Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
ఆధునిక అలంకరణలో దీపాలు!

ఇంటి అలంకరణ పాతబడి బోర్ కొట్టేస్తోందా? కొద్దిపాటి వెరైటీగా వుండాలంటే...ఇంటిలోని లైటింగ్ ఫిక్ఛర్లను లేదా బల్బులను వివిధ రకాలుగా మార్చి చూడండి. సరైన ప్రదేశంలో సరైన లైటింగ్ వుంటే ఇల్లు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. లైటింగ్ సరి లేకుంటే, నిద్ర వస్తున్నట్లు, తలనొప్పి గాను వుంటుంది. అందుకుగాను మీ ఇంటిలోని గదుల ప్రాధాన్యతను బట్టి గదులలోని లైటింగ్ తీరు మార్చి ఆనందించండి.
గదిలో పూర్తిగా వెలుగులు ఒకే చోట అంటే సీలింగ్ నుండి వస్తాయి. లేదా గదిలోని రెండు లేదా మూడు చోట్లనుండికూడా లైట్లు వెలిగేలా చేయవచ్చు. రోజువారి చేసే పనులకు సరైన వెలుగు వుండాలని గుర్తుంచుకోండి. అయితే ఈ లైట్లకు నేడు తాజాగా మార్కెట్ లోకి వస్తున్న డిమ్మర్లను పెడితే, పని లేనపుడు లైటింగ్ తగ్గించుకోడానికి కూడా అవకాశం వుంటుంది.
చదువుకునే గదిలో గదంతా ఫ్లోరసెంట్ లైటింగ్ పరుచుకుని వుంటే...సరిగ్గా చదువుకునే టేబుల్ పై మామూలు టేబుల్ ల్యాంప్ పెట్టి చూడండి. కంటికి శ్రమ తగ్గి మరింత అధికంగా కూర్చుని చదువుకోవచ్చు. లివింగ్ రూమ్ ఇంటి మొత్తానికి ప్రాధాన్యత కలిగి సాధారణంగా ఇంటిలోని వారందరూ అక్కడే చేరతారు. దీనికి గాను ఇప్పటికే ట్యూబ్ లైట్లు వున్నట్లయితే, ఛాండిలీయర్లు లేదా నేడు కొత్తగా వస్తున్న సిఎఫ్ ఎల్ బల్బులు పెట్టండి. వెరైటీగా వుండటమే కాక విద్యుత్ ఆదా అవుతుంది. అదే రకంగా ఇంటి కారిడార్లు, తిరిగే ప్రదేశాలలో తక్కువ వెలుగున్న సాధారణ బల్బులు పెట్టండి. వీటిని రంగులుగా వుంచినప్పటికి ఆకర్షణీయంగా వుంటాయి. బెడ్ రూమ్ లలో తక్కువ లైటింగ్ వుండే సిఎఫ్ ఎల్ బల్బులు, జీరోవాట్ రంగు బల్బులు, ఉపయోగానికి, ఆకర్షణకు బాగుంటాయి.



Click it and Unblock the Notifications
