Latest Updates
-
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? -
వినాయకుడు ఏకదంతుడు ఎందుకు అయ్యాడు? అసలు కథ -
ప్రోటీన్, క్యాల్షియం గని ఈ లడ్డు..రోజుకొక్కటి తింటే మీ శరీరానికి కొండంత బలం! -
లవ్ బైట్ ప్రాణాలు తీస్తుందా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
తక్కువ మటన్ తో ఎక్కువ గ్రేవీ..రుచిలో అదిరిపోయే తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం -
భాగస్వామి ఫోన్ ను పదే పదే చెక్ చేయడానికి అసలు కారణాలివే..! -
మన పూర్వీకులు 100 ఏళ్లు ఆరోగ్యంగా బతకడానికి కారణమైన జొన్న గట్కా.. ఎలా చేయాలో తెలుసా? -
2026 జూన్ 13: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ధనలాభం, కెరీర్ వృద్ధి మీ సొంతం!
ఇంటికి కొత్త కళ తీసుకొచ్చే అధునాతన వస్తువులు...!

ఎంత ఖరీదైన ఇల్లయినా సరే..చూడముచ్చటైన డిజైనర్ వస్తువులని అక్కడక్కడా అమర్చుకొంటేనే కొత్త కళ. ఆధునిక చిత్రాలు, తీర్చిదిద్దిన దీపపు చిమ్మెలు(ల్యాంప్ షేడ్లు)పాలరాతి శిల్పాలు, చుట్టూ అందమైన అంచులతో ఆవిష్కరించిన అద్దాలు ఇలా ఇప్పుడు ఎన్నోమార్కెట్లోకి వస్తున్నాయి. ఇంటికి స్వాగం పలుకుతూ గుమ్మం దగ్గర ఓ అందమైన నేమ్ బోర్డ్.. ఆ కిందే టెర్రాకోటతో చేసిన బొమ్మలని కానీ, కుండీలని కానీ ఉంచితే ఇంట్లో అడుగుపెడుతూనే ఒక రకమైన హాయి, సానుకూల స్పందనలు కలుగుతాయి.
లివింగ్ రూమ్... అందరూ వచ్చిపోయే గది. అందంగా తీర్చుదిద్దుకోవడంతో అదో రకమైనటువంటి హాయి. అందుకే ఎక్కువగా ఫోకస్ లివింగ్ రూమ్ మీదనే పెడుతుంటారు. అక్కడే చక్కని పనితనంతో తీర్చిదిద్దిన కుషన్లు ఉన్న సోఫా సెట్ ని అమర్చుకోవాలి. దానిపైన ఒక తైల వర్ణ చిత్రం. వీలైతే పక్కన ఒక ల్యాంప్ షేడ్ ... లేదా ఒక పచ్చని బోన్సాయ్ వృక్షం. ఈ అలంకరణ అతిథుల మనసు దోచుకుంటుంది.
వంట గదిలో అందమైన పాత్రతలతో పాటు చాకులు, పీలర్లు పెట్టుకొనే స్టాండ్లు కాయగూరలు పెట్టుకొనే తొట్టెలు, ఈ గదికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి.
భోజనాల గదిలో టేబుల్ ని సాదాగా వదిలేయా్సిన అవసం లేదు. అలకంరణకి వేదికగా మార్చుకోవచ్చు. దానిపై అందంగా ఉండే పండ్ల బుట్టుల, డిజైనర్ కొవ్వొత్తులు, న్యాప్ కిన్లు పెట్టుకొనే స్టాండులని అమర్చుకొంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. పిల్లలు ఇఫ్టపడి తినేలా చేయాలనుకొంటే కార్టూన్ బొమ్మలున్న టూత్ పిక్ లు లభ్యమవుతున్నాయి. వాటిని బల్లపై ఉంచితే సరి. వాటికోసమైనా పిల్లలు సలాడ్లని ఇష్టంగా లాగించేస్తారు.
ఇంటికి అతిథులు వస్తే వారిని ఆకట్టుకొనేలా వడ్డించాల్సి వచ్చినప్పుడు... అందుకోసం ప్రస్తుతం యాంటిక్ తరహాలో చిన్ని చిన్న చక్కాలతో ఆకట్టుకొనే సర్వింగ్ ట్రాలీలు ఇప్పుడు నయా తరహా డిజైనర్ వస్తువులు అందులో టీ, స్నాక్స్, పండ్లు వంటివి పెట్టి అతిథులకు అందించి, వారి మన్ననలు పొందవచ్చు.
పడకగది. ఒత్తిడిని పోగొట్టే ఈ గది ఎంత అందంగా ఉంటే మనకంత హాయి. ఇక్కడ కేవలం మంచంపై చక్కని దుప్పటిని వేసి అలంకరిస్తే సరిపోతుందిలే అనుకోకూడదు. ఈ గదిలోని అరల్లో కొత్తగా వస్తున్న ఫోటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులూ, డిజైనర్ గడియారాలు ఉంచితే ఈ గది చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలుంటే ఒక మూలగా సాప్ట్ టాయిస్ బొమ్మలన్నింటిని అమర్చుకోవచ్చు. పిల్ల పడకగది అయితే బొమ్మలతో పాటు కార్టూన్ బొమ్మలుండే గడియారాలు, లైట్లు, పెన్ను స్టాండ్లు పేట్టుకోవచ్చు.
స్నానాలగదేగా అని తీసిపారేయొద్దు. ఉదయాన్నే మనకు ఉత్సాహాన్ని, హుషారునీ ఇచ్చేది ఈ గదే. అందుకే దీనిని వీలైనంత అందంగా అమర్చుకోవాలి. ఇందులో తువాలు పెట్టుకొనే రాడ్డు, బ్రష్ లు ఉంచుకొనే తొట్టెలు వైవిధ్యంగా దొరుకుతున్నాయి. ఒక్కసారి అమర్చి చూడండి. పిల్లలు, శ్రీవారి మన్ననలు అందుకోండి.
బాల్కనీలో చాలా మంది అనవసరపు వస్తువులు పెడుతుంటారు. ఆ ప్రాంతాన్కొక స్టోర్ రూమ్ గా మార్చేస్తుంటారు. అక్కడి చెత్తనంతా తీసేసి సిరామిక్ కుండీల్లో వేసిన నాలుగు మొక్కలని, కేన్ ఊయలనీ పెట్టుకొని చూడండి ఎంత హాయిగా ఉంటుందో.
ఒకప్పుడు అద్దాల అలంకరణంటే సాదాగా చేసినవే కనిపించేవి. కానీ ఇప్పుడో యాసిడ్ ఫినిష్, స్టెయిన్ గ్లాస్ వంటి బోలెడు రకాలు దొరుకుతున్నాయి. మక్కువను బట్టి ఎంచుకునే ప్రయత్నం చేయాలి.



Click it and Unblock the Notifications