Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వేసవిలో ఎలక్ట్రానిక్ వస్తువులతో హాని..?

1. ఒక్కో సారి మనం సెల్ ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక, చార్జర్ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటాం. ఇలా చేయడం వల్ల రెండు నష్టాలున్నాయి. మొదటిది.. ఫోన్ తీసేసినప్పటికీ విద్తుత్తు వినియోగం అవుతూనే ఉంటుంది. రెండోది..విద్యుత్తు వాడకం వల్ల గదిలో కొంత వేడి ఏర్పడుతుంది. కాబట్టి, అవసరం లేనప్పుడు సెల్ ఫోన్ చార్జర్, టీవీ, మిక్సీప్లగ్ లను సాకెట్ నుంచి తీసేయండి.
2. ఇంట్లో ఇన్ క్యాండిసెంట్ బల్బుల స్థానంలో ప్లోరొసెంట్ ల్యాంపులు వాడితే మంచిది. అంతే వెలుతురు ఇస్తూ.. కేవలం ఐదోవంతు విద్యుత్తును మాత్రమే వాడుకుంటాయివి. ఇంట్లో స్ల్పిట్ ఏసీ ఉంటే.. రోజంతా వాడకం సరైంది కాదు. అవసరం ఉన్నప్పుడే ఏసీని ఆన్ చేయండి. ఏసీ థర్మోస్టాట్ పక్కన బల్బులు, టీవీలు, వేడి కల్గించే ఉపకరణాల్ని పెట్టొద్దు. ఆ వేడి వల్ల ఏసీలు అవసరానికి మించి ఎక్కువ సేపు ఆన్ లో ఉంటాయి. ఫలితం.. విద్యుత్తు వృథా.
3. ఇంటి పై కప్పు వద్దే అడ్డు కట్ట: ఇంట్లోకి వేడి ఎక్కువగా వచ్చేవి పై కప్పు నుంచే, కాబట్టి వేడిని నిరోధించడానికి దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.
4. వేసవిలో వేడి నిరోధానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులున్నాయి. లిక్విడ్ల రూపంలో, సున్నం ఆధారిత హీట్ ప్రూఫ్ ఇన్సులేషన్లు వాడితే సరిపోతుంది. గాల్లో తేమ వల్ల కూడా ఇంట్లో వేడి పెరుగుతుంది కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇంట్లో తేమను తగ్గించాలి.
5. మధ్యాహ్నం వేళలో.. వంట చేయడం.. వాషింగ్ మెషిన్లో ఉతకడం వంటివి తగ్గించాలి. మీరు నమ్మకపోవచ్చు కానీ, లివింగ్ రూమ్ లో టీవీ వేడిని పెంచుతుంది. టీవీని కట్టేసిన కొంతసేపటి తర్వాత చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
6. ఇంట్లో ముఖ్యంగా మొక్కలుంటే ఏసీ యూనిట్ల పక్కన నీడనైతే కల్పిస్తాయి కానీ, కొన్నిసార్లు యూనిట్ కు గాలి రాకుండా నిరోధిస్తాయి. కాబట్టి, ఇలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. నీడ కింద ఏసీ యూనిట్ ఉండటం వల్ల ఓ లాభముంది. విద్యుత్తు వినియోగం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
