Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
క్రిస్మస్ స్పెషల్ కొవ్వొత్తుల అలంకరణ విధానాలు!
కుటుంబంతో చేసే విందులకు, పెళ్ళిళ్ళకు, ధార్మిక కార్యక్రమాలకు, చివరికి రోజంతా కష్టపడ్డాక చేసే బుడగ నీటి స్నానాలకు కూడా కొవ్వొత్తులు మరింత ప్రాముఖ్యాన్ని సంతరింప చేస్తాయి. ఒక సాదా పొడవాటి కొవ్వొత్తిని టేబుల్ మధ్యలో ఉంచినా వెలుగు వస్తుంది గానీ, దాని సౌమ్యమైన రెపరెపలాడే వెలుగును మరిన్ని ఆసక్తికరమైన మార్గాల్లో ఉద్దీపనం చేయవచ్చు.
రంగు రంగుల పెద్ద క్రిస్మస్ బంతులు డిసెంబర్ దాకా పెట్టెలో దుమ్ము కొట్టుకు పోకూడదు. దాని బదులు, కొవ్వొత్తి వెలుగును అవి మరింత ప్రకాశవంతం చేయవచ్చు. మీ ఇంటి సహజ వాతావరణం మరింత బాగుండేలా చేసే అలంకరణలు ఎంచుకోండి. ఉదాహరణకు, టాన్ నైరుతి శైలి ఇళ్ళకు రాగి, రేగుపండు రంగు ఆభరణాలు ఎంచుకోండి. వీటిని ఒక పెద్ద గాజు గిన్నె లో లేదా లోటు తక్కువున్న వెడల్పాటి గిన్నె లో వుంచండి. గిన్నె మీద చిన్న చిన్న కొవ్వొత్తులు వుంచండి లేదా పొడవాటి పెద్ద కొవ్వొత్తులను గిన్నె లోపల వుంచి దాని చుట్టూ ఆభరణాలు వుంచండి.

క్రిస్మస్ ఆభరణాలు: రంగు రంగుల పెద్ద క్రిస్మస్ బంతులు డిసెంబర్ దాకా పెట్టెలో దుమ్ము కొట్టుకు పోకూడదు. దాని బదులు, కొవ్వొత్తి వెలుగును అవి మరింత ప్రకాశవంతం చేయవచ్చు. మీ ఇంటి సహజ వాతావరణం మరింత బాగుండేలా చేసే అలంకరణలు ఎంచుకోండి. ఉదాహరణకు, టాన్ నైరుతి శైలి ఇళ్ళకు రాగి, రేగుపండు రంగు ఆభరణాలు ఎంచుకోండి. వీటిని ఒక పెద్ద గాజు గిన్నె లో లేదా లోటు తక్కువున్న వెడల్పాటి గిన్నె లో వుంచండి. గిన్నె మీద చిన్న చిన్న కొవ్వొత్తులు వుంచండి లేదా పొడవాటి పెద్ద కొవ్వొత్తులను గిన్నె లోపల వుంచి దాని చుట్టూ ఆభరణాలు వుంచండి.

పుస్తకాలు: కొవ్వొత్తుల ప్రదర్శన గందరగోళ౦గా వుండక్కర్లేదు లేదా ఖరీదైనది కావక్కర్లేదు. సాహితీ ప్రియులకు కేవలం పుస్తకాలతో కొవ్వొత్తుల ప్రదర్శన కూడా చాలా బాగుంటుంది. మీ శైలిని, అభిరుచిని ప్రతిబింబించే పుస్తకాలను ప్రదర్శనకు వాడి మూడు పుస్తకాలను ఒకదాని పై ఒకటి వుంచండి. తరువాత, మూడు వేర్వేరు ఎత్తుల్లో వున్న కొవ్వొత్తులను పుస్తకాలపై వుంచండి. పుస్తకం నేపధ్యాన్ని మెరుగు పరచడానికి కొవ్వొత్తి రంగుని ఉపయోగించండి. ఉదాహరణకు, ఎర్ర రంగు కొవ్వొత్తులను ఎంచుకుని, వాటిని ఎర్రటి సాటిన్ గుడ్డలో బంధించండి. ఈ ప్రదర్శనను ప్రముఖంగా కాఫీ టేబుళ్ళ మీద, బుక్ షెల్ఫుల మీద లేదా చివరి టేబుళ్ళ మీద వుంచండి.

తేలియాడే కొవ్వొత్తి ఉద్యానవన౦: బాత్ రూమ్ లు, లేదా కిచెన్ శిన్కుల లాంటి నీటి ఆధారిత ప్రదేశాల్లో కొవ్వొత్తుల తోటలు బాగా పని చేస్తాయి. కొవ్వొత్తి తోటలు తయారు చేయడానికి ఒక గాజు గిన్నె, తేలియాడే కొవ్వొత్తులు, రాళ్ళు, నకిలీ పూలు, మీకిష్టమైన ఇతర అలంకరణలు కంటే కొంచెం ఎక్కువ కావాలి. ఒక పెద్ద గిన్నె లో లేదా మూడు వేర్వేరు సైజులున్న గాజు జార్లలో నీరు నింపండి. గిన్నె లోపలి భాగంలో రాళ్ళను వరుసగా ఉంచండి. పెద్ద, నున్నగా వుండే నల్లటి రాలు, లేదా చిన్న, రంగుటద్దాలు కూడా వాడి చూడండి. నీటిలో నకిలీ పూలు వుంచి వాటి పైన తేలియాడే కొవ్వొత్తులు వుంచండి.

మంజానిటా చెట్టు: మట్టి ఇళ్ళలో మంజానిటా కొమ్మలు కొవ్వొత్తుల ఏర్పాటుకు అందమైన వేదికను అందిస్తాయి. పెద్దగా లోటు లేని ఒక చెక్క గిన్నెలో మంజానిటా కొమ్మను జిగురుతో అతికించండి. గిన్నె నిండా రాళ్ళు వుంచండి. పొడవాటి వేలాడే కొవ్వొత్తుల హోల్డర్ లలో చిన్న టీ కాండిల్స్ వుంచండి. ఇప్పుడు, కొవ్వొత్తులను చెట్టు కొమ్మనుంచి వేలాడదీయండి. కొమ్మలకు మంట అంటుకోనంత ఎత్తులో కాండిల్ హోల్డర్లు ఉండేలా నిర్ధారించుకోండి.

గాజు గిన్నెలు: కాండిల్ హోల్డర్లు గా ఖాళీ సీసాలు వాడండి. ప్రాచీన వస్తువులు అమ్మే దుకాణాల్లో వేర్వేరు సైజుల్లో, ఆకారాల్లో, రంగుల్లో వుండే జార్లు కొనండి. కొన్నిటిని మూలికలు, అడవి పూలు లేదా సముద్రపు అద్ద౦ వుంచి మిగతా వాటిలో కాండిల్ స్టిక్స్ వుంచండి. అన్ని సీసాలను ఒక అలంకరణాత్మక టైల్, పాత ట్రే లేదా డిష్ మీద వుంచండి, సముద్రపు అద్దంతో నింపిన సీసాలు, నత్త గుల్లలు లాంటి సంబంధించిన ఇతర వస్తువులను పళ్ళెం మీద వుంచండి.



Click it and Unblock the Notifications