Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
అద్దాన్నిఅలంకరించేందుకు సులువైన మార్గాలు
ప్రతి ఒక్కరి ఇల్లలోను అద్దం తప్పనిసరిగా ఉంటుంది. అది పెద్దది కావచ్చు, లేదా చిన్నది కావచ్చు. అయితే పెద్ద అద్దాలు కేవలం గోడకు తగిలించేసి వదిలేయడం, లేదా ఒక చోట నిలబెట్టి వదిలేయడం జరగుతుంటుంది. మహిళలు తమ అందాన్ని చూసుకోవడానికి, మరియు అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా అద్దాన్ని వాడుతుంటారు. అందుకే అమ్మాయి పడక గదిలో అత్యంత ముఖ్యమైన బ్యూటీ వస్తువుల్లో అద్దం కూడా ఒకటిగా ఉంటుంది. అమ్మాయిలు తమ అలంకరణ సరిగా ఫర్ ఫెక్ట్ గా కుదిరే వరకూ అద్దం ముందు నిల్చొని తయారవుతుంటారు. మన అందాన్ని తెలిజేసే అద్దం అలాగే వదిలేస్తే ఎలా? మనం కూడా అద్దాన్ని చక్కగా అలంకరించవచ్చు. మరి అందుకొరకు కొన్ని చిట్కాలున్నాయి.
మీ ఇంట్లో పెద్ద అద్దం /పొడవాటి అద్దం లేదా చిన్న అద్దమైనా సరే ఉన్నట్లైతే, ఆ అద్దం యొక్క గ్లాస్ ను అలంకరించడానికి కొన్ని ఫర్ ఫెక్ట్ టిప్స్ ఇక్కడ అంధిస్తున్నాం. ఈ చిట్కాలను పాటించినట్లైతే, మీరు అద్దం చూసినప్పుడు మీ సృజనాత్మకతో అందంగా అలంకరించిన అద్దాన్ని చూసి ఆనందం కలుగుతుంది. అంతే కాదు మీ ఇంటికి వచ్చే అథితులకు కూడా కొత్తగా అనిపిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం...

స్పూన్స్: అద్దంను అందంగా అలంకరించడానికి మనకు ముఖ్యంగా కావల్సినవి వెడల్పు ఐస్ క్రీమ్ స్పూన్ప్ లేదా ప్లాస్టిక్ స్పూన్స్ . ఇవి కూడా మీ అద్దం యొక్క సైజును బట్టి ఎంపిక చేసుకోవాలి. అందుకు దాదాపు 100 స్పూన్లను సేకరించాలి. అవి ప్రతి ఒక్కటీ ఒకే సైజు కలిగి ఉండేవాటిని, వివిధ కలర్స్ లో ఉన్న స్పూన్లను ఎంపిక చేసుకోవాలి. స్పూన్స్ బాగా డ్రై అయిన తర్వాత అవాటిని అద్దానికి చుట్టూ అతికించాలి. ఇది ఒక ఫర్ఫెక్ట్ మిర్రర్ డెకొరేషన్ ఐడియా.
డ్రెసెప్ చేయాలి: మీ ఇంట్లో ఓవెల్ షేప్ మిర్రర్ ఉన్నట్లైతే మీరు చాలా సింపుల్ గా మిర్రర్ యొక్క చివర్లు బీడ్స్ తో వకర్ చేయండి . అన్ని ఓవల్ షేప్ మిర్రర్స్ ను పూసలు మరియు స్టుడ్స్ తో డెకరేట్ చేయవచ్చు . ఇది ఒక అద్భుతమైన అందాన్ని ఇస్తుంది.
క్యాప్చర్డ్ మూమెంట్: మీకు ఫోటో గ్రఫీ అంటే ఎక్కువ ఇష్టమైతే మీరు అద్దాన్ని అలంకరించడానికి ఒదొక పర్ఫెక్ట్ మార్గం . అద్దం చుట్టూ మీకు నచ్చిన, మీ ఫేవరెట్ ఫోటోగ్రాఫులను అతికించండి. ఇది ఇంటిఅలంకరణకు ఒక స్పెషల్ టచ్ అందివ్వడం మాత్రమే కాదు, మీరు అద్దం చూసినప్పుడు మీ స్వీట్ మెమోరీస్ గుర్తుకు వస్తాయి.
గిప్ట్ పేపర్స్: అద్దాన్ని అందంగా అలంకరించడానికి గిఫ్ట్ పేపర్లు కూడా కలర్ ఫుల్ గా ఉపయోగపడుతాయి . కాబట్టి డిఫరెంట్ కలర్స్ లో ఉన్న గిఫ్ట్ పేపర్లను అద్దానికి చివర్లలో స్టిక్ చేయండి. ఇది మరింత అందంగా కనబడటానికి సహాయపడుతుంది.
లైట్స్ : మీ అద్దానికి మీదు లైట్స్ ను అరేంజ్ చేసుకోగలిగితే, ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్ ను తీసుకొస్తుంది. షార్ప్ మరియు డిమ్ లైట్స్ ను మీ అద్దం మీద తగిలించాల్సిందే.



Click it and Unblock the Notifications