Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఆధునిక వంటగది అలంకరణ....

ఆధునిక వంటగది తీరు, వాటి డిజైన్లు -
ఆధునిక కిచెన్ గోడలకు అందమైన టైల్స్ లేదంటే చక్కని కిచెన్ కేబినెట్లు వివిధ రంగులు, రూపాలలో మార్కెట్లో రెడీమేడ్ గా లభిస్తున్నాయి. తగినంత జాగా వుండాలేగాని కిచెన్ లో వివిధ రకాల కేబినెట్లకు స్ధానం కల్పించవచ్చు. పని చేసే స్ధలాన్ని పెంచుకొని, నడిచే ప్రదేశాన్ని తగ్గించవచ్చు. ఉపయోగమూ, స్టైలూ రెండూ కలిపిన రీతిలో కిచెన్ డిజైన్ చేసుకోవాలి.
కిచెన్ లో చేసే పని మీ కుటుంబంలోని వారికి ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో చక్కటి గాలి వెలుతురులతో వుండాలి. సహజమైన వెలుతురు లేకుంటే, కంటికి చల్లగా వుండే ఫ్లోరసెంటు బల్బులను వాడండి. కిచెన్ లోని కేబినెట్లకు లేదా గోడలకు కంటికింపైన చల్లని రంగులు వాడండి. నేటి రోజులలో కిచెన్ ప్రదేశంలో రెండు లేదా మూడు రంగులు కూడా వాడుతున్నారు. కిచెన్ కు ముందరి భాగంలో 'ఓపెన్ కిచెన్ ' అన్న పేరుతో మరో చిన్న కిచెన్ లివింగ్ రూమ్ కు కనపడేలా డిజైన్ చేస్తున్నారు. కిచెన్ కేబినెట్లు కలప లేదా లామినేషన్ తో తయారు చేసుకోవచ్చు. లామినేషన్ చేసిన కప్ బోర్డులైతే శుభ్రం చేయటం తేలిక. ఎపుడైనా ఒకసారి వాటిని శుభ్రం చేస్తూ వుంటే చాలు ఎల్లపుడూ తళతళలాడుతూనే వుంటాయి. దీర్ఘకాలిక మన్నిక కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications
