Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
క్రిస్మస్ ట్రీ అలంకరించడానికి అద్భుతమైన ఐడియాలు...!
క్రిస్మస్ అంటే ముఖ్యంగా ప్రధానాంశం క్రిస్మస్ ట్రీ.. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీన్ అందంగా అలంకరిస్తాం. అయితే క్రిస్మస్ ట్రీని ఎప్పుడు అలంకరించినట్లే ఈ సంవత్సరం కూడా అలంకరించడం అంటే బోర్ కొడుతుంది కదా? మరి తాజా ఐడియాస్?ఈ ప్రశ్నకు సమాదానం చాలా సింపుల్: ఇతర క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చూడటమే.. మీకు క్రిస్మస్ ట్రీ ఎలా డెకరేట్ చేయాలో తెలియనప్పుడు ఆల్రెడీ ప్రత్యేకంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీని వారి దగ్గర నుండి ప్రార్థించి(అడుక్కొని)లేదా అప్పు తెచ్చుకోవడమో లేదా దొంగిలిచడమో చేయాలి?. వీటిలో ప్రార్థించడం కొంచెం మర్యాదపూర్వకమైనది. కాబట్టి మీరు మీ స్వతహాగా మీ క్రిస్మస్ ట్రీన్ అద్భుతంగా అలంకరించాలంటే కొన్ని అద్భుతంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీలను మీకోసం అందిస్తున్నాం చూడండి..
క్రిస్మెస్ ట్రీ ని అలంకరించడానికి ఓ ఉత్తమమైన ఆలోచనతో కూడిన ప్రత్యేకత ఉండాలి. చాలా వరకూ కొన్ని క్రిస్మస్ ట్రీలను లైట్స్ మాత్రమే అలంకరిస్తారు. లైట్ ను క్రిస్మస్ ట్రీ మీద జారవిడచంలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. కొన్ని ఫైర్ లైట్స్ ఉంటే, మరికొన్ని ట్యూబ్ లైట్స్, ఇంకా సాధారణ కొవ్వొత్తులు కూడా క్రిస్మస్ ట్రీని సమ్మోహనంగా తయారు చేయవచ్చు. మరో ఐడియా ఓ డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్న క్రిస్మస్ ట్రీ వెనుక వైపు బాగా దట్టమైన మంచుతో కప్పబడినట్లు అలంకరించవచ్చు. కాబట్టి మీరు ఎల్లప్పూడ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ లో తప్పకుండా తెలుపు వర్ణంలో ఉన్న మంచును థీమ్ గా ఎంచుకొని ఉపయోగించవచ్చు. ఈ మంచుకోసం ప్యూర్ వైట్ కలర్ లో ఉన్న పత్తిని ఉపయోగించవచ్చు.

మంచుతో క్రిస్మస్ ట్రీ: మీరు మంచు(థీమ్)తో క్రిస్మస్ ట్రీ అలంకరించుకోవాలనుకొన్నప్పుడు తెల్లగా ఉన్న పత్తిని ఉపయోగించి ఇలా అలంకరిచవచ్చు.

బాల్ తో క్రిస్మస్ ట్రీ: క్రిస్మస్ ట్రీని ఎరుపు లేదా గోల్డ్ కలర్ లో మెరుస్తున్నటువంటి బాల్స్ తో ఇలా అలంకరణ చేసుకోవచ్చు . మీ అభిరుచిని బట్టి ఎక్కువ కలర్స్ ఉన్న బాల్స్ తో కూడా అలంకరణ చేసుకోవచ్చు.

ట్వింకిల్ ట్వింకిల్: క్రిస్మస్ ట్రీన్ ప్లేథోర గ్లిట్టరింగ్ స్టార్స్(మెరిసే నక్షత్రాల లాంటి) లైట్లతోటి అలంకరణ. దీన్ని చూస్తుంటే మనం చిన్నప్పుడు చదువుకొన్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోయం గుర్తుకు వస్తుంది...

ఆఫిల్ థీమ్ క్రిస్మస్ ట్రీ: క్రిస్మస్ ట్రీన్ నిజమైన ఆపిల్స్ తోటి అలంకరించడం. ఇంకా కావలానుకొంటే మీకు నచ్చని పండ్లతోటి అలంకరణ చేసుకోవచ్చు. అయితే ఆ పండ్ల కలర్ ముదురు వర్ణంలో(స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్) ఉన్నట్లైతే చాలా బాగుంటుంది.

లైట్ థీమ్: ఈ క్రిస్మస్ ట్రీలో గ్రీన్ లీవ్స్(పచ్చని ఆకులు)లేవు. ఈ క్రిస్మస్ ట్రీ ఆకుల మొత్తం మెరిసేటటువంటి ఫైర్ లైట్స్ తో అలంకరించబడినది. ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఎలక్ట్రానికి ట్రీ: ఇది జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఎలక్ట్రానిక్ ట్రీ. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని వివిధ రంగుల్లో ఉన్న ట్యూబ్ లైట్స్ తో అలంకరించి తయారు చేసుకోవచ్చు.

క్యాండిల్ లైట్ ట్రీ: ఇది కూడా జర్మనీలో ఒక ప్రదేశంలోనిఒక పెద్ద ఎలక్ట్రానికి ట్రీ. ఇలా మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వివిధ రకాల కలర్ ట్యూబ్ లైట్స్ (క్యాండిల్స్)తో అలంకరణ చేసుకోవచ్చు.

టాయ్ ట్రైన్ ట్రీ: ఈ క్రిస్మస్ ట్రీలో ప్రత్యేకత ఏమిటంటే టాయ్ ట్రైయిన్ మరియు ట్రాక్స్ అక్కడక్కడా అలంకరించబడి అద్భుతంగా ఉంది.

ఫ్లవర్ క్రిస్మస్ ట్రీ: ఈ క్రిస్మస్ ట్రీ ఆరెంజ్ ఎల్లో ఫ్లవర్స్ తో చాలా అద్భుతంగా ఫ్లవర్స్ క్రిందికి చూస్తున్నట్లు అలంకరించబడినది.

లేస్ క్రిస్మస్ ట్రీ: స్టైయిన్ కలర్ లేస్ ను క్రిస్మస్ ట్రీకి చుట్టడం వల్ల ఇది ఓ అద్భుతమైన థీమ్ ను తలపిస్తోంది.

వైట్ లైట్స్ ట్రీ: ఈ క్రిస్మస్ ట్రీ వైట్ కలర్ లైట్స్ తో అద్భుతంగా ఫిక్స్ చేయబడినది.

రోజ్(గులాబీ) థీమ్: ఈ క్రిస్మస్ ట్రీ ప్రత్యేకంగా ఎరుపు గులబీలతో లైట్స్ మధ్య అద్భుతంగా అలంకరించబడినది.
క్రిస్మస్ ట్రీ డెకరేషన్ లో మరో ఐడియా ఆపిల్స్, బాణాలు, స్పాక్లర్స్ మరియు లేస్ లు వంటి వాటితో అలంకరించవ్చు. ఒక్కొక్కటే కాకుండా వీటన్నింటిని కలగలిపి కూడా క్రిస్మస్ ట్రీను అద్భుతంగా అలంకరించవచ్చు. క్రిస్మస్ ట్రీ అలంకరించడంలో మీకు ఓ స్పష్టమైన అవగాన కలిగించడం కోసం ఆల్రెడీ అలంకరించిన క్రిస్మస్ ట్రీలు మీకోసం కొన్ని...



Click it and Unblock the Notifications
