Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
పొదుపైన ప్రత్యామ్నాయ కర్టెన్ల అలంకరణ!

1. కేన్ కర్టెన్లు - కేన్ కర్టెన్లు లేదా బాంబూ బ్లైండ్స్ కర్టెన్లకు చక్కటి సహజమైన ప్రత్యామ్నాయం. వీటిని వాష్ చేయాల్సిన పనిలేదు. కర్టెన్లంత త్వరగా మురికి పట్టవు. ఏ రకమైన అలంకరణకైనా సరే ఇవి సరిపోతాయి. వీటిలో రసాయనాలు వుండవు. నిర్వహణ, వాటి వ్యయం కూడా చాలా సమంజసమే. వారానికోసారి దుమ్ము దులుపుతూ వుంటే చాలు. వీటిని కడగవద్దు. తడిగా వుంటే వాసన వచ్చే ప్రమాదముంది. అందంగా కనపడతాయి. ఆకుపచ్చ, బ్రౌన్, పసుపు లాంటి వివిధ రంగులలో లభిస్తాయి.
2. కిటికీలకు రంగుల అద్దాలు- ఇక కర్టెన్లు లేకుండా కిటీకీల అద్దాలు రంగువి కనుక వేసినట్లయితే ఇంటిలోకి దట్టమైన వెలుగు ప్రసరించకుండా వుంటుంది. కిటీకీలు, గదులు వెడెక్కే సమస్య వుండదు. పగటిపూట బయటనుండి చూచే వారికి గదుల లోపలి భాగం కనపడదు. చీకటిలో మాత్రమే గదులలోపల లైటింగ్ వుంటే కనపడుతుంది.
3. చెక్క ఫ్రేములతో స్క్రీన్ - కర్టెన్లకు బదులుగా, చెక్క ఫ్రేముతో జూట్ మ్యాట్ కూడా వాడవచ్చు. జూట్ అనేది సహజమైనది. ఎక్కువ వ్యయం కూడా కాదు. వాటికి రంగు వేయవచ్చు. లేదా సహజంగానే వుంచవచ్చు. చాలా పర్యావరణ స్నేహి. మంచి వెలుగునిస్తుంది. మంచి గాలిని ప్రసరిస్తుంది.
4. అందంగా చేతిపని చేసిన చెక్క సెపరెటర్లు- రోజ్ లేదా టీక్ వుడ్ సెపరేటర్లు సాధారణంగా పెద్దగా వుండే గదులను వేరు చేయటానికి ఉపయోగిస్తారు. హాలు - డైనింగ్ ఒకే చోట వున్నపుడు రెంటిని వేరు చేయటానికి ఇటువంటి సెపరేటర్లను వాడవచ్చు. ఇవి ఇంటిలో ఎక్కడకు కావాలంటే అక్కడకు మార్చుకొనవచ్చు. వీటికి చేసే కళా నైపుణ్యం ఇంటి అలంకరణకు తోడ్పడుతుంది.
5. పెద్ద కుండీలలో మొక్కలు పెంచి కిటీకీలలో పెట్టడం- గదిలో పచ్చటి మొక్క వుంటే శుభ్రమైన గాలితో ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. కిటీకీల షెల్ఫ్ లో కొంచెం పెద్దగా ఎదిగిన మొక్కలను కుండీలతో పెడితే బాగుంటుంది. తక్కువ ఖర్చు. మొక్కలకు కిటికీలో పెట్టటం వలన మంచి సూర్యరశ్మి లభిస్తుంది. కంటికి పచ్చగా, అందంగా కనపడుతూంటుంది. అయితే, కుండీ కింద పెట్టే ప్లేట్లలోని నీరు ఎప్పటికపుడు తీసివేస్తూ గది శుభ్రంగా వుండేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications