Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ ఇల్లు క్లాసీగా కనిపించేలా చేసే బ్లాక్ అండ్ వైట్ థీమ్..
సాధారణంగా మనందరం మన ఇల్లు చాలా అందంగా మరియు అలంకరణగా ఉండాలని కోరుకుంటాం. అయితే మీరు మీ ఇంటికి ఒక ప్రత్యేకత ఉండాలని, ఇతరులను ఇంప్రెష్ చేయాలను కోరుకొనే వారైతే, మీరు ఖచ్చితంగా తెలుపు-నలుపు కాంబినేషన్ థీమ్ ను ప్రయత్నింంచవచ్చు. నలుపు మరియు తెలుపు ఈ రెండింటిని విడి విడిగా తీసుకుంటే వేటికి అవే అందానికి నిదర్శనం. ఈ రెండు అందంలో ప్రాథమిక రంగులుగా ఉన్నాయి. అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఆకర్షణీయంగా ఉండేంట్లు ఏర్పాటు చేసుకోవాలి.
కాబట్టి, మీరు మీ ఇంటికి ఒక ప్రత్యేకత తీసుకురావాలనుకుంటే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీ ఫస్ట్ చాయిస్. మీ ఇంటి అలంకరణలో ఒక సాధారణ, ఆకర్షణీయమైన అలంకరణకు ఒక మంచి ఉపాయం. అందుకు కావలసిందల్లా కొన్ని సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉండటమే. మీ ఇంటి అలంకరణకు మీ ఆలోచనలకు తోడుగా మరికొన్ని సూచనలు తోడైతే మరింత ఆకర్షణీయంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ డెకరేషన్ థీమ్ కోసం కొన్ని చిట్కాలు మీ కోసం...

1. బ్లాక్ ఫర్నీచర్: మీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంటి అలంకరణకు బ్లాక్ ఫర్నీచర్ చాలా బాగా సూట్ అవుతుంది. బ్లాక్ ఫర్నీచర్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. అందుకు మీరు సరైన లెదర్ కోచ్ కొనాలనుకుంటే, అది బ్లాక్ కలర్ లో లభ్యం అవుతుంది. చాలా వరకూ బెడ్ షీట్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్స్ లో వస్తున్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడంతో పాటు, ఐరన్ ఫర్నీచర్ కు ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే ఇవి త్వరగా పాడవ్వవు మరియు ఇవి ఏకరీతిలో నల్లగా ఉంటాయి.
2. తెల్లని గోడలు: మీ వాల్ పెయింట్ ఎప్పటికీ బ్లాక్ ఉండకూడదు. బ్లాక్ గోడలు మీ గదిలో కాంతిని మరియు మీ గదిని డార్క్ గా మార్చేస్తుంది. కాబట్టి గోడలకు ముఖ్యంగా తెలుపు రంగు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు అలంకరణ కోసం బ్లాక్ హైలెట్స్ మరియు అలంకరణ చేసుకోవచ్చు.
3. బ్లాక్ అండ్ వైట్ పద్ధతులు: మీకు మోడ్రన్ ఆర్ట్ చూసారంటే, అవి చాలా వరకూ బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే ఉంటాయి. మీ ఇంటి అలంకరణ కోసం అటువంటి పెయింటింగ్స్ ను ఎంపిక చేసుకోవడం చాలా మంచి పద్దతి. ప్రస్తుత రోజుల్లో స్ట్రక్చ్డ్ వాల్స్ పెయింట్స్ చాలా ఫ్యాషన్ గా ఉన్నాయి. మీ ఇంటి అలంకరణను గోడలపై కళాత్మకంగా చేయడానికి బ్లాక్ అండ్ వైట్ అల్లికలను ఎంపిక చేసుకోవచ్చు.
4. శిల్పాలు: ఐన్ లేదా రాయితో చేసిన లేదా మట్టి శిల్పాలను మనం నల్ల రంగుల్లో చూడవచ్చు. బ్లాక్ విగ్రహాలు చాలా వరకూ అందుబాటులో ఉన్నాయి మరియు చేతిపనుల సొగసైనవిగా అలంకరించబడినవి కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇంటి అలంకరణకు జంతుప్రదర్శశాలను జోడించుకోవచ్చు.
5. చెస్ బోర్డ్ పద్ధతి: మీ ఇంట్లో కానీ, బాత్ రూమ్ లో కానీ చెస్ బోర్డ్ ను పోలిన టైల్స్ ఉపయోగించడం వల్ల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మీ బాత్ రూమ్ మరింత ప్రకాశవంతంగా కనిపించాలంటే అందుకు ఇటువంటి చెస్ బోర్డ్ ప్యాట్రన్ ను ఎంపిక చేసుకోవాలి.
6. బ్లాక్ బాత్రూమ్ ఫిట్టింగ్స్: బాత్ రూమ్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ డెక్కర్ థీమ్ ను ఎంపిక చేసుకోదలచుకుంటే, బ్లాక్ బాత్ ఫిట్టింగ్స్ ను ఇన్ స్టాల్ చేసుకోండి . ఇది ఒక అదనపు అలంకరణగా ఉంటుంది. మరియు వైట్ బాత్ వలే ఇది అంత త్వరగా మాసిపోదు, కలర్ షేడ్ అవ్వదు. ఇది కాకుండా, బ్లాక్ బాత్ టబ్ ను ఫిక్స్ చేసుకొని మీ స్నానాల గదికి మరింత ఆకర్షనీయతను పెంచండి.
ఇవన్నీ మీ అభిరుచికి తగ్గట్టు బ్లాక్ అండ్ వైట్ డెకెర్ థీమ్ కు సహాయపడుతాయి. మీరు కూడా మీ ఇంటి అలంకరణకు బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఎంపిక చేసుకుంటే ఇలా ట్రై చేసి చూడండి...



Click it and Unblock the Notifications