Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వార్డ్ రోబ్ ఎలా సర్దు కోవాలి?

1. ఇప్పటివరకు వేస్తున్న చేతులు లేని టాప్ లు, పేంట్లు వంటివి వార్డ్ రోబ్ నుండి తీసేయండి. చలికాలం వచ్చేసింది కనుక మీకుగల స్వెట్టర్లు, లెదర్ జాకెట్లు వంటివి అందులో పెట్టండి.
2. తరచుగా వాడని దుస్తులు కూడా వార్డ్ రోబ్ నుండి తీసేయండి. ఇక మీరు వార్డ్ రోబ్ లో పెట్టాలనుకున్న దుస్తులను పై అరనుండి కింది వరకు పెట్టుకుంటూ రండి.
3. జాకెట్లు, స్కార్ఫ్ లు వంటివి హేంగర్లకు వేస్తే తీసుకోవడం తేలిక. అవి కూడా నలగకుండా వుంటాయి.
4. జీన్సు, పేంట్లు వంటివి వార్డ్ రోబ్ లో ఒక మూల పెట్టండి. జీన్స్ వంటి మందమైన గుడ్డలను వరుసకు నాలుగు లేదా అయిదుకు మించి పెట్టకండి.
5. టీ షర్టులన్ని ఒక చోట ఉంచండి. అనవసరమైన టాప్ లన్ని తీసేసి కొత్త దుస్తులకు చోటు కల్పించండి.
6. తరచుగా ధరించే దుస్తులు వార్డ్ రోబ్ లో ముందు వరుస పెట్టండి.
7. పార్టీలకు వేసుకు వెళ్ళే దుస్తులు ప్రత్యేక కవర్లలో పెట్టి వుంచితే, శుభ్రంగాను, నలగకుండాను వుంటాయి. ప్రతిసారి డ్రైక్లీనింగ్ కు వేయాల్సిన పనికూడా వుండదు.
ఇక అన్ని సర్దిన తర్వాత వార్డ్ రోబ్ అరలలో తగినన్ని కలరా వుండలను వేయటం మరచిపోకండి. ఇవి మీ దుస్తులను పురుగుల బారినుండి, చెడు వాసనలనుండి కాపాడతాయి.



Click it and Unblock the Notifications
