Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
దుస్తులపై పడిన మొండి మరకలు తొలగించడం ఎలా?
దుస్తులపై పడిన మొండి మరకలు తొలగించడం ఎలా?
బట్టల పై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ, గ్రీజు మరియు రస్ట్ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ కింది చిట్కాలను పాటీంచి చూడండి. అయితే ఒక మరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయకపోవచ్చు.
సిరా మరక : దుస్తులపై పడిన సిరా మరక తొలగించాలంటే మరక పై హెయిర్ స్ప్రే ను స్ప్రేచేసి అయిదు నిముషాల పాటూ ఆగి ఉతికి చూడండి. ఒకవేళ బట్ట ఆరడానికి డ్రయ్యర్ వాడుతున్నట్లయితే మరక పూర్తిగా పోయిందో లేదో చూసి మరీ డ్రయ్యర్ లో వెయ్యండి, లేకపోతే డ్రయ్యర్ లో వేడికి బట్టపై శాశ్వతంగా మరక మిగిలిపోతుంది.

రక్తం మరకలు: ముందుగా రక్తం మరక పడిన బట్టను వెంటనే చల్లటి నీటిలో నానబెట్టాలి.ఆ పైన వైట్ వెనిగర్ తో శుభ్రపరచి శుభ్రమైన మరొక బట్టతో మరక ఉన్న బట్టను రుద్దకుండా అదిమి పట్టాలి. పూర్తిగా రక్తం మరకు ఇంకిపోయే వరకు అదిమిపట్టుకుని ఆపైన వెనిగర్ వాసన పోయే దాకా నీళ్లల్లో జాడించాలి.
కాఫీ మరకలు: దుస్తులపై పడిన కాఫీ మరకను తొలగించడానికి బొరాక్స్ మరియు నీరు కలిపి పేస్ట్ తయారు చేసుకుని ఆ పేస్ట్ ను మరకపై రాయాలి. ముప్పై నిముషాల తర్వాత నీళ్ళలో జాడించి బట్టను ఉతిక్కుంటే కాఫీ మరక మాయం అవుతుంది.
గ్రీజు మరకలు: గ్రీజు అంటుకుంటే ఓ పట్టాన వదలదు. రబ్బింగ్ ఆల్కహాల్ ను మరక పడిన చోట రాయాలి. ఒక శుభమైన బట్టతో రుద్దకుండా జాగ్రత్తగా మరక దాదాపుగా పోయే వరకు అదిమి పట్టుకోవాలి.ఆ తర్వాత గిన్నెలు తోముకునే డిటర్జెంట్ ను పూసి కొద్ది నిముషాలపాటు వదిలేసి ఆ పైన నీళ్ళలో జాడించి ఉతికితే గ్రీజు మరకను పోగొట్టవచ్చు.
తుప్పు మరకలు: తుప్పు మరక పడిన బట్టపై క్రీం ఆఫ్ టార్ టార్ ధారాళంగా జల్లి బట్టను మడిచి ఉంచాలి. బకెట్ లో వేడి వేడి నీళ్ళలో ఆ బట్ట పూర్తిగా మునిగే వరకు 5 నిముషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత నీళ్ళలో జాడించి ఉతికితే తుప్పు మరక పోతుంది.



Click it and Unblock the Notifications