Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం...

నూనె రాసినట్లుగా నిగనిగలాడే ఆకుల మధ్యనుంచి అయిదు రేకులతో నక్షత్రాల్లా విప్పారిన గరుడవర్ధనం పూవును చూస్తున్నా, ప్రసన్నతకు మరో పేరులా ధవళవర్ణంలో ముద్దగా మెరిసే నందివర్ధనాలను చూస్తున్నా మనసు పవిత్ర భావనతో, ప్రశాంతతో నిండిపోతుంది. నలుపుతెలుపుల సమ్మేళనమే, సమన్వయమే జీవితమనే గొప్ప సత్యాన్ని నందివర్ధనాలు మనకు చెబుతున్నట్లుంటుంది. అనాదిగా ఇంటి తోటలో పెంచుకునే ఈ మొక్కల శాస్ర్తియ నామం ఒకటే- టాబర్‌నేమాంటోనియా కొరొనేరియా! వీటిని కేప్ జాస్మిన్ అని కూడా అంటారు.
ఏడాది పొడవునా పూసే ఈ మొక్కలు ఒక మీటరునుంచి నాలుగుమీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. ఈమధ్యకాలంలో బాల్కనీల్లో సైతం పెంచుకునేలా, కుండీలో పెంచుకోడానికి అనువుగా అర మీటరు లోపునే ఉండి 365 రోజులూ పూసే నందివర్ధనం రకాన్ని సైతం ఉత్పత్తిచేసారు. మామూల మొక్కలనైనా మరీ ఎత్తుగా పెరగకుండా అవసరమైన మేరకు ప్రూన్ చేయవచ్చు. ఈ మొక్కలను పశువులు, జంతువులు ముట్టుకోకపోవటం గొప్ప విశేషం. కొమ్మలను నాటడం ద్వారా వీటిని ప్రవర్ధనం చేస్తారు.
నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతిని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి. గృహ చికిత్సలు...
అప్పుడప్పుడు నందివర్ధనం చెట్టుకు ఆకులుకు తెగులు పట్టి ముడతలు పడుతుంటాయి. వర్షాకాలం మొదట్లో ఈ తెగులు మొదలవుతుంది. పురుగు ఆకులోని రసం పీల్చేస్తుంది. ఈ పురుగులను బొచ్చు పురుగులు అంటాం. బొచ్చు పురుగుకి రక్షణ కవచం. మనం పైన స్ప్రే చేసిన మందులు పురుగును చేరకుండా బొచ్చు అడ్డుకుంటుంది. పురుగు లేత దశలో అంటే రక్షణ కవచం ఏర్పడక ముందే జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఏ సాధారణమైన పురుగుమందు చల్లినా పురుగు చనిపోతుంది. ఈ పురుగు పోవడానికి చల్లే మందులను నందివర్థనం మొక్క ఆకుల మీ దచల్లకూడదు, చెట్టు మొదట్లోచల్లాలి.



Click it and Unblock the Notifications
