెరుగుతుంది. దీని వల్ల కొందరిలో గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పిత్త దోషం ఉన్న వాళ్లు మామిడి పండ్లు రోజుకు ఒకటి మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications