Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
రంగురంగుల హరివిల్లుతో మీ జీవితం రంగులమయం..

పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వేరే రంగుతో కలిసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఏ రంగు ఎలా ఉంటుందో చూసేద్దామా
కొన్ని రంగులని వేరే రంగు పక్కన వేస్తే భిన్నంగా ఉంటాయి. పసుపు రంగును బ్రౌన్ రంగు పక్కన వేస్తే పసుపు రంగు కంటికి హాయిగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు పక్కన పసుపు రంగు వేస్తే మాత్రం కొట్టొచ్చినట్టు ఉంటుంది. పసుపు, ఎరుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్నిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా తీసుకుంటే మరీ గాడిగా కనిపిస్తాయి. పోస్టల్ రంగులైన పౌడర్ పింక్, బేబి బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది.
ముదురు రంగులు గదిని తేజోవంతంగా ఉంచుతాయి. పెద్ద గదులకు ఈ రంగులే బాగా నప్పుతాయి. పోస్టల్ రంగులు డల్‌గా అనిపిస్తాయి. అందులోనూ సూర్యకాంతి పడకుండా కరెంట్ ద్వారానే వెలుగు వచ్చే గదుల్లో ఈ రంగులు వాడితే వాతావరణం మరింత డల్‌గా తయారవుతుంది. పోస్టల్ లేదా లేత రంగులు వేస్తే గది పెద్దగా కనిపిస్తుంది. ముదురు రంగులు కొట్టొచ్చినట్టు కనిపించినప్పటికీ గది చిన్నదిగా అనిపిస్తుంది. గదికి రెండు మూడు రంగుల కాంబినేషన్‌లు కూడా వాడొచ్చు. ఇలాంటప్పుడు వేసిన రంగుల్లో ఒక షేడ్ మిగతా రంగులను మించి కనిపించేలా ముదురుగా ఉండాలి.



Click it and Unblock the Notifications
