Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాతబడితే.? కొత్తకు ...ఐడియా వేయండి!

తొలగించండి - గత పదేళ్ళుగా గోడలమీద పెట్టిన వాల్ హేంగ్ లు లేదా షో పీసులు, లేదా గడియారాలు వంటివి అన్నీ తీసేయండి. ఆకర్షణీయమైన ఒక్క పెయింటింగ్ పెడితే చాలు. చూసే వారి శ్రధ్ధ అంతా దానిమీదే వుండి బాగుందనిపిస్తుంది.
ఫర్నిచర్ స్ధలాలు మార్చండి - ఇంటిలోని సోఫా, ఫ్రిజ్ వంటివి ఏళ్ళ తరబడి ఒకే చోట పెట్టేస్తూంటాం. ఇటువంటి వాటిని ఇంటిలో మరో చోట మరో దిశగా పెట్టి నూతనత్వం ఏర్పరచండి. కనీసం వీటిని అక్కడనుండి తొలగించేటపుడైనా ఇల్లు శుభ్రం బాగా చేసుకోవచ్చు.
రంగు వేయండి - సొమ్ము ఖర్చు పెట్టి ఇల్లంతా రంగులు వేయనవసరంలేదు. కొత్త ఐడియాగా ఇంటి లివింగ్ రూమ్ లో ఒకే ఒక గోడను బ్రైట్ కలర్ తో రంగువేయించండి. ఆ గది మొత్తానికి అదే ప్రత్యేకత.
కొత్తగా ఆలోచించండి - ఇంటి రూపం మారిపోయే ఆలోచన ఒకటి చేయండి. ఫర్నిచర్, పెయింట్ వంటివి కాకుండా, అందమైన కర్టెన్లు గదిలో విండోలకు, తలుపులకు వేసి కొత్త లుక్ తీసుకురండి.
తక్కువ ఖర్చుతో - తక్కువ ఖర్చుతో చిన్న చిన్న మార్పలు చేయండి. టేబుల్ కవర్, లేదా ఫ్రిజ్ కవర్, టేబుల్ మ్యాట్స్, సెంటర్ పీస్ వంటివి కొత్తవి వేయండి.
లైట్స్, కెమేరా, యాక్షన్ - ఇంట్లో వుండే లైటింగ్ మార్చినా కొంత మార్పుగా వుంటుంది. మామూలు బల్బుల స్దానంలో సిఎఫ్ఎల్ ల్యాంపులు లేదా ట్యూబ్ లైట్లు వేయించండి. ఛాండిలీయర్ లో మామూలు బల్బులకు బదులు, సిఎఫ్ ఎల్ బల్బులు పెట్టి ఇల్లంతా తెల్లటి కాంతిమయం చేయండి.
ఈ అలంకరణ చిట్కాలు పాటిస్తే, ఇంటి స్వరూపం మారి మీలో కొత్తదనం పుట్టుకొస్తుంది.



Click it and Unblock the Notifications