Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
సహజ పరిమళాలతో ఇంట్లో సువాసనలు

1. ఇంట్లో, వంట గదిలో చెత్త డబ్బాలను శుభ్రపరిచాక వాటిలో లవంగాలు, దాల్చిన చెక్కను పొడి చేసి రెండు మూడు చెంచాలు చల్లాలి. లేదంటే ఫ్యాబ్రిక్ వస్త్రాన్ని పరిచినా వాసనలు పీల్చేసుకుంటాయి.
2. వంట చేసే సమయంలో కిటికీ, గుమ్మం తలుపులు తీసి ఉంచితే వేడి గాలి, ఘాటు వాసనలు బయటకు వెళ్లిపోతాయి.
3. చేపలు, క్యాబేజీ వండేటప్పుడు వచ్చే వాసనలు చాలామందికి నచ్చవు. అలాంటప్పుడు పొయ్యి పక్కన గిన్నెలో వైట్ వెనిగర్ పోసి పెట్టాలి. దాంతో ఆ సమస్యలేమీ ఉండవు.
4. వంట పాత్రల వాసన పొగొట్టాలంటే..వంటషోడా కల్పిన నీటితో కడిగితే చాలు.
5. వంటింట్లో సింక్ లో నుంచి వాసన వస్తోంటే ఒక కప్పు వంటసోడాను, ఒక కప్పు వైట్ వెనిగర్ ను పోసి బాగా మరిగే నీరు సింక్ లో పోస్తే ఆ తర్వాత సింక్ లో నుండి దుర్వాసన రాదు.
6. ఫ్రిజ్ ను వాడకుండా పక్కన పెడితే.. తలుపు తీసినప్పుడు దుర్వాసనలొస్తాయి. వాడని సాక్స్ లేదా గ్లవుజు తీసుకొని దాన్లో కాఫీ గింజలు నింపి ఫ్రిజ్ లో ఉంచితే సరిపోతుంది.
7. డీప్ ఫ్రిజ్ లో లిక్విడ్ బాటిల్స్ కూలింగ్ నిమిత్తం ఉంచే సమయంలో..బాటిల్ లో లిక్విడ్ నిండుగా లేకుండా కొంత వెలితి ఉండేలా చూసుకోవాలి.
8. కప్పున్నర నీళ్లలో నాలుగైదు లవంగాలు లేదా నిమ్మచెక్కలు వేసి ఓవెన్ లో ఉంచి వేడి చేయాలి. పావుగంటయ్యాక కప్పు తీసేస్తే దానిలోంచి తాజా సువాసనలు బయటకొస్తాయి.



Click it and Unblock the Notifications
