Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
చిన్నగదిని విశాలంగా కనిపించేలా చేసే 5 బెస్ట్ టిప్స్
బడ్జెట్ లో నే మంచి ఇంటిని మన సొంతం చేసుకోవడం ఒక ఎత్తైతే ఆ ఇంటిని మనకి చక్కగా అలంకరించుకోవడం ఒక ఎత్తు. ఒక ఇంటికి యజమాని అవ్వాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరు పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల విశాలమైన ఇంటిని కొనడం అంటే మాటలు కాదు. అందుకే, ఒక వేల చిన్న రూం లో నే మీరు ఉన్న ఆ రూం ని మీరు విశాలంగా కనిపించేలా చేసే చిట్కాలు ఈ కింద తెలియచేయబడ్డాయి.
1. అదనపు స్థలాన్ని వినియోగించుకోండి
ఒక వేల మీ గది ఏదైనా లాబీ తో కాని లేదా ఏదైనా అదనపు జాగాకి ఆనుకుని ఉన్నట్టయితే వాటిని ఉపయోగించుకొండి. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న గోడలని తీసివేస్తే ఆ ప్రాంతం విశాలంగా కనపడి ఆ గది పెద్దదిగా కనబడుతుంది. అలాగే ఏవైనా కర్టెన్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే గదిని మరింత అందంగా కనబడేలా చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు కర్టెన్ వేస్తూ అవసరం లేనప్పుడు కర్టెన్స్ తీసివేస్తూ ఉంటే గది విశాలంగా అనిపిస్తుంది.

2. సరైన ఫర్నిచర్ ని ఎంచుకోండి
భారీ మరియు ఖరీదైన ఫర్నీచర్ కి ఎక్కువ గా డబ్బులు ఖర్చు పెట్టె బదులు మీ గది కి సరిగ్గా అమరే ఫర్నిచర్ గురించి అలోచించి వాటిని తీసుకోండి. మీరు ఎక్కువగా వాడే ఫర్నిచర్ ని ఎంచుకోండి. తక్కువగా వాడే ఫర్నిచర్ ఉంటే వాటిని తరచూ ఉపయోగించే ఫర్నిచర్ తో భర్తీ చెయ్యండి. గదిలోని జగాని తక్కువగా వాడుతూ అవసరానికి ఎక్కువగా ఉపయోగపడే వాటిని ఎంచుకోవాలి. మడవదగినది అలాగే సర్దుబాటు చెయ్యదగిన ఫర్నిచర్ ల కి ప్రాధాన్యత ఇవ్వండి. బహుళప్రయోజక ఫర్నిచర్ ల ని ఎంచుకోండి.
3. చిందరవందరగా ఉన్న వాటిని గమనించండి
మీరు కొత్త గదిలో కి మారిన కొన్ని సంవత్సరాలకి మీకు గది చాలా చిన్నదిగా అవుతున్నట్టు అనిపిస్తుంది. వీటికి కారణం, ఇంట్లో చిందరవందరగా పోగయ్యే వస్తువులు. అందుచేత ఎప్పటి కప్పుడు గదిని శుభ్రంగా ఉంచాలి. అనవసరపు చెత్తా చెదారం ఇంట్లోంచి బయటికి పంపించాలి. ఇలా చేస్తే మీ గది విశాలంగా కనిపిస్తుంది.
4. రంగులు చేసే చిత్రం
రంగులు చేసే చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. మీరు ఎంచుకునే రంగు బట్టి మీ గది చిన్నగా లేదా పెద్దగా కనిపిస్తుంది. ముదురు రంగులు వైభవాన్ని కలిగించే విధంగా ఉన్నా గదిని చిన్నగా కనిపిచేలా చేస్తాయి. ప్రత్యేకించి వెంటిలేషన్ సదుపాయం సవ్యంగా లేని చోట ఇటువంటి సమస్యలు అధికం. తేలికపాటి రంగులు గదిని విశాలంగా కనిపించేలా చేస్తాయి.
5. అద్దాలు మరియు లైట్స్
గంభీరమైన వాతావరణం సృష్టించడానికి పెద్ద అద్దాలని ఇంట్లో అమర్చండి. అద్దాలలో వెలుతురూ రిఫ్లెక్ట్ అవడం వల్ల మీ గది లో వెలుతురూ ఎక్కువగా కనపడుతుంది. తద్వారా గది కూడా పెద్దగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సహజ సిద్దంగా వెలుతురూ వచ్చే సదుపాయం ఉంటే అవసరమైన ప్రదేశం లో అద్దాలను అమర్చండి తద్వారా వెలుతురూ సరిగ్గా పడని ప్రదేశాలలో కూడా మంచి వెలుతురు ప్రసరిస్తుంది.
కంటికి ఒక గది పెద్దగా లేదా చిన్నగా కనిపించడానికి చేసే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గది యొక్క అందం రెట్టింపు అవుతుంది. ఆ గదిలో అమర్చే వస్తువుల వల్ల కూడా గది యొక్క రూపం మారుతుంది.



Click it and Unblock the Notifications
