Latest Updates
-
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!
కోలా తో ‘నూనె- రక్తం’ మరకలు మటు మాయం...!
కోలా ఒక శీతలపానీయం అని అందరికి తెలిసిన విషయమే. అయితే దీన్ని సీతలపానియంగా సేవించడమే కాకుండా వేరొక రకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చని మీకెవ్వరికైనా తెలుసా...?కోలాతో ఇంట్లోని కొన్నివస్తువులను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.! కాబట్టి కోలా పూర్తి తాగేయకుండా చివరలో కొంచెం మిగిలించి మీఇంటి శుభ్రతలో ఉపయోగించి చూడండి. కోలా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కార్బొనేటెడ్ డ్రింక్ ను ఇంటి శుభ్రతలో ఎలా ఉపయోగించాలో, శుద్ది కార్యక్రమంలో వాటి ప్రయోజనాలేంటో చూద్దాం.

మాడిన వంట పాత్రలను శుభ్రం చేయుటకు: మాడిన పాత్రలను కోలా అతి సులభంగా శుభ్రం చేస్తుంది. వంట చేసే టప్పుడు కొన్ని సందర్భాల్లో గిన్నెలో మాడుతుంటాయి. ఒక్కోసారి వాటిని తొలగించడానికి వీలు పడనంతగా మాడిపోయి గట్టిగా పాత్రలకే అంటుకొని ఉంటాయి. మరి అలాంటి మొండి మరకల్ని కోలాతో తొలగిపోతాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..ఒక్కసారి మీరూ ప్రయోగించి చూడండి. మీ పాత్ర కొత్తవాటిలా తళతళలాడిపోతాయి. ముందుగా మాడిన పాత్రలో కోలను ఆ నలుపు భాగం మొత్తం కవర్ అయ్యే విధంగా పోసి కొద్ది నిమిషాల పాటు గ్యాస్ స్టౌ మీద వేడి చేయాలి. పది లేదా ఇరవై నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాత్రను క్రిందికి దింపుకొని స్టీల్ స్ర్కబ్ తో బాగా రుద్ది, నీటితో శుభ్రం చేసుకొంటే మీ పాత్రలు ముందువాటిలా తళతళ మెరిసిపోతాయి.
దుస్తుల మీద మరకలను తొలగించడానికి: బట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్ లో రకరకాల స్టైయిన్ రిమూవర్ లిక్విడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి అతి తక్కువ విలువతో దొరికే కోలాను బట్టలపై మరకలను వదలగొట్టడానికి ఉపయోగించి చూడండి. కోలాతో బట్టపై పడిన ఆయిల్ మరకలను మరియు రక్తపు మరకలను అతి సులభంగా వదలగొడుతుంది.
మరకలను వదలగొట్టడానికి ఒక బకెట్ నీటిలో లేదా వాషింగ్ మిషల్ మామూలుగా మీరు ఉపయోగించే డిటర్జెంట్ పౌడర్ తో పాటు కోలాను కూడా ఒకటి లేదా రెండు కప్పులు కలిపి తర్వాత మరక దుస్తులను అందులో నానబెట్టుకోవాలి. తర్వాత బ్రష్ చేసి ఉతికినట్లైతే, ఒక్క ఉతుకుతోనే ఆ దుస్తులపై ఉన్న నూనె మరకలు మాయమైపోతాయి. రక్తపు మరకలున్నా దుస్తులపై కోలాను డైరెక్ట్ గా పోసి ఐదు నుండి పదినిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత డిటర్జెంట్ పెట్టి ఉతికితే రక్తపు మరకలు కూడా సులభంగా వదిపోతాయి.
టాయిలెట్ క్లీనింగ్: కోలాను ఉపయోగించి బాత్ టబ్ ను, టాయిలెట్ పాట్ ను శుభ్రం చేయవచ్చు. వీటి మీద కోలా పోసి అరగంట పాటు అలాగే ఉంచేయాలి. అరగంట తర్వాత టాయిలెట్ బ్రష్ ను ఉపయోగించి రుద్ది నీళ్ళు పోసి కడిగేస్తే మరకలు, వదిలి శుభ్రపడుతాయి.
తుప్పు మరకలను వదిలించుట: ఇంట్లో మెటల్ వస్తువులు ఉన్నప్పుడు తప్పు పట్టడం సహజం. అలా తుప్పు పట్టిన మరకలను వదిలించుకోవడానికి కోలా ఉపయోగించవచ్చు. తుప్పు మరకలను వదలగొట్టడంలో ఇది చాలా సులభమైన పద్దతి. మెటల్ వస్తువును కోలా నింపిన టబ్బులో ముంచి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే లేచి వాటిని రుద్ది కడిగితే చాలు. మంచి షైనింగితో మెరిసిపోతాయి.
గ్లాస్ ను శుభ్రపరచడంలో: కోలా ఉపయోగించి కారు అద్దాలు లేదా ఇంట్లోని కిటికీ అద్దాలను శుభ్ర చేసుకోవచ్చు. కోలాలో ఉండే సిట్రిక్ యాసిడ్ గాజు వస్తువులను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కోలాను అద్దంపై చిలకరించి చిన్న స్పాంజ్ లేదా మెత్తటి క్లాస్ ను ఉపయోగించి తుడిస్తే చాలు అద్దం శుభ్ర పడి మెరుస్తుంటుంది.



Click it and Unblock the Notifications
