Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
ఇంట్లో కార్పెట్..ఫర్నీచర్ శుభ్రత...?

1. కార్పెట్ లను శుభ్రపరిచి.. దాచిపెట్టాలి. వాటికి బదులుగా ప్లాస్టిక్ షీట్లు పరచాలి. అలానే గుమ్మం దగ్గర చిన్నగా ఉన్న వెదురు చాపలు లేదా తేమను పీల్చుకునే మందపాటి గోనె సంచులు వేస్తే బురద, తేమతో ఇబ్బందులుండవు.
2. ఇకపోతే పాతకాలం నాటి ఫర్నీచర్ లాంటివి ఏమైనా మీ గృహంలో ఉన్నట్లయితే... ఆ గదిలో "డీహ్యూమిడిఫయర్" ఉంచటం మంచిది. అలాగే ఫెస్ట్ కంట్రోల్ సేవలు మరీ మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో చెదలు, ఎలుకలు, బొద్దింకలు, బల్లులతో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
3. గుమ్మాలకు, కిటికీలకు పలుచని వస్త్రాలను కట్టాలి. ఎందుకంటే ఎండ సమయంలో సూర్యకిరణాలు, వెలుతురు లోపలికి ప్రసరిస్తాయి. గదిలో తేమ లేకుండా పొడిగా అవుతుంది.
4. ఇంట్లో అలంకరణకు పచ్చటి మొక్కలను ఆచితూచి ఎంచుకోవాలి. అవి తేమను ఎక్కువగా విడుదల చేస్తాయి. కాబట్టి అలంకరణ కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎంచుకోవడం మేలు. కాషాయం, పసుపు, ఎరుపు రంగులతో కూడిన అలంకరణ సామగ్రి ఇంటికి అందాన్నిస్తాయి. ముదురు రంగులు నప్పవు.. వాటిమీద దుమ్ము కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పడు శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది.
5. వార్డ్ రోబ్‌లు, కప్‌బోర్డులు లాంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే వర్షాకాలంలో గోడలు తడవటంతో అవి చెమ్మగిల్లి పాడైపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చెక్క కప్‌బోర్డుల్లో, అల్మరాల్లో కర్పూరాన్ని వేయాలి. అది తేమను పీల్చుకుంటుంది. చెక్క భద్రంగా ఉంటుంది. దుస్తుల్లో లవంగాలు, వేపాకు వేస్తే అరోమా వాసనలు వస్తాయి.
6. వెదురునేల మీద మైనంతో పూత వేస్తే తేమను పీల్చుకోకుండా ఉంటుంది. అలానే కార్పెట్‌ను ప్రతిరోజూ వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచాలి. ఇంటికి వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల తేమ గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి వస్తుంది.



Click it and Unblock the Notifications
