Latest Updates
-
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.!
Brain Tumor Day 2025: మెబైల్ ఫోన్ వాడేవాళ్లకి షాకింగ్..ఈ చిన్న తప్పు చేస్తే బ్రెయిన్ ట్యూమర్!
ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేని జరుపుకుంటారు. బ్రెయిన్ ట్యూమర్(మెదడు కణతి) లక్షణాలు, నిర్ధారణ, ట్రీట్మెంట్ పద్ధతుల గురించి ప్రజలను అప్రమత్తం చేయడం, వాటిని ఎదుర్కొంటున్న రోగులకు, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. జూన్ 8, 1952న యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ లూయిస్ మొట్టమొదటి బ్రెయిన్ ట్యూమర్ కేసును నిర్ధారించిన తేదీకి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు.
బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి?
బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో కణాల అసాధారణ వృద్ధి. ఈ కణితులు క్యాన్సర్ కాని లేదా క్యాన్సర్ కావచ్చు. ఇవి మెదడులోని ఏ భాగంలోనైనా సంభవించవచ్చు.. మెదడు పనితీరును ప్రభావితం చేయవచ్చు. కొన్ని కణితులు చాలా నెమ్మదిగా పెరుగుతాయి, మరికొన్ని వేగంగా పెరుగుతాయి. మొబైల్ ఫోన్లు ఇప్పడు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. ఫోన్ లేనిదే బాత్రూమ్ కి కూడా వెళ్లలేనంతగా దానికి బానిసలైపోతున్నారు చాలామంది. అయితే అతిగా ఫోన్ వాడకం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని నిపుణులు తరచుగా చెబుతుంటారు.. ముఖ్యంగా మెదడు కణితి వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతుండటం చాలా మందిని ఆందోళన కలిగిస్తుంది.
నిరంతర తలనొప్పి, కంటి చూపు మందగించడం, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో గుర్తించి ట్రీట్మెంట్ అందించడం ద్వారా మెదడు కణితి రోగుల ప్రాణాలను కాపాడవచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ కి మొబైల్ వాడకానికి సంబంధం ఏంటీ?
మెదడులోని కణాలు అసాధారణంగా పెరిగి ఒక ముద్దలా ఏర్పడటాన్ని కణితి అంటారు. దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ (RF), పుట్టుకతో వచ్చే కారణాలు దోహదపడతాయని నిపుణులు తెలిపారు. మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు మెదడులోని నరాలపై ఒత్తిడి కలిగించి కణాల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
న్యూరోసర్జరీ రోగులలో 3-5 శాతం మంది బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్నారంట. అయితే ప్రారంభ దశలోనే నిర్ధారణ అయితే వారిలో చాలామంది పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. చాలా మంది యువ రోగులలో బ్రెయిన్ ట్యూమర్ కు నిర్దిష్ట కారణం కనుగొనబడనప్పటికీ వారు గంటల తరబడి మొబైల్ లో మాట్లాడేవారని నిపుణులు గుర్తించారు. ప్రారంభంలో తలనొప్పి పెరగడంతో పాటు మెదడులోని నరాలు కూడా ప్రభావితం కావడం మొదలవుతుందని చెబుతున్నారు.

లక్షణాలు
తీవ్రమైన, నిరంతర తలనొప్పి, నడవడంలో ఇబ్బంది, బ్యాలెన్స్ కోల్పోవడం, మాట్లాడేటప్పుడు తడబడటం, మాటలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది,తలతిరగడం, వాంతులు, అకస్మాత్తుగా పడిపోవడం,కండరాల బలహీనత, చేతులు- కాళ్ళలో శక్తి తగ్గడం,మూర్ఛ, అస్పష్టమైన దృష్టి, నిద్రలేమి..ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఇవి శరీరంలో ఎప్పుడైనా కనబడితే వెంటనే హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవాలి.
నివారించడానికి చిట్కాలు
మెదడు కణితిని పూర్తిగా నివారించలేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు
మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించండి.
ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ మోడ్‌ను ఆన్ చేయడం లేదా హెడ్‌సెట్ ఉపయోగించడం ద్వారా ఫోన్‌ను మెదడుకు దూరంగా ఉంచవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా మెదడు కణితి చరిత్ర ఉంటే నివారణ చర్యలలో భాగంగా డాక్టర్ల సలహా మేరకు స్క్రీనింగ్ చేయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
