Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
గార్డెన్ గురించి తీసుకోవాల్సిన 12 జాగ్రత్తలు !!
మీ తోటను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవడ౦ కష్టమైన పనే. మీరు వాతావరణ మార్పులను, జంతువులను, కలుపును అస్తమానూ ఎదుర్కొంటూ వుండాలి. కాబట్టి మీరు మీ తోట గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు ఏమిటి? తెలుసుకోవడానికి చదవండి.

సరైన పరికరాలు తెచ్చుకోండి.
మీ తోటను చక్కగా నిర్వహించుకోవడానికి మీకు ముందుగా కావలసినవి పారలు, కత్తెర లాంటి సరైన పని ముట్లు.

సరైన సమయానికి నీరు పోయండి.
ఆవిరైపోకుండా వుండాలంటే, మీరు ఉదయాన్నే గానీ లేక రాత్రి పూట గానీ నీరు పోయాలి.

సరైనసరైన ఎరువులు తెచ్చుకోండి.
మీ తోటలోని మట్టి స్వభావాన్ని బట్టి, మీ మొక్కలు నిత్యం పచ్చగా ఉండడానికి అవసరమయ్యే సరైన ఎరువులను వాడండి.

ఎప్పుడూ గడ్డితో కప్పి వుంచండి.
మట్టి కోతకు గురి కాకుండా ఉండడానికి, తేమ నిలిపి ఉంచడానికి, కలుపు మొక్కల నుంచి పుట్ట గొడుగులు రాకుండా ఉండడానికి మట్టి మీద గడ్డితో కప్పి ఉంచాలి. అందువల్ల నిత్యం గడ్డి కప్పి వుంచి ప్రయోజనాలు పొందండి.

సీజనల్ మొక్కలు పెంచండి
సీజనల్ మొక్కల వల్ల మీ తోట ఏడాదిలో ఎక్కువ కాలం పాటు పచ్చగా, దట్టంగా కనపడుతుంది. వాటిని సరైన సమయంలో విత్తి ఏడాది పొడవునా పచ్చటి తోట కళకళలాడేలా చేయండి.

కలుపులు
కలుపు తీయడం తోటల నిర్వహణలో చాలా ముఖ్యమైన భాగం. మీకు ఖాళీ వున్నప్పుడల్లా మీ తోటలోకి వెళ్లి కలుపు తీస్తూ వుండండి.

నిత్యం పచ్చగా వుండే మొక్కలు తెండి
వీటి వల్ల ఏడాదిలో ఎలాంటి సమయంలోనైనా మీ తోట పచ్చగా కళకళ లాడుతూ వుంటుంది.

త్వరగా పండే మొక్కలు వేయండి
త్వరగా పండే మొక్కలు వేస్తె మళ్ళీ కొత్త మొక్కలు నాటవచ్చు. దీని వల్ల కలుపు మొక్కలు పెరగకుండా వుండి, మీ తోట నిండుగా వుంటుంది.

ఎక్కువగా నీళ్ళు పోయకండి
మొక్కలకు నీళ్ళు అవసరమే కానీ మరీ ఎక్కువగా పోస్తే అవి పసుపు పచ్చగా మారిపోతాయి.

ఎరువులు వాడ౦డి
జంతు, వృక్ష వ్యర్ధాల నుంచి ఎరువులు తయారౌతాయి. వీటిని సాధ్యమైనంత ఎక్కువగా వాడి మీ మట్టిని సారవంతంగా తయారు చేసుకోండి.

అవసరం లేక పొతే మొక్కలు కత్తిరించకండి
కొన్ని మొక్కలను, పొదలను అస్తమానూ కత్తిరించక్కర్లేదు. వాటిని కొద్ది సార్లు మాత్రం ట్రిమ్ చేయండి చాలు.

మట్టి రకాన్ని గుర్తించండి
మీ తోటలోని మట్టి స్వభావాన్ని గుర్తించడం వల్ల మీకు దానిలో ఎన్ని సార్లు నీళ్ళు పోయాలో తెలుస్తుంది. మీ తోటను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీకు ఈ సూచనలు బాగా ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
