Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఇంటి అలంకరణకు..అందానికి..బాటిల్ గార్డెన్..

అవకాశం వుంటే ఇంట్లోనే చిన్న సైజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసు కోవాలని కొందరు కోరుకుంటారు. ఇటువంటి వారి అభిరుచికి తగ్గట్టుగా నేడు గార్డెనింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరిం చుకుంది. చాలామంది నగరవాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలో వివిధ ఆకృతులను రూపొం దించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాం టి వారికోసం గార్డెనింగ్‌లో కొన్ని మెళకువలను పాటిస్తే చాలంటున్నారు గార్డెనింగ్ నిపుణులు.
చిన్న చిన్న గాజు పాత్రలు, సీసాల్లో మొక్కలు పెంచటం గృహాలంకరణకు దోహదం చేసే ఓ చక్కటి హాబీ. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడని గాజు సీసాలు, పాత్రలు, ఆక్వేరియం బాక్సులు లాంటి వాటిల్లో మట్టి, రంగురంగుల గులకరాళ్లు, ఇసుక, బొగ్గు, ఇటుక ముక్కలు, ఎరువులను పోసి సిద్ధం చేసుకోవాలి. నెమ్మదిగా ఎదిగే పచ్చని మొక్కల్ని... అలాగే నీరు తక్కువగా అవసరమయ్యే మొక్కలను పెంచుకునేందుకు ఎంచుకోవాలి. గాజు పాత్ర తీసుకుని ముందుగా ఇటుకరాళ్ల ముక్కలు, ఆ తర్వాత బొగ్గులు, ఇసుక, మట్టి వేస్తూ.. మధ్యలో మొక్కని నాటాలి. చివరగా అందంగా కనిపించేందుకు గులకరాళ్లు, గవ్వలు పేర్చవచ్చు.
ఇలాంటి మొక్కలను గాజు పాత్రలో నాటినందువల్ల ఎక్కువైన నీరు బయటికి పోదు కాబట్టి నీరు ఎక్కువగా పోయకూడదు. మొక్క ఎండిపోతున్నట్లు అనిపించినా, ఇసుక మరీ పొడిగా కనిపిస్తున్నా, తరచుగా నీళ్లు చిలకరిస్తూ ఉంటే సరిపోతుంది. సూర్యరశ్మి ఎక్కువగా సోకని ప్రదేశంలో ఈ మొక్కలను ఉంచాలి. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే... ఇల్లంతా అందమైన మొక్కలను గాజు పాత్రల్లో సుమనోహరంగా, మీ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే. ఆ ఓపిక మాత్రం తెచ్చుకున్నారంటే, అందమైన పచ్చటి మొక్కలతో ఇల్లు నిండిపోవడం ఖాయం.



Click it and Unblock the Notifications
