Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
క్యాన్సర్ అనగానే సాధారణంగా ధూమపానం, మద్యపానం లేదా జన్యుపరమైన కారణాలు మనకు గుర్తుకొస్తాయి. కానీ మన లైంగిక అలవాట్లు, ముఖ్యంగా ఓరల్ శృంగారం కూడా గొంతు క్యాన్సర్ కు దారితీస్తుందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలలో జరిగిన సంచలనాత్మక పరిశోధనలు ఈ నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి.
బర్మింగ్ హామ్ యూనివర్శిటీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ జెనోమిక్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ హిషామ్ మెహన్నా నేతృత్వంలో కీలక అధ్యయనం జరిగింది. ధూమపానం చేసేవారి కంటే కూడా ఓరల్ శృంగారం అలవాటు ఉన్నవారే ఒక ప్రత్యేక రకమైన గొంతు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని పిలుస్తారు.

కారణం ఏమిటి?
ఓరల్ శృంగారంకి, క్యాన్సర్ కు అసలు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV). ఈ వైరస్ లైంగిక కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఓరల్ శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదకరమైన వైరస్ గొంతు, శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలాలపై ప్రభావం చూపి కాలక్రమేణా అది క్యాన్సర్ గా మారడానికి కారణమవుతుంది.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
అయితే ఓరల్ శృంగారం చేసే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎవరికైతే బహుళ భాగస్వాములతో లైంగిక సంబంధాలు ఉంటాయో, వారికి ఈ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా 6 లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో ఓరల్ శృంగారం చేయడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఏకంగా 8.5 రెట్లు పెరుగుతుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రిటన్ లో దాదాపు 80 శాతం మంది పెద్దలకు ఓరల్ శృంగారం అలవాటు ఉన్నప్పటికీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. చాలామంది శరీరాల్లో హెచ్‌పీవీ (HPV) వైరస్ ను ఎదుర్కొనే సహజమైన ఇమ్యూనిటీ వృద్ధి చెందడమే.
ఈ గొంతు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?
క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం చాలా ముఖ్యం.
నయం కాని నోటి పుండ్లు: నోటిలో ఏదైనా పుండు ఏర్పడి, అది మూడు వారాలైనా తగ్గకుండా అలాగే ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
మింగడంలో ఇబ్బంది: ఆహారాన్ని మింగడానికి కష్టంగా అనిపించడం, మింగిన తర్వాత కూడా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అసౌకర్యంగా అనిపించడం.
నమిలేటప్పుడు నొప్పి: ఆహారాన్ని నమలడంలో లేదా దవడను కదపడంలో విపరీతమైన నొప్పి కలగడం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
