Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
మీ ఆఫీస్ డెస్క్ ఎలా సర్దుకోవాలి?

పనికిరాని వస్తువులన్నీ తీసేయండి. అనవసరమైన వన్నీ దూరంగా ఒక చోట పెట్టండి. ఎందుకంటే ఆఫీస్ గది ఇరుకుగా చిన్నగానే వుంటుంది. మరి వున్నదాంట్లోనే నీట్ గా పెట్టుకోవాలి. కనుక పాత రికార్డు, నోట్ బుక్ లు అన్నీ దూరంగా వేరే ప్లేస్ లో పెట్టేయండి. భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది..అనుకుంటే కంప్యూటర్ లో ఒక కాపీ పెట్టుకోండి. నేటి రోజుల్లో అన్నీ కాగితాల రూపంలోనే వుండాల్సిన అవసరం లేదు. మీ చెత్త బుట్టను రెగ్యులర్ గా శుభ్రం చేయండి. వారానికోసారి పనికిరానివన్నీ బయట వేయాలని నిర్ణయించుకోండి. తినే పదార్ధాలేవీ మీ డెస్క్ పై వుంచకండి. అసహ్యమైపోతుంది. ఒక టేబుల్ మ్యాట్ వేసి దానిపై మీరు తినే స్నాక్స్ లేదా కాఫీ మగ్గు వంటివి వుంచండి. ఇలా చేస్తే కాఫీ మరకలవంటివి మీ డెస్క్ పై పడకుండా వుంటాయి.
ఎప్పటికపుడు మీకవసరమైన ప్రోగ్రాములు తెలిపే పేపర్ బోర్డు చక్కగా వుంచండి. దానిపై గల పాత నోటీసులు వుంటే తీసి కొత్తవాటికి సౌకర్యం చేయండి. వీలైనంతవరకు ప్రధానమైన అంశాలే మీ పేపర్ బోర్డుపై వుంటే వాటిని మీరు మిస్ అవకుండా వుంటారు. పని అయిపోయిన తర్వాత రోజు చివరలో ఒకసారి మీ డెస్క్ శుభ్రపరచుకోవాలని నియమం పెట్టుకోండి. దీనితో మరుసటి రోజు చక్కని టేబుల్ పై మీరు పని ప్రారంభించుకోటానికి ఆహ్లాదంగా వుంటుంది.
ఈ నిర్వహణా చిట్కాలు పాటిస్తే మీరు సమర్ధవంతంగా పనిచేసే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications
