ఈ వింటర్ సీజన్ లో మీ గార్డెన్ పెరిగే వెజిటేబుల్స్

ప్రస్తుతం శీతాకాలం మొదలవుతోంది, చల్లని వాతావరణం మన శరీరాన్నే కాదు వాతవారణాన్ని కూడా పొడిబారించేలా చేస్తుంది. ఇటువంటి వాతావరణంలో మన గార్డెన్ లో ఏదైనా కొత్తగా మొక్కలు నాటుకొని గర్డెన్ అంతా పచ్చగా ఉండేలా చేయాలనిపిస్తుంది. శీతాకాలంలో చాలా రకాల పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు కావలసినంత నీరు, తేమ లభిస్తుంది కాబట్టి, ఈ సీజన్ లో మొక్కలను నాటుకోవడం మంచిది. మొక్కలు పెంచడం ఒక కళ. కొంత సమయాన్ని, మరికొంత శ్రమనుజోడిస్తే ఆ కళలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఇంటి ఆవరణలో చక్కటి తోటను పెంచవచ్చు. గార్డెన్‌ను చక్కగా మెయింటెయిన్ చేస్తే, తాజా గాలిని, పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ, పండే కూరగాయలను తింటూ.. ఇట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.

రోజంతా ఎన్ని ఒత్తిడులకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో పెరిగిన కూరగాయలతో తాజాగా, రుచికరమైన భోజనం కూడా చేయవచ్చు. ఇంటి ఆవరణలో ఏడాదిలో ఏ కాలంలోనైనా సూర్యరశ్మి, గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గింజలు లేదా మొక్కలను సిద్ధం చేసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కలను కొనడం కంటే మనమే గింజలు చల్లి నారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఈ వింటర్ సీజన్ లో మార్కెట్లో వివిధ రకాల వింటర్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయి. వింటర్ మనందరికీ ఒక ఫ్రెండ్లీ సీజన్ వంటిది ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఈ సీజన్ లో అధికంగా దొరుకుతాయి. కాబట్టి, ఈ మొక్కలను మీ గార్డెన్ లో నాటి మీ గార్డెన్ మరింత పచ్చగా మరియు మీకు ప్రయోజనకారిగా, హెల్తీ గా పెంచుకోండి.

వింటర్ సీజన్ లో మన ఇంటి పెరడులో అనేక రకాల పండ్లు, మరియు వెజిటేబుల్స్ కూడా పెంచుకోవచ్చు.! కాబట్టి సేద్రియపద్దతిలో పండించని కూరగాయల కొరకు ఎందుక డబ్బు ఖర్చుచేయడం. మీ ఇంటి ఆవరణలో ఒక గ్రీన్ కలర్ వింటర్ గార్డెన్ ఏర్పాటు చేసుకోండి. ఇది చాలా తక్కువ మెయింటెనెన్స్ వెజిటేబుల్ గార్డెన్స్ మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే చాలా త్వరగా పెరుగుతాయి. మొక్కను నాటే ముందు చెట్టు వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా, రాళ్లను తొలగించి మట్టిని గుల్లబరిచి, నేలను చదును చేయాలి. పై పొరలో ఆకులు, గడ్డి నింపాలి. ఇది నీరు ఎక్కువ - తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నిరోధిస్తుంది. ఈ పొర భూమిలోని అదనపు తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది. గింజలు చల్లిన నేలను నీటితో నింపకుండా, ప్రతిరోజూ కాస్త నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొక్కల మొదళ్లకు మాత్రం నీటిని సరిపెట్టకుండా ఆకుల మీద కూడా చల్లాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.. ముఖ్యంగా శీతాకాలంలో అటువంటి వింటర్ గార్డెన్ వెజిటేబుల్ మొక్కలు ఏంటో ఒకసారి చూద్దాం..

1. టమోటోలు:

1. టమోటోలు:

టమోటో విత్తనాలు చల్లుకోవడం వల్ల మీరు విరివిగా టమోటోలను మీ ఇంటి గార్డెన్ లో పెంచుకోవచ్చు . ఈ చెర్రీ టమోటోలను మాత్రమే కాదు పెద్ద టమోటోలను కూడా సమ్మర్ సీజన్ లో పెంచుకోవచ్చు. కాబట్టి చిన్న సైజు టమోటోలకు వింటర్ చాలా మంచి సమయం.

2. ఆకుకూరలు:

2. ఆకుకూరలు:

రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వింటర్ సీజన్ లో పెరుగుతాయి. ఇవి అతి త్వరగా పెరుగుతాయి. విత్తనాలను కుంపట్లో చల్లకొన్న సరే మూడు నాలుగు వారాలకంతా మొక్కలు బాగా మొలకెత్తి అతి త్వరగా పెరుగుతాయి. అయితే ఆకు కూరల మీదు క్రిముకీటకాలు ఎక్కువగా వ్యాపిస్తాయి కాబట్టి, చీడపట్టకుండా తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం.

3.వింటర్ క్క్వాష్:

3.వింటర్ క్క్వాష్:

వింటర్ లో చాలా సులభంగా పెరిగే వెజిటేబుల్స్ లో ఇది ఒకటి. మీ గార్డెన్, వింటర్ లో సులభంగా పెరిగే ఇటువంటి మొక్కలను పెంచుకోవచ్చు.

 4. క్యాబేజ్:

4. క్యాబేజ్:

స్ప్రింగ్ క్యాబేజ్ అతి సులభంగా ఇంటి ఆవరణంలో పెంచుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజీ మొక్కలు నాటేటప్పుడు మొక్కకు మొక్కకు కొంచె దూరం ఉండాలి. క్యాబేజీ పెరిగే కొద్దీ పెద్దగా విచ్చుకుంటుంది. క్యాబేజీ మొక్కలకు పూర్తి సూర్య రశ్మి పడేవిధంగా చూసుకోవాలి. అయితే ఎక్కువ వేడి తగలకుండా చూసుకోవాలి.

5. ఆస్పరాగస్:

5. ఆస్పరాగస్:

శీతాకాలంలో అతి సులభంగా పెరిగే మొక్క. మార్కెట్లో దీని ఖరీదు కూడా ఎక్కువే. అటువంటి మొక్కను మన ఇంటి గార్డెన్ లో పెంచుకోవడం డబ్బుకు డబ్బు ఆదా.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎక్కువ డబ్బు ఖర్చుచేయకుండా, రసాయనాలు వాడకుండా మనమే స్వీయంగా పెంచుకోవచ్చు. నాన్యమైన విత్తనాలు తెచ్చి ఒక చిన్న ట్రేలో చల్లుకొన్నా సరిపోతుంది.

6. చిన్న ఉల్లిపాయలు

6. చిన్న ఉల్లిపాయలు

6. చిన్న ఉల్లిపాయలు వంటకాలు ఉపయోగిస్తే ఎంత రుచికరంగా ఉంటాయో అందరికీ తెలిసి విషయమే. రుచి మాత్రమే కాదు వాసన కూడా ఘాటుగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలను పూర్తిగా ఏర్పడే వరకూ లాగకూడదు. లేదంటే రుచి కాస్త స్వీట్ గా ఉంటుంది. వీటికి వారానికి ఒక సారి నీరు పోస్తే సరిపోతుంది. ఈ ఐదు వింటర్ లో పెరిగే వెజిటేబుల్స్. మరి మీ గార్డెన్ లో ఇతర మొక్కలతో పాటు వీటిని కూడా పెంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వీటితో పాటు ఇంకా కొత్తిమీర, క్యారెట్, బీట్ రూట్, టమోటో, వెల్లుల్లి, అల్లం వంటివి కూడా శీతాకాలంలో ఇంట్లోనే కుంపట్లలో పెంచుకోవచ్చు.

7. పీస్:

7. పీస్:

శీతాకాలం ప్రారంభ సమయంలో వీటిని మీ గార్డెన్ లో వేసుకోవచ్చు . ఈ సీజన్ లో పండే లేలేత గ్రీన్ పీస్ ను మీ సూప్స్ లేదా సలాడ్స్ లో జోడించి మరింత కొత్త టేస్ట్ ను జోడించవచ్చు. ఈ పచ్చిబఠానీలు మొలకెత్తాలంటే ఒక కాటన్ వెట్ క్లాత్ లో చుట్టిపెట్టాలి. ఈ పచ్చిబఠానీ విత్తనాలు మొలకెత్తిన తర్వాత భూమిలో నాటాలి.

8.లెట్యూస్:

8.లెట్యూస్:

విటర్ లెట్యూస్ లేదా ల్యాంబ్ లెట్యూస్ మీ వింటర్ వెజిటేబుల్ గార్డెన్ లో పెంచుకోవచ్చు. ఈ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ మీ పెరడులో చాలా సులభంగా , త్వరగా పెరుగుతాయి.

Story first published: Saturday, November 16, 2013, 14:59 [IST]
Desktop Bottom Promotion