Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
నవరాత్రి ఉపవాసం తర్వాత ఆరోగ్యం అదుపులో ఉండాలంటే..ఈ తప్పులు అస్సలు చేయకండి!
శరన్నవరాత్రుల శోభ మొదలైంది. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారు. కొందరు ఒకరోజు, మరికొందరు రెండు రోజులు, ఇంకొందరు పూర్తి తొమ్మిది రోజులు నిష్టగా ఉంటారు. రోజుల తరబడి నిష్టగా ఉన్న మనసు, శరీరం..ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ఇష్టమైన ఆహారం కోసం తహతహలాడుతుంది. అయితే ఈ సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం తర్వాత మన జీర్ణవ్యవస్థ సున్నితంగా మారుతుంది కాబట్టి ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.
ఉపవాసం తర్వాత ఏం తినకూడదు?
నిపుణుల ప్రకారం ఉపవాసం ముగించిన వెంటనే జీర్ణవ్యవస్థపై భారం మోపకూడదు. ఉపవాసం తర్వాత మన జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. ఆ సమయంలో పకోడీలు, కచోరీలు, రాజ్మా వంటి నూనెలో వేయించిన, మసాలాలు దట్టించిన, కారంగా ఉండే పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.

ఆల్కలీన్ నుండి ఆమ్ల ఆహారానికి మారేటప్పుడు జాగ్రత్త
ఉపవాస సమయంలో మనం ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలు, దుంపలు వంటి ఆల్కలీన్ (క్షార గుణాలున్న) ఆహారాలు తీసుకుంటాం. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే దీక్ష విరమించాక వెంటనే టీ, కాఫీ, కారం, మసాలాలు వంటి ఆమ్ల గుణాలున్న (Acidic) ఆహారాలు తింటే అది జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ ఆకస్మిక మార్పు వల్ల గ్యాస్, అజీర్తి, కడుపులో మంట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో గ్యాస్ చేరితే కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటివి కూడా రావచ్చు. అలాగే స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఖాళీ కడుపుతో అధిక చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.
ఏం తినాలి? ఉపవాసాన్ని ఎలా విరమించాలి?
ఉపవాసాన్ని ఎప్పుడూ తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారంతోనే విరమించాలి.
కొబ్బరి నీళ్లు: శరీరానికి తక్షణ శక్తిని, అవసరమైన ఎలక్ట్రోలైట్ లను అందించి నీరసాన్ని తగ్గిస్తాయి.
తాజా పండ్లు: అరటిపండు, యాపిల్, దానిమ్మ వంటి పండ్లు జీర్ణవ్యవస్థపై భారం పడకుండా పోషకాలను అందిస్తాయి.
కూరగాయల సూప్: గోరువెచ్చని కూరగాయల సూప్ కడుపును శాంతపరచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పెరుగు లేదా మజ్జిగ: ఇవి మంచి ప్రోబయోటిక్స్ కలిగి ఉండి, జీర్ణవ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయి.
మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాస దీక్ష చేపట్టే ముందు తప్పనిసరిగా తమ డాక్టర్ ని సంప్రదించాలి. వారి సూచన మేరకే ఆహార నియమాలను పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
