Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
సీలింగ్ ఫ్యాన్స్ శుభ్ర పరచడమెలా?

- ఎత్తు స్టూలుపై ఎక్కవ సేపు నించోరాదనుకుంటే మీరు సీలింగ్ ఫ్యాన్ ఊడదీసి శుభ్రపరచటం మంచిది. అన్ని బ్లేడ్లు ఊడదీసి ఒక్కొక్కదానిని శుభ్రం చేయవచ్చు. వాటిని వేడి సబ్బు నీటిలో ముంచి దానిపై పేరుకున్న మురికినంతా వదలగొట్టటానికి బాగా రుద్దండి. నీటితో శుభ్రంగా కడిగేయండి. అన్ని వస్తువులను కడిగి ఎలా శుభ్రం చేస్తామో బ్లేడ్ లను కూడా అదే విధంగా సౌకర్యవంతంగా శుభ్రం చేయవచ్చు. అయితే సమస్యల్లా మళ్ళీ దానిని ఫిట్ చేయటమే. మనలో చాలామంది మళ్ళీ ఫిట్ చేయాలంటే అశ్రద్ధ చేస్తారు. సరి అయిన అవగాహన లేకుంటే, బ్లేడ్లు ఊడతీయవద్దు. అవి ఫిటింగ్ సమయంలో ఏ మాత్రం లూజ్ గా వున్నా ఎగిరి కిందపడి యాక్సిడెంట్ చేస్తాయి.
-ఊడతీయకుండా శుభ్రం చేయాలంటే, ఒక ఎత్తైన స్టూలుపై నిలుచుని రెక్కలను శుభ్రం చేయవచ్చు. అయితే నీటితో కడగటం సాధ్యం కాదు. అయితే, ఒక బ్రష్ ను నీటిలో ముంచి శుభ్రం చేయవచ్చు.
బ్రష్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక స్పాంజి తీసుకొని సబ్బు నీళ్ళలో ముంచి దానితో బ్లేడ్లను శుభ్రం చేయండి. దీని తర్వాత వేడినీటిలో ముంచిన గుడ్డతో బ్లేడ్లను తుడవాలి. తర్వాత మంచి పొడి బట్టతో ఫ్యాను తుడిచేయండి. ఫ్యాన్ తళతళలాడుతూ శుభ్రంగా వుంటుంది.
కొన్ని జాగ్రత్తలు పాటించండి-
ఎత్తులో వుండటం వలన, దానిని శుభ్రం చేయాలంటే అశ్రధ్ధ చేస్తాము. పదునైన బ్లేడ్లు చేతి వేళ్ళను కోసే ప్రమాదం వుంది. మీరు నిలబడేటపుడు గట్టి అయిన స్టూలు పై నిలబడ్డామా లేదా అనేది పరిశీలించండి. దుమ్ము పీల్చకుండా ముక్కుకు గుడ్డ కట్టండి. ఫ్యాన్ లను శుభ్రం చేయటం అవసరం. లేదంటే దానిపై పేరుకునే దుమ్ము కణాలను అది తిరిగినంత సేపూ పీల్చటం లేదంటే, ఆహార పదార్ధాలలో పడే అవకాశం కూడా వుంది.



Click it and Unblock the Notifications
