Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
కంప్యూటర్లు - ల్యాప్ టాప్ లు ఎక్కువ కాలం మన్నాలంటే...!

1. ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటప్పుడు కంప్యూటర్ మీద చురుగ్గా పని చేయడం, తర్వాత చటుక్కున లేచి వెళ్ళిపోవడం, మళ్లీ ఇప్పుడే వచ్చి పని చేసుకుంటాం కదాని అనుకోవడం సాధారణంగా జరగుతుంది. అది సరికాదు. కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా షట్ డౌన్ చేయాలి. తరచూ అలా చేస్తే పాడవుతుందన్నది అపోహ మాత్రమే. నిజానికి మన్నిక కాలం పెరుగుతుంది.
2. అందమైన స్క్రీన్ సేవర్ అందరూ చూస్తారనే వదిలేశఆ అనడమూ సరికాదండోయ్..!దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి...రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం.
3. మరీ చిన్నపాటి విరామానికే షట్ డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్ ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సంగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్... వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
4. ల్యాప్ టాప్ ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్ ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్ ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్ టాప్ విషయంలోనే కాదు... సెల్ ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.
5. అలాగే ఏసీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే: ఫ్యాన్ వాడకానికి గంటకి ఇరవై నుంచి ఇరవై ఐదు పైసలు ఖర్చయితే ఏసీకి గంటకి ఆరు రూపాయల వరకు విద్యుత్ ఖర్చవుతుంది. అయితే చిరు జాగ్రత్తలతో కొంత ఆదా చేయవచ్చు. ఫ్యాన్ వేసి గదిని వీలైనంత వరకు చల్లబరచాలి. అంతకంటే ముందు, తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల లోపలున్న వేడిగాలి బయటకు పోయి చల్లగాలి లోపలికొస్తుంది. అప్పుడు ఏసీని ప్రారంభిస్తే గది త్వరగా చల్లబడుతుంది.
6. నాణ్యత కలిగిన ఎయిర్ కండిషనర్ తొలి అరగంటలోనే గదిని చల్లబరిచి హాయినందిస్తుంది. తర్వాత చాలసేపు అది చల్లగానే ఉంటుంది. అందుకే పరికరంలోని టైమర్ కి 30నిమిషాలనే అమర్చాలి. ఇంటి చుట్టూ చెట్లు, పొదలు... డాబాలపై రూఫ్ గార్డెన్ లను పెంచడం వ్ల కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది. దాంతో ఏసీలు త్వరగా గదులని చల్లబరుస్తాయి. సుమారు నలభై శాతం విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.
7. ఏసీ 25డిగ్రీల వద్ద సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ చాలా మంది వేసవి అనగానే వేడి ఎక్కువని, పద్దెనిమిది, పందొమ్మిది వద్ద పెడుతుంటారు. ఈ డిగ్రీలు తగ్గే కొద్దీ విద్యుత్ వాడకం పెరుగుతుంది. అలాకాక ఏసీని పాతిక డిగ్రీల వద్దే ఉంచి, ఫ్యాన్ వేసుకుంటే ఇంచుమించు పద్దెనిమిది డిగ్రీల వద్దనుండే చల్లదనమే పొందగలుగుతాం.
8. వాటిల్లోని ఫిల్టర్లని ప్రతినెలా శుభ్రం చేయడం వల్ల ముఫ్ఫై శాతం ఖర్చు తగ్గుతుంది. కిటికీలకు, గ్లాసులకు టింటెడ్ గ్లాసు అంటే నల్లని పూతలాంటి దాన్ని వేయడం వల్ల ముఫ్పై శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీ వేశాలక తలుపులు, కిటికీలు తరచూ తీసి, మూయడం వల్ల బోలెడు శక్తి వృథా అవుతుంది. వాటంతటవే ఆగిపోయే (ఆటోమేటిక్ టెంపరేచర్ కటాఫ్)సౌకర్యం ఉన్న వాటిని ఎంచుకుంటే మంచిది. లైట్లు, టీవీ సెట్లు వంటి వేడి వెలువరించే పరికరాలని ఏసీలకు దగ్గరగా ఉంచితే వాటిలో ఉండే ఆటోమేటిక్ సెన్సర్లు గది చల్లదనాన్ని గ్రహించలేక ఎక్కువగా పనిచేస్తాయి. ఖర్చు పెరుగుతుంది.



Click it and Unblock the Notifications