Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మనస్సును ఆహ్లాదపరిచే వాస్తు పెయింట్స్ మీఇంటికోసం
ఇంటీరియర్ డిజైనింగ్‌కు కూడా వాస్తు సలహాలు పాటించడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. సాధారణంగా కొత్త ఇల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంటి డిజైనింగ్. ఇంటికి వేయాల్సిన రంగులే. చాలామంది తమకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక రంగును వేస్తుంటారు. ఎంతో శ్రమించి, వెచ్చించి నిర్మించుకున్న ఇంటికి సరైన రంగులు వేయకుంటే ఆ ఇంటికి అందం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన డిజైనింగ్‌తో రూపొందిన ఇల్లు కూడా తన ఆహ్లాదాన్ని కోల్పోతుంది. అలాకాక ఇంటికి మనకు నచ్చిన రంగులు వేసుకుంటే అందంగా ఉంటాయంటున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు. పెయింటింగ్ విషయంలో వాస్తు పెయింటింగ్ ను వేసుకోడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన, పవిత్రమైన వాతావరణంలో ఒక శక్తి ఉంటుందని భావిస్తున్నారు.
వాస్తు పెయింటింగ్స్ ను గమనిస్తే, అవి అందమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంను అందిస్తాయి. ఇంటికి వాస్తు ప్రకారం పెయింటింగ్స్ ను వేసుకోవడం వల్ల ఇంట్లో వారి మానసిక స్థితి, ఆరోగ్యం మరియు ఆనందం మీద గొప్ప ప్రభావం కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం, మీ ఇంటి గోడలకు సరిపడే ఉత్తమ పెయింటింగ్ రంగులను ఎంపిక చేసుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం...

1. లివింగ్ రూమ్: లివింగ్ రూమ్ లో వేసుకొనే పెయింట్ కలర్స్ మీద చాలా శ్రద్ద ఉండాలి. లివింగ్ రూమ్ లో వేసే పెయింట్ కలర్స్ వల్ల వారి వ్యక్తిత్వాలు ప్రతిబింబిస్తుందని భావిస్తారు. మీ లివింగ్ రూమ్ గోడలకు వాస్తు ప్రకారం పెయింట్ కలర్ పసుపు, బ్లూ, గ్రీన్, టాన్ మరియు లేత గోధుమ రంగులను ఉత్తమ రంగులుగా పరిగణిస్తారు. ఈ రంగులు కాంతిపరావర్తనం కలిగించడమే కాకుండా కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
2. పడకగది: మీరు ప్రశాంతంగా ఉండాల్సిన ప్రదేశం మీ పడకగది. మీ పడక గదికి వాస్తు ప్రకారం పెయింటింగ్ కలర్స్, వేడి శైలి, స్టైల్, మూడక మరియు సౌకర్యవంతమైన వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం మీ పడక గదికి వాస్తు పెయింట్స్ కలర్స్ పింక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ పవిత్రమైన రంగులుగా ఉన్నాయి. గ్రీన్ కలర్ పిల్లల బెడ్ రూమ్ కు ఒక అద్భుతమైన ఎంపికగా ఉంది.
3. వంటగది: మీరు పరిమితంగా అలంకరించుకొనేందుకు ఉన్న ప్రదేశం వంటగది. ఇక్కడ, వాస్తు పెయింట్స్ ను వేసుకోవడం వల్ల, ఓ అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలవు. తెలుపు, పసుపు, ఆరెంజ్, రోజ్ పింక్, చాక్లెట్ మరియు రెడ్ కలర్స్ వంటివి వంటగది కోసం మంచి ఎంపిక.
4. భోజనాల గది: వాస్తు పెయింట్ కలర్స్ మీ డైనింగ్ హాల్ కు అప్లై చేయదలచుకుంటే లైట్ కలర్స్ చాలా ఉత్తమమైన ఎంపిక. పింక్, గ్రీన్ మరియు బ్లూ వంటి కలర్స్ మీ డైనింగ్ రూమ్ కు ఉత్తమమైన ఎంపిక. ఈ రంగులు మీకు ఎక్కువ తాజాదనాన్ని అందిస్తాయి . మీ డైనింగ్ హాల్స్ కు బ్లాక్, వైట్, లేదా బ్లాక్అండ్ వైట్ మిక్స్ చేసిన కలర్స్ ను నివారించడం ఉత్తమం.
5. బాత్ రూమ్: బాత్ రూమ్ కు, వాస్తు పెయింట్స్ అప్లై చేయాలనుకుంటే, లైట్ కలర్స్ ఉత్తమం. ఈ కలర్స్ మీకు ఫ్రెష్ లుక్ ను అందిస్తాయి. మరియు ఇది మరింత విశాలమైనదిలా కనిపించేలా చేస్తుంది. నలుపు మరియు ముదురు ఎరుపు రంగును ఎంపిక చేసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఈ రెండు కలర్స్ మీ బాత్ రూమ్ కు రద్దీగా ఉండే లుక్ ను ఇవ్వవచ్చు.
6. గెస్ట్ రూమ్(అతిథుల గది):మీ గెస్ట్ రూమ్ ను అందమైన మరియు సొగసైనదిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గెస్ట్ రూమ్ ను వివిధ రకాల మనస్తత్వం ఉన్న వారు, మానసిక మరియుఅభిరుచులు వేర్వేరుగా ఉన్న వ్యక్తులు ఉపయోగిస్తుంటారు. కాబట్టి, ఆ గది లేత రంగులు కలిగి ఉండేలా చూసుకోవడం ఉతమమైన ఎంపిక. గెస్ట్ రూమ్ కు వాస్తు పెయింట్ కలర్స్ ప్రకారం, తేలికైన షేడ్స్ కలిగినటువంటి ఎల్లో, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ లేదా లావెండర్ కలర్స్ అప్లై చేయడం వల్ల ఒక శక్తివంతమైన మరియు ప్రశాంతకరమైన వాతావరణం పొందుతారు.
లివింగ్ రూం, బాల్కనీ, టెర్రస్‌ల గోడలకు ముదురు రంగులను వేయిస్తే చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే పడకగదికి లేత రంగులను వేయించాలి. ఇక ఎక్కువగా విశ్రాంతి తీసుకునే గదులకయితే ప్రశాంతతను పెంచే లేత నీలం, ఆకు పచ్చ, లావెండర్ రంగులు చాలా బాగా నప్పుతాయి. వంటగదికి మాత్రం ఆ గదిలోని ఫ్లోరింగ్ టైల్స్‌కు అనుకూలంగా ఉండే రంగులను ఎంపిక చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications
