Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మెట్ల కోసం క్రిస్మస్ అలంకరణ
మీరు నమ్ముతారా?? క్రిస్మస్ కేవలం ఒక వారం రోజులకు దూరంగా ఉంది!! మీరు క్రిస్మస్ పండుగను జరుపుకునేందుకు మరియు మీ కుటుంబం మరియు స్నేహితులతో ఒక ఆహ్లాదకరమైన సమయం గడపటం మీద దృష్టి సారించారా? మీకు ఇంకా ఇప్పటికి కూడా స్వీట్ హోమ్ అలంకరణల గురించి గందరగోళం ఏర్పడిందా?
అలంకరణలు స్పష్టంగా పండుగను ఉల్లాసముగా స్వాగతించటంలో పెద్ద పాత్రను పోషిస్తాయి. మీ ఇంట్లో మీరు చేసే అలంకరణలలో మీ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మీరు మీ ఇంటిలో వివిధ భాగాలకు చెయ్యాల్సిన అలంకరణల గురించి మీ మనస్సులో ఏదో ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు. ఇంకా మీకు మీ మెట్ల అలంకరణ గురించి కొంత అయోమయం ఉండవచ్చు.

క్రిస్మస్ అలంకరణలో మెట్ల అలంకరణ అనేది ఒక ఆసక్తికరమైన భాగం మరియు దానిని అందమైన మార్గాలలో చేయవచ్చు. మీరు బయట అలంకరణ,చెట్టు అలంకరణ మరియు మోంటెల్ అలంకరణ పూర్తి చేశాక,ఒకసారి మీ మెట్లదారి అలంకరణ కోసం సమయం కేటాయించండి. మెట్లు అలంకరణ ఖచ్చితంగా మీ మొత్తం అలంకరణలో అందం మరియు మెరుపును జోడిస్తుంది. మీ మెట్ల అలంకరణ మీ క్రిస్మస్ స్పిరిట్ ను ప్రేరేపిస్తుంది. అందువలన దానిని ఉత్తమంగా చేయాలి. మీ పని సులభం చెయ్యడానికి ఇక్కడ మేము కొన్ని ఆలోచనలను ఇస్తున్నాము. వాటిని చదివి అలంకరణ చేసి మీ గెస్ట్ లను ఆశ్చర్యపరచండి.
1. ఖచ్చితమైన లుక్
పాత చెక్క మెట్లు లేదా నాజూకైన అమరికలు గల ఆధునికమైన వాటిని మరింత క్రిస్మస్ అలంకరణ కొరకు మెట్లను క్రిస్మస్ దండలతో ఖచ్చితంగా అలంకరించవచ్చు. క్రిస్మస్ దండలు మీకు క్రిస్మస్ అనుభూతి మరియు మీ అలంకరణల మనోజ్ఞతను జోడిస్తుంది. క్రిస్మస్ అలంకరణలో మెట్ల అలంకరణ అనేది మీ ఇంట్లో మెట్ల యొక్క రకాన్ని బట్టి ఎంపిక చేయవచ్చు. ఇంకా క్రిస్మస్ దండల విషయానికి వస్తే, అది పరిపూర్ణమైన ఎంపికగా ఉంది. కనుక దీనిని మిస్ చేయవద్దు!
2. ప్రకాశవంతమైన లైట్లు
దండలు అమర్చిన తర్వాత లైట్లు అలంకరిస్తే ఒక మేజిక్ వలె ఉంటుంది. క్రిస్మస్ అలంకరణలో మెట్ల బానిస్టెర్ చుట్టూ చిన్న లైట్లు ఆకర్షణీయముగా చేస్తాయి. మీ మెట్ల అలంకరణలో ప్రకాశంను జోడిస్తుంది. క్రిస్మస్ దండలకు లైట్లు అల్లుకుని ఉంటే మన కళ్లకు నిజమైన కనువిందు కలుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయవద్దు.
3. ఒక చిన్న ఆధునికత
మీరు ఒక జంట అయితే మీ అలంకరణకు కొంత శృంగార కాంతిని జోడించవచ్చు. మీరు మూడ్ ను మెరుగుపరిచే కొన్ని రంగులను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మీ అలంకరణకు ఒక చిన్న ఆధునికతను జోడించండి. ఏ విధమైన ప్రజలకు అయిన ఉత్తమంగా సరిపోయే క్రిస్మస్ మెట్ల అలంకరణ ఒక నాజూకైన మరియు అధునాతన లుక్ కలిగి ఉంటుంది. మీ మెట్ల అలంకరణ అద్భుతముగా మరియు శృంగారముగా చేయడానికి మీ అలంకరణ కొరకు శాటిన్ రిబ్బన్లు,తెలుపు లైట్లు మరియు ఆకుపచ్చ దండలను జోడించండి!
4. విసుగు చెందితే
మీరు సంప్రదాయ మెట్ల అలంకరణకు విసుగు చెందితే అప్పుడు వాటిని ఫంకీగా ఉత్తమంగా చేయవచ్చు. సాధారణంగా ప్రజలు బానిస్టెర్ చుట్టూ అమర్చటానికి తాజా దండలు ఉపయోగిస్తారు. అయితే మీరు మంచి అలంకరణ కోసం కృత్రిమ దండలతో అలంకరించండి. సంప్రదాయం ప్రేమికులకు గ్రీన్ దండలు నచ్చుతాయి. కానీ ఫంకీ శైలిని ఇష్టపడే వ్యక్తులకు లోహపు దండలు బాగుంటాయి. నియాన్ నారింజ,గులాబీ, ప్రకాశవంతమైన పింక్ మీ క్రిస్మస్ అలంకరణ మెట్లకు ఫంకీ మేజిక్ చేయవచ్చు. దండలతో పాటు మెరిసే లైట్లు ఒక స్ట్రింగ్ జోడించడానికి మరియు మేజిక్ గా పనిచేస్తాయి చూడండి!
5. ఆభరణాలు అంటే ఇష్టం వారికి
మీరు వివిధ అలంకరణలను ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఆభరణాలను ఉపయోగించవచ్చు. మీరు మీ చెట్టు అలంకరణ తర్వాత మిగిలిన అదనపు క్రిస్మస్ ఆభరణాలను మెట్ల అలంకరణలో వినియోగించుకోవచ్చు.మీ క్రిస్మస్ పూలమాల మరియు 20 నుంచి 30 ఆభరణాలను మీ మెట్లకు వేస్తె యెంత బాగుంటుందో చూడండి. మెరిసే లైట్ల యొక్క స్ట్రింగ్ తో కలిసి ఈ చిన్న చిన్న ఆభరణాలు అందరి కళ్ళను ఖచ్చితంగా బంధిస్తాయి. కనుక దీనిని ప్రయత్నించండి! పై చిట్కాలను మీ మనస్సులోని గొప్ప ఆలోచనలతో కలిపి ఆచరించండి. మీరు ఒక హ్యాపీ క్రిస్మస్ ను జరుపుకొండి!



Click it and Unblock the Notifications











