Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇండోర్ ప్లాంట్స్ తో ఇల్లంతా గో గ్రీన్...

కుండీల్లో మొక్కలు పెంచితే ఇంటి వాతా వరణం పొడిగా, వేడిగా అనిపించకుండా ఆహ్లాదంగా మారుతుంది. గదుల్లో సైతం మనీ ప్లాంటేషన్ వంటి మొక్క లను పెంచితే వేడిని చాలా వరకూ తగ్గిస్తాయి. ఓ పద్దతుల్లో తీగలు పాతేలా చేస్తే ఇళ్లు అందంగా ఉంటుంది. పచ్చదనం కళ్లకు హాయినిస్తాయి. ఇంట్లో దక్షిణ, పడమర దిశల్లో మొక్కలు నాటితే ఇల్లు చల్లగా ఉంటుంది. చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా.
ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. దానికి ఇంట్లోనే చిన్నపాటి మొక్కలను పెంచుకుంటుంటే శరీరానికి కావలసిన తగిన ప్రాణవాయువు(ఆక్సిజన్) మనకు ఎల్లప్పుడూ లభిస్తుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్యులు. అదికూడా నీడలో పెరిగే మొక్కలు పెంచుకుంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోపల స్థలం ఉంటే డెకరేటివ్ పాట్స్ లేదా స్టాండుల్లో ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ వేరు భాగాల్ని శుభ్రం చేసి నీళ్లు నింపిన వేజుల్లో కూడా ఉంచొచ్చు. మొక్కలు ఉన్న దగ్గర పగటి ఉష్ణోగ్రతలు మొక్కలు లేని ప్రాంతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications