Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఇంటికే కాదు ఇంటిల్లి పాదికి సురక్షితమే...

పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో...అపార్ట్ మెంట్ జీవితం సాధారణం అవుతున్న ఈ వేళ.. ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సి వాటిలో ముందుగా ఇంటి డోర్ ముందున్న చిన్నచిన్న గోడలు, బాల్కానీ గోడలు..ఇవి మూడు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండాలి. ఇలా ఉండటం వల్ల పిల్లలు ఎలా ఆడుకొన్ని గోడపై నుంచి పడిపోయే అవకాశం ఉండదు. అలాగే గోడలకు కోణాలు షార్ప్ గా లేకుండా నునుపుగా ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి.
బాల్కానీ గోడలకు అమర్చే ఇనుప కడ్డీలు పిల్లలకు హాని చేయవచ్చు. ఆ ఇరుకు కడ్డీలలో తలలు పెట్టడం, ఇనుము డిజైన్ల వల్ల కాళ్లూ, చేతులకు గాయాలు కావడం జరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాధాన్ని అరికట్టేందుకు బాల్కానీ రైలింగులకు వేసే నున్నటి ఆక్రిలిక్ షీట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని చక్కగా అమర్చుకొంటే పిల్లలకు రక్షణగా ఉంటుంది.
అగ్నిప్రమాదాలు తలెత్తే ఏ చిన్న అవకాశం ఏర్పడినా తక్షణం స్పందించి, జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా అప్రమత్తత కనబరచాలి. స్మోక్ డిటెక్టర్ లని, ఫైర్ ఎగ్జాస్టర్లని ఏర్పాటు చేసుకోవాలి.
అన్ని చోట్లా బల్బులు ఏర్పాటు చేస్తే అనవసరంగా విద్యుత్ ఖర్చు అనుకుంటారు కొంతమంది, కానీ మెట్ల దగ్గర విద్యుత్ సౌకర్యం తప్పనిసరి. సరైన వెలుతురు లేకపోతే జారిపడే ప్రమాదం ఉందిం.
చాలా మంది విద్యుత్ తీగల విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. అవి బోర్డుల నుంచి బయటకు వచ్చి వేలాడుతన్నా పట్టించుకోరు . కాని ఇంట్లో చిన్న పిల్లలున్న ఉంటే విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవిబయటకు కనబడకుండా, షార్ట్ సర్క్యూట్ జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఇంటిపైన తక్కువ ఎత్తులో ఉండే వాటర్ ట్యాంకులకి అడుగన ఉండే సంపులకి, సెప్టిక్ ట్యాంక్ లకి మూతలు తప్పనిసరి. మేడపై మేడపై పతంగులు ఎగరేయడం, చిన్నపిల్లలుంటే సంపుల దగ్గరకు పాకుతూ వెళ్లడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కాబట్టే మూతలు తప్పనిసరిగా ఉంచాలి.
వంటింట్లోనే అధిక సమయం గడిపే మహిళలు గ్యాస్ సిలిండర్ ని భద్రంగా ఉంచే విషయంలో దృష్టి పెట్టాలి. అదనపు సిలిండర్ ఉన్నప్పుడు దానిని గ్యాస్ గట్టు కిందే పెట్టాలి అని లేదు. ఇప్పడు దానిని గ్యాస్ బ్యాంకులని అమర్చుతున్నారు. అక్కడ ఉంచుకోచ్చు లేదా బయట ఒక చిన్న గ్రిల్ లాంటి అదనపు నిర్మాణాన్ని కట్టి అందులో ఉంచితే మంచిది. దీనివల్ల రెండు సిలిండర్లు ఒకచోట ఉండకుండా ప్రమాదతీవ్రత తప్పుతుంది.
అలాగే ఇంటికి అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని మీకు చేరవేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది హోమ్ అటోమేషన్ పరికరం. ఎవరైనా మనకి తెలియకుండా ఇంట్లోకి వచ్చినప్పుడు లైట్లు వెలుగుతాయి. సీసీ కెమెరాలు వచ్చిన వ్యక్తుల చిత్రాలని తీస్తాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఫోన్ కి, ల్యాప్ టాప్ కి అలర్టుల రూపంలో వెంటనే అందుతుంది. ఈ పరికరం లక్షల్లో ఉంటుంది. అంత ఖర్చు పెట్టలేని వారు డోర్ వీడియో ఫోన్ అమర్చుకుంటే సరిపోతుంది. ఈ పరికరం ఖరీదు పదిహేను వేల నుంచి మొదలవుతుంది. ఈ పరికరాన్ని అమర్చుకొంటే లోపలి నుంచే వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకొని మాట్లాడవచ్చు. ఎవరైనా బెల్ కొడితే తలుపు తీయకుండా వీడియోలో చూడొచ్చు. వాళ్లతో మాట్లాడొచ్చు. ఇంకా చౌకగా కావాలనుకొంటే ప్రధాన ద్వారానికి ప్యానెల్ లేదా వ్యూ గ్లాసులని అమర్చుకొంటే మంచిది.



Click it and Unblock the Notifications