Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తప్పక వుండాల్సిన తోటపని పనిముట్లు!

1. పార - గార్డెనర్ అన్నవాడికి ఇది ఒక ప్రధాన పనిముట్టు. ఇది భూమి తవ్వటానికి పనికివస్తుంది. దీనికి ఒక హేండిల్ కూడా వుంటుంది. చెక్క హేండిల్ ను ఎప్పటికపుడు మార్చుకోవచ్చు.
2. గడ్డపారలు - వీటినే పలుగు అని కూడా అంటారు. దీనితో నేలను ఎంతలోతుకైనా సరే తవ్వవచ్చు. కొన్ని మొక్కలు లోతుగా పాతాలంటే దీని వినియోగం బాగా వుంటుంది.
3. తోపుడు పార లేదా కలుపు తీసే పనిముట్టు - ప్రతి గార్డెన్ లోను కలుపు తీయాల్సిందే. లేదంటే మనం కోరుకున్న మొక్కలు బాగా బతకవు. కనుక కలుపు తీయటానికి తోపుడు పార అవసరం ఎంతైనా వుంది.
4. గ్రౌండ్ రేక్ - ఈ పనిముట్టు భూమిని చదును చేయటానికి ఉపయోగపడుతుంది. నేల చదును చేయకుండా విత్తనాలు నాటితే, వదులుగా వున్న భూమిలో విత్తనాలు సరిగా మొలకలు వేయవు.
5. గార్డెన్ షియర్స్ - ఇవి గార్డెనింగ్ కత్తెరలు. గార్డెన్ పెరిగి పెద్దదయ్యే కొద్దీ పెరిగే మొక్కలను చక్కగా వివిధ రూపాలలో కత్తిరించాలంటే, ఈ కత్తెరల అవసరం ఎంతైనా వుంది.
6. నీటి కేన్ - మొక్కలకు నీరు పోయాలంటే, ఈ కేన్ వాడతారు. దీని నాజిల్ నుండి నీరు మొక్కకు అన్ని పక్కలకు పోయవచ్చు.
7. లాన్ మూవర్ - గార్డెన్ లో లాన్ పెంచాలనుకుంటే, ప్రతి రెండు వారాలకు ఒక సారి పచ్చిక బయలును కత్తిరించాలి. అందుకు గాను ఈ పనిముట్టు ఉపయోగపడుతుంది.
ఈ చిట్కాలు ఉపయోగించి సరైన తోటపని ముట్లు సేకరించి తోటపని నైపుణ్యతతో చేయండి.



Click it and Unblock the Notifications
