Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మైక్రోవేవ్ ఓవెన్ కొనాలనుకొంటున్నారా...?

మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్ ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్ లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్ ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్ లో 700 వాట్‌ల ఓవెన్ ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్ లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్ తో ఓవెన్ ను ఎంపికచేసుకోవచ్చు. 700 వాట్ మీద వంట చేయటం వల్ల వంట త్వరగా పూర్తవుతుంది. అంతే కాదు ఎక్కువ వేడి మీద కూడా పూర్తవుతుంది.
అలాగే ఓవెన్‌లో రెండవ ప్రధాన అంశం కంట్రోల్ పానెల్. చాలా మంది కంట్రోల్ పానెల్ కన్నా డయల్స్ ఉన్న ఓవెన్ ను కొంటారు. డయల్స్ తోనే వారికి అలవాటైపోతుంది కాబట్టి. అయితే టచ్ పానెల్ తో ఓవెన్ ను కొనుక్కుంటే అది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పది నంబర్లతో కూడిన టచ్ పానెల్ సౌకర్యం ఓవెన్‌కు ఉంటే మరింత బాగుంటుంది. ఒక్కో పానెల్ లో కనీసం మూడు పవర్ లెవల్స్ ఉండేలా చూసుకోవాలి. అన్ని ఓవెన్ లు పదార్ధాలను 100 శాతం ఉడుకిస్తాయి.
అయితే కొన్ని పదార్ధాలను వంట చేసే ముందు డీఫారెస్ట్ చేయాలంటే 30 శాతం అదనంగా పవర్ లెవల్ ఉండాలి. క్యాబినెట్ కింద ఉండే మోడల్ సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ టేబుల్ మీద పెట్టుకోవడానికి వీలయ్యే, ఓవెన్ లతో ఉపయుక్తంగా ఉంటుంది. అంటే వంటకాన్ని భద్రంగా ఓవెన్ లోనే వదిలేయవచ్చు. దానిలో మరిన్ని దినుసులు వేసి కలుపుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ లో వంట చేసేటప్పుడు వంటతో పాటు సమయం మీద కూడా ధ్యాస పెట్టాలి. దేనిని ఎన్ని నిముషాలకు వేడి చేయాలనే నియమాలు అందులో ముందుగానే నిర్ధారితంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
