Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఎండిన గులాబీ రేకులతో ఇంటీరియర్ అలంకరణ...
రోజ్ (గులాబీ) పువ్వు అంటే ఇష్టపడిన వారుండరు. ఎందుకంటే పండ్లలో మహరాజు మామిడి పండు అయితే పువ్వుల్లో మహరాని గులాబీ పువ్వు. గులాబీ పువ్వులో ప్రేమకు చిహ్నాలు. గులాబీ పువ్వులను వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తూ మనస్సులోని హావభావాలను తెలియజేస్తుంటారు. అలాంటి గులాభీ పువ్వు మొక్కలు ఇంట్లో పెంచుకోవచ్చు లేదా మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. పడకగదిలో ఒక గులాబీ పువ్వు లేదా గులాబీ పువ్వుల బొకే ను ఉంచేతే చాలా గదికి ఎంత ఆకర్షణ కలిగిస్తోందో...ఎరుపు రోమాన్స్ కు చిహ్నమైతే ఎరుపు గులాబీ నుండి వచ్చి గుభాళించే సువాసనలు కపుల్స్ యొక్క మూడ్ ను మార్చి ఉద్వేగాలకు గురిచేసి ఆనందగా గడపడానికి బాగా దోహదం చేస్తాయి.
గులాబీ బొకేస్ లేదా గులాబీ కాడలను ఇంట్లో మెయింటేన్ చేయాడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఎండిన వెంటనే వాటిని తొలగించి వాటి ప్లేస్ లో ఫ్రెష్ పువ్వులను అమర్చుతుండాలి. ఇలా చేయడానికి మంచి మూడ్ మరియు శక్తి కలిగి ఉండాలి అప్పుడే వారం కానీ నెలలు తరబడి కానీ మీరు చేయగలరు. కొన్ని రోజుల తర్వాత గులాబీకాడలను మార్చడానికి బద్దకించినప్పుడు ఆ ఎండిన గులాభీ రేకులను మరో విధంగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

1. వివిధ రంగుల్లో ఉన్న గులాబీ పువ్వలను నుండి గులాబీ రెకులను వేరు చేయాలి. లేదా ఒకే కలర్ గులాబీ రేకులను కూడా తీసుకోవచ్చు. మీ ఇంటి గోడ కలర్ లేదా రూమ్ అలకరణ సరిపోయే ఫ్లవర్స్ నుండి గులాబీ రేకులను వేరు చేయాలి.
2. ఈ గులాబీ రేకులను పేపర్ టవల్ మీద పరవాలి. దాంతో గులాబీ రేకుల్లో ఉన్న నీటిని పీల్చుకొనేస్తుంది. ఇంకా గులాబీ రేకుల్లో ఉన్న దాగున్న క్రిములను తొలగిస్తుంది.
3. తర్వాత మైక్రోవెవ్ మీద ఈ గులాబీ రేకులను పెట్టి ఒకటి రెండు నిముషాలు డ్రై అవ్వనిచ్చి పక్కకు తీసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక పేపర్ మీద పరచి గాలి చొరబడని ప్రదేశంలో ఉంచి ఒక వారం పాటు బాగా ఎండనివ్వాలి.
4. ఎప్పుడైతే ఈ గులాబీ రేకులు బాగా డ్రై అయ్యి ఓ డిఫరెంట్ కలర్ వచ్చేస్తాయో అప్పుడు వాటిని సెంటర్ టేబుల్ మీద లేదా గ్లాస్ బౌల్స్ లో నింపి డెకొరేట్ చేసుకోవచ్చు. మంచి సువాసన కోసం కొన్ని ఎసెన్స్ ను గులాబీ రేకుల మీద స్ప్రే చేయవచ్చు.
ఎండిన గులాబీ రేకుల ఉపయోగాలు:
1. చిన్న బకెట్ తీసుకొని అందులో ఎండిన గులాబీ రేకులను నింపి, అందులోనే కొన్ని షో పీసెస్(మార్కెట్ లో దొరుకుతాయి) రెండు మిక్స్ చేసి సైడ్ టేబుల్ మీద డెకరేట్ చేయవచ్చు.
2. ఎండిన గులాబీ రేకులకు కొన్ని షో పీసెస్ మురియు కొన్ని హెర్బ్స్, నట్స్(యాలకులు, గందం, రోజ్ మెరీ వంటివి, పండ్ల తొక్కలు(ఆరెంజ్, లెమన్ మరియు ఎన్సియల్ ఆయిల్) వంటి వాటితో గ్లాస్ బౌల్స్ లో నింపి మూత పెట్టి ఇంట్లో షోకేష్ లో పెట్టి డెకొరేట్ చేసుకోవచ్చు. అంతే కాదు రెండు మూడు రంగులతో ఉన్నటువంటి గులాబీ రేకులను ఒక్కొక్క బౌల్లో వేసి ఇంట్లో కార్న్స్ లో డెకరేట్ చేసుకోవచ్చు. దాని వల్ల ఎసెన్సియల్ ఆయిల్స్ గులాబీ రేకులన సువాసనలు ఇంటినిండా ఘుబాళిస్తుంటుంది.
3. ఫ్రెష్ గా ఉన్న గులాబీలను లేదా గులాబీ రేకులను ఫ్రేమ్ కట్ గోడలకు హ్యాంగ్ చేయొచ్చు. డిఫరెట్ గా ఫ్రేమ్స్ ఉపయోగించడం వల్ల మరింత ఆకర్షనీయంగా కనబడుతుంది.
4.గులాబీలు లవ్ మరయు రొమాన్స్ కి చిహ్నాలు కాబట్టి ఎండిన గులాబీ రేకులను లేదా ఫ్రెష్ గులాబీ రేకులను ప్లేట్ లో చల్లి బెడ్ ప్రక్కన పెట్టుకోవచ్చు. దాంతో గది ఆకర్షణియంగా కనబడుతుంది.



Click it and Unblock the Notifications