Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జన్మాష్టమినాడు కృష్ణుడ్ని అలంకరించేందుకు చిట్కాలు.!
హిందువులు అతిపవిత్రంగా జరుపుకొనే పండుగ ‘శ్రీక్రిష్ణ జన్మాష్టమి' రానే వచ్చింది. శ్రీక్రిష్ణ జన్మాష్టమి క్రిష్ణునికి ఇష్టమైన రోజు. అందుకే క్రిష్ణాష్టమికి ప్రతి ఇళ్ళు కళకళడుతుంటుంది. ఇళ్ళు మరింత కళాభరితంగా, పూజగదిని మరింత ప్రకాశవంతంగా అలంకరించి పూజలతో శ్రీక్రిష్ణున్ని ఆహ్వానిస్తారు. జన్మాష్టమిని హిందు ప్రజలు విష్ణువు జన్మదినంగా గొప్ప సెలబ్రేట్ చేసుకుంటారు. కృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీక్రిష్ణుని చాలా పేర్లే ఉన్నాయి. వాటిలో బాలగోపాలడు మిరయు కన్నయ్య లేదా క్రిష్ణయ్య అనే పేర్లు చాలా ప్రసిద్ది చెందినవి. జన్మాష్టమి రోజు పిల్లలు పూజగదిని అలంకరించి వారికి వారే ఒక ప్రత్యే అలంకరణ ధరించికొని, ప్రతి సంవత్సరం శ్రీక్రిష్ణ జన్మాష్టమిని గొప్పగా జరుపుకుంటారు. శ్రీక్రిష్ణని జన్మాష్టమి రోజున ఇంట్లో చిన్నిక్రిష్ణుని విగ్రహం చుట్టూ కలర్ ఫుల్ లైట్ తో, రంగురంగుల పువ్వులో, రంగు రంగుల బొమ్మలతో అలంకరించడం వల్ల ఆ ఇల్లు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. చిన్ని క్రిష్ణున్ని అలంకరించడానికి అనేక మార్గాలున్నాయి. చాలా ఇళ్ళలో చిన్నిక్రిష్ణున్ని ఈ పండగ పర్వదినాన ఎక్కువగా అలంకరిస్తారు. ఎందుకంటే ఇది క్రిష్ణుడి జన్మదినం తెలిపే చిహ్నంగా భావిస్తారు. అందుకే క్రిష్ణాష్టమి రోజు చిన్ని క్రిష్ణున్ని ప్రతిమలు లేదా విగ్రహాలు ఎక్కువగా పెడుతుంటారు.
మీ ఇంట్లో కనుక బాలాగోపాలని విగ్రహం ఉన్నట్లైతే మీరు వారికి అలంకరించాలనుకుంటే, ఇక్కడ కొన్ని అందమైన మార్గాలు మీకోసం కొన్ని అంధిస్తున్నాం. క్రిష్ణాష్టమిని మరింత కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు రెడీనా...
జన్మాష్టమికి శ్రీక్రిష్ణుని అలంకరణకు చిట్కాలు:

పువ్వులు:
జన్మాష్టమి రోజును పూజగదిని మరింత కలర్ ఫుల్ గా ఆకర్షనీయంగా అలంకరించడానికి ముఖ్యంగా పువ్వులు చాలా బాగా ఉపయోగపడుతాయి. అలంకరణకు ఎక్కువ ముదురురంగు పువ్వులు, బంతి, గులాబీ, మల్లెపువ్వులు బాగా ఆకర్షణీయంగా కనబడుతాయి.

కర్టెన్స్:
క్రిష్ణుని విగ్రహాలు పెట్టే స్థలంలో వెనక వైపున మరింత ప్రకాశవంతంగా కలర్ ఫుల్ గా కనబడేందుకు వివిధ రంగుల్లో ఉన్న ముదురంగు కర్టెన్స్ ను హ్యాంగ్ చేయాలి. ఎరుపు, పచ్చ, పసుపు బాగా నప్పుతాయి.

గార్లాండ్స్:
రాధకృష్ణులు ఉన్న విగ్రహాలకు జన్మాష్టమి రోజున సుగంధ వాసనలు విరజిల్లే మల్లె పువ్వులతో అలంకరించవచ్చు.

అవుట్ ఫిట్:
బాలగోపాల్ బాహ్యలంకరణ చాలా పెద్దగా ఉండాలి. ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. విగ్రహాన్ని అలంకరించడానికి ఒక మంచి కలర్ అవుట్ ఫిట్ ఎంపికతో పాటు ఆదుస్తులకు ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఆభరణాలు(కడియం, నెక్ పీస్, ఫ్లూట్ మరియు ముకుత్ )ను ఎంచుకోవాలి.

Bejeweled Mukut:
కృష్ణుడు ఒక గొర్రెల కాపరి రాకుమారుడు కాబట్టి, అతనికి ఎల్లప్పుడూ ఒక కిరీటం ధరించి ఉంటారు. లార్డ్ కృష్ణ విగ్రహాన్ని మనం కూడా అదే విధంగా అలంకరించవచ్చు.

నెమలి పించంతో:
శ్రీకృష్ణున్ని నెమలి పించంతో కూడా అలంకరించవచ్చు. శ్రీకృష్ణుని విగ్రహానికి వెనుక వైపు పూర్తిగా కవర్ అయ్యే విధంగా నెమలి పించం విస్తరించి పెట్టడం వల్ల అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది.

వింటర్ స్పెషల్:
చాలా ఇళ్ళలో, బాలగోపాలుడు శీతాకాలపు ధరించే ఉన్ని దుస్తుల్లో ఉన్నట్లు అలంకరిస్తుంటారు. కాబట్టీ మీరు జన్మాష్టమికి కృష్ణుడి అలంకరించేందుకు శీతాకాలంలో థీమ్ ఆలోచనను ప్రయత్నించవచ్చు.

ఉయ్యాల:
బ్రైట్ కలర్ ఉన్న రంగు రంగుల పువ్వులతో అలంకరించిన ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు.

ఆవులు:
గోపాలకృష్ణునికి గోవులంటే మాహా ఇష్టం. అందుకే చిన్నికృష్ణున్ని గోపయ్య అని కూడా పిలుస్తారు. మరి జన్మాష్టమిన గోవులు లేని అలంకరణ ఉంటుందా..ఈ డెకరేషన్ కు సాంప్రదాయం తోడైతే మరింత అద్భుతం.

రెడ్ అండ్ ఎల్లో:
బ్రైట్ కలర్ దుస్తుల్లో చిన్న కృష్ణుడు మరింత కాంతివంతంగా దర్శనమిస్తే, అందులోనే ఈ రెండు కూడా మన హిందు సాంప్రదాయానికి చాలా ముఖ్యమైన కలర్స్. పసుపు కుంకుమ కలర్స్ లో అలంకరణ.

Chandan Prints :
చందనంతో బాలగోవింధుడిని అందంగా అలంకరించవచ్చు.

సింహాసనం:
చాలా ఇళ్ళలో, బాలగోపాలుడు ఒక సింహాసనం మీద కూర్చొన్నట్లు అలంకరించి ఉంటారు. ఈ అలంకరణలో చిన్నకృష్ణుడు అందంగా ఉంటాడు.

మెటల్ సింహాసనం:
మీరు చిన్నగా అద్భుతంగా అలంకరించదల్చుకొన్నప్పడు, మెటాలిక్ కలర్ లో ఉన్నసింహాసనం మీద అద్భుతంగా అలంకరించవచ్చు.

Bejeweled Outfit:
శ్రీ కృష్ణుడుని బీడ్స్ మరియు స్టోన్స్ తో అలంకరిస్తే మరింత అందంగా ప్రకాశిస్తూ కనబడుతుంది.

డైమండ్:
వజ్రాభరణాలతో అలంకరణలో చిన్న కృష్ణుడు మరింత ప్రకాశవంతంగా కొలువుదీరి ఉన్నాడు.

యశోధతో:
క్రిష్ణజన్మాష్టమికి శ్రీక్రిష్ణుని అలంకరణకు ఇది బెస్ట్ అలంకరణ. యశోధతో ఉన్న శ్రీక్రిష్ణుడు చాలా ముద్దొస్తున్నాడు.



Click it and Unblock the Notifications











