Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
మహిళలకు కావల్సింది వంటింటి చిట్కాలేగా....
మహిళలకు కావల్సింది వంటింటి చిట్కాలేగా....

1. నూనె తక్కువ వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తక్కువ వేసినా కూర రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. బాణాలి లేదా గిన్నె బాగా వేడెక్కిన తరువాత నూనె వేసినట్టయితే తక్కువ నూనెతో కూడా వేపుడు కూరలు చేసుకోవచ్చు.
2. గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతూ అచ్చంగా హోటల్‌లో తిన్నట్లే ఉంటాయి.
గారెల పిండి రుబ్బిన వెంటనే నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి తీసిన తరువాత గారెలు వండితే నూనె పీల్చకుండా ఉంటాయి. పెద్దవారికి కొలెస్ట్రల్ భయం ఉండదు.
3. వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
4. అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
5. ఉప్పు వేసిన నీటిలో కూరగాయముక్కలను కొద్ది సేపు ఉంచి ఆ తరు వాత వాటిని ఉడకబెడితే త్వరగా ఉడుకుతాయి.
6. ఎండు కొబ్బరి, నువ్వులు,ధనియాలు కలిపి పొడి చేసుకొని కూరలలో వేస్తే మంచి రుచి వస్తుంది. ఈ పొడి చాలా రోజుల వరకూ నిల్వ వుంటుంది.
7. చపాతీలు మరింత రుచిగా కావాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. గోధుమపిండిలో కొద్దిగా బార్లీపిండి, శనగపిండి కలిపితే మంచి రుచిగా ఉంటాయి.
8. ఎండు కొబ్బరిని సులభంగా తురుమాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఎండుకొబ్బరిని కొద్ది సేపు ఫ్రిజ్ లో పెట్టి ఆ తరువాత తురుమాలి.
9. బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
10. వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
