Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
World meditation day 2024: ఒత్తిడి,ఆందోళనకు దివ్యౌషధం..ధ్యానంతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆగరు
ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అందరి జీవితాలు ఒత్తిడితో నిండి ఉన్నాయి. చిన్నపిల్లలు చదువులకు సంబంధించిన ఒత్తిడి, ఉద్యోగులకు పని ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఇలా అన్ని వయసుల వారు ఏదో ఒక కారణంతో ఆందోళన చెందుతున్నారు. ఒత్తిడి కారణంగా మన మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. మానసిక ఆరోగ్యంపై మనం పెద్దగా శ్రద్ధ పెట్టం కానీ ఇటీవలకాలంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి.
ఒత్తిడి,ఆందోళనకు ధ్యానం(meditation) దివ్యౌషధం. ధ్యానం అనేది మెడిసిన్ కి ప్రత్యామ్నాయం కాదు..కానీ ప్రయోజనకరమైనది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా ప్రజలు ఒత్తిడి,ఆందోళన నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచి ప్రజలు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.

ప్రపంచ ధ్యాన దినోత్సవం
ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే(world meditation day 2024). ఈ సంవత్సరం ఇన్నర్ పీస్, గ్లోబల్ హార్మొనీ అనే థీమ్ తో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం డిసెంబరు 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ఏడాది డిసెంబర్ 6న ఆమోదించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే ని జరుపుకుంటున్నారు.
ధ్యానం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
పూర్వం ధ్యానం అనేది మతం, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉండేదని..కానీ ఇప్పుడు ప్రజలు ఒత్తిడిని తగ్గించడానికి,మానసిక ప్రశాంతతను, శారీరక ప్రయోజనాల కోసం ధ్యానం చేయడం స్టార్ట్ చేశారని నిపుణులు చెబుతున్నారు. మనస్సు అశాంతిని శాంతపరచడం ధ్యానం ఉద్దేశ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రమం తప్పకుండా 30-60 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.
శాస్త్రవేత్తల ప్రకారం ధ్యానం శరీరం,మెదడుకు విశ్రాంతినిస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం మీ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నెగిటివ్ ఆలోచనలు, భావోద్వేగాలను తగ్గించడం ద్వారా పాజిటివిటీని పెంచుతుంది. ధ్యానం మీ స్వీయ అవగాహనను పెంచుతుంది. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని(decession making capacity) మెరుగుపరుస్తుంది. ధ్యానంతో మీరు మరింత క్రియేటివ్ గా మారతారు, సవాళ్లను తెలివిగా ఎదుర్కొంటారు. ధ్యానం నిద్ర సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతుంది.
ధ్యానం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిద్ర సమస్యలు, తలనొప్పి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు,ఆందోళన,ఉబ్బసం,క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పి, నిరాశ,కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ధ్యానం సహాయపడుతుందని అనేక పరిశోధనలు చూపిస్తున్నాయి. ప్రతిరోజూ ధ్యానం చేయడం అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే,మీరు ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కొత్తగా ధ్యానం చేయడం స్టార్ట్ చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications