Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సుఖ, సంపదలు, సంతోషాల దీపావళికి వాస్తు చిట్కాలు
మన ఇండియాలో అత్యంత వైభవంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ దివాళీ(దీపావళీ). దీపావలి దగ్గరలో రాబోతోంది మన జీవితంలో కొత్తవెలుగులు మరియు సంతోషాన్ని నింపభోతోంది. మన హిందూ సాంప్రదాయంలో వచ్చే పండుగల్లీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. పండుగ పనులన్నీ రెండు మూడు వారాల ముందే మొదలు పెట్టేస్తారు. ముఖ్యంగా దీపావళికి వరాల తల్లి లక్ష్మీదేవిని మరియు గణేషుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ దేవుళ్ళను వారి ఇల్లకు ఆహ్వానించడం కోసం ప్రతి ఇల్లూ కొత్తఇల్లులా మెరిసిపోతూ దీపకాంతులతో వెలిగిపోతుంటుంది.
అదే సమయంలో చాలా మంది ఇంట్లో చిన్న మార్పుల, చేర్పులు చేస్తుంటారు. పెయింటింగ్ వంటివి, ఇంటి మర్మత్తులు అన్ని మెదలు పెట్టేసి, దీపావళి రోజున కొత్త ఇంటిలా తయారుచేస్తారు. అలాగే ఇంట్లో ఉండే వస్తువుల కూడా ప్రత్యేకించి వాస్తుప్రకారం, దశ, దిశ ప్రకారం ఏవేవీ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ పెట్టాలని నమ్ముతారు. కాబట్టి, ఇంట్లో సంతోషం మరియు సంపద, లాభం పొందడానికి వాస్తు శాస్త్రం చాలా ఆదేశాలను సూచిస్తుంది. మరి ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవిని మరియు గణేషుడుని మీ ఇంటికి ఆహ్వానించుకోవలనుకుంటుంటే దీపాళీకి మీరు మీ ఇంటిని శుభ్రపరచడానికి కొన్ని ఉత్తమ వాస్తు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. క్లీనింగ్ : దీపావళికి ఇంటిని శుభ్రం చేయడం అనేది ఒక ఉత్తమ వాస్తు చిట్కా. ఇంట్లోని పాతబడ్డ వస్తువుల, అనవసరమైన వాటిని పారవేయడం వల్ల ఇంట్లో ఓ కొత్త శక్తిని ఆహ్వానించడానికి సిద్దం అయినట్లే. ఇంటిని శుభ్రం చేయడం వల్ల పండుగ రోజున శుచి, శుభ్రత వల్ల మీకు ఇష్టమైన దేవుళ్ళను ఆహ్వానించే అవకాశం మీరు పొందుతారు.
2. అలంకరణ: దీపావళి అంటేనే మొత్తం అలంకరణ మీదే ఆధారపడి ఉంటుంది. మామిడి ఆకుల మరియు బంతిపూల హారాలు ఇంట్లో తాజాగా అలంకరణ, ఇంటి నిండా దీపాలు కుటుంబ సభ్యులు జీవితాల్లో అదృష్టం తెస్తుంది. ఇంటి ముఖద్వారంలో తోరణాలు కట్టడం సాంప్రదాయానికి చిహ్నంగా మరియు దేవుడి దీవెనలు అందుకోవడానికి చిహ్నంగా బావిస్తారు.
3. విలువైనవి ఇంట్లో అమర్చడం: ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు. అలాగే అమర్చిన లాకర్ లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకోవడం ద్వారా సకళ సుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లువిరుస్తాయని భావిస్తారు.
4. దీపాలు: కలర్ కలర్ దీపాలు, లైట్స్, లేకుండా దీపావళి అసంపూర్తిగా ఉంటుంది. వివిధ రకాల కలర్స్ లో దీపాలను వెలగించడం అనేది లక్ష్మీదేవినీ, గణేషుడిని, కుబేరుడిని మరియు ఇంద్రుడిని మన ఇంటికి ఆహ్వానించడానికే. వారిని విడదీయకండి.
5. కాలి అడుగుజాడలు: చాలా ఇండ్లలో ముఖద్వారం లేదా పూజగది ద్వారం వద్ద చాలా చిన్నని ఎరుపు రంగు అడుగుజాడలను గమనించవచ్చు. ఈ ఫూట్ ప్రింట్స్ లక్ష్మీ దేవి ఆరోగ్యాన్ని మరియు సంపదను మరియుసంతోషాన్ని తీసుకొస్తుందనే నమ్మకం.
6. ప్రతిమలు ఉంచే దశ దిశలు: వాస్తు ప్రకారం, లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అలాగే గణేషుడిని, ఇంద్ర, కుబేరుడిని మీరు పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తర లేదా తూర్పు దిశవైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్టింపచేసుకోవాలి.



Click it and Unblock the Notifications