Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
ఓల్డ్ క్యాలెండర్లను ఉపయోగించటానికి 10 సృజనాత్మక మార్గాలు
మీ ఇంటిలో కొన్ని నెలల మరియు సంవత్సరాలుగా పాత క్యాలెండర్లు మీ స్టోరేజ్ ప్రదేశంలో కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. మీకు మీ పాత క్యాలెండర్లు తీసివేయాలనే ఆలోచన ఉంటే,అప్పుడు అందమైన చిత్రాలతో,నాణ్యత గల నిగనిగలాడే పత్రాలను తీసివేయటం అనేది ఒక గొప్ప నష్టం అని గుర్తుంచుకోవాలి. క్యాలెండర్ లోని పేజీలు రీసైక్లింగ్ చేసి ఉపయోగపడే వస్తువులుగా తయారుచేయటం అనేది ఒక సృజనాత్మక మార్గం. మీరు పాత క్యాలెండర్లు ఉపయోగించి కొన్ని సృజనాత్మక మార్గాలను ఆలోచించవచ్చు.
మీరు మీ మనసులో కొద్దిగా సృజనాత్మకత మరియు ఆలోచన కలిగి ఉంటే,మీరు మీ పాత క్యాలెండర్లు రీసైకిల్ చేయవచ్చు. మీ పసిపిల్లల బోధన కోసం అంకెలను ఒక పజిల్ తయారు చేయటానికి ఉపయోగించవచ్చు. పాత క్యాలెండర్ లలో ఉండే చిత్రాలను స్క్రాప్ బుకింగ్ ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చు.
కాబట్టి,ఇప్పటి నుండి పాత క్యాలెండర్లు ఉంచటం వెనక ఉద్దేశ్యం నిష్ఫలమైనదని భావించకూడదు. మీరు క్యాలెండర్లను ఉపయోగించటానికి సృజనాత్మక మార్గాల గురించి ఆలోచించటానికి కొద్దిగా సమయం తీసుకుంటే వాటికీ ఒక కొత్త రూపాన్ని అందించవచ్చు. మీరు పాత క్యాలెండర్లను ఉపయోగించి ఆకర్షణీయంగా ఏదో చేయాలనే తపన మరియు కొన్ని ఆలోచనలు కోసం ఎదురుచూస్తూ ఉంటే,ఇక్కడ అవకాశాల జాబితా ఉంది !

బుక్ మార్క్స్
అందమైన మరియు రంగుల చిత్రాలు కలిగిన పాత క్యాలెండర్లను ఉపయోగించి ఒక బుక్మార్క్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. మీరు కాగితం తగినంత గట్టిగా లేదని భావిస్తే,కేవలం వెనుకవైపు ఒక కార్డు స్టాక్ ను జోడించండి.

ప్లేస్మెంట్ కొరకు ఉపయోగించాలి
క్యాలెండర్లు ఉపయోగించడానికి ప్లేస్మెంట్ చేయటం అనేది చాలా సృజనాత్మక మార్గాలలో ఒకటి. మీరు పాత క్యాలెండర్లలో చిత్రాలను కత్తిరించి పూర్తిగా ఏకైక ప్లేస్మెంట్ ను సృష్టించవచ్చు. మీకు నిగనిగలాడే పత్రాల ఎంపిక కూడా చాలా బాగుంటుంది.

వాల్ హంగింగ్
అనేక క్యాలెండర్లలో ప్రముఖ చిత్రకారిణి మరియు ఫోటోగ్రాఫర్ల కళాఖండాలు ఉంటాయి. వాటిని అందమైన వాల్ హంగింగ్ గా ఉపయోగించడానికి ఆ చిత్రాలను ఫ్రేమ్ చేయవచ్చు.పాత క్యాలెండర్లలో ఉండే ప్రముఖ చిత్రాలను ఉపయోగించి మీ ఇంటిని అలంకరించవచ్చు.

పిల్లల కోసం అనేక గేమ్స్
మీ పిల్లల కోసం ఒక పజిల్ గేమ్ తయారుచేయడానికి మీరు శోధన చేయటం అవసరం.అప్పుడు పాత క్యాలెండర్లను ఉపయోగించి మీరు సులభంగా మరియు స్వంతముగా గేమ్స్ తయారుచేయవచ్చు. అంతేకాక మీ పిల్లలను కూడా ఈ ప్రక్రియలో పాల్గొనేలా చేయవచ్చు.

ఎన్వలప్
ముందే తయారు చేసిన స్థిర ఎన్వలప్ కోసం డబ్బు ఖర్చుకు బదులుగా వ్యక్తిగత ఎన్వలప్ తయారుచేయటానికి ప్రయత్నించవచ్చు. మీరు క్యాలెండర్లు ఉపయోగించి కొన్ని సాధారణ మడతల ద్వారా ఎన్వలప్ తయారుచేయటం అనేది ఒక సృజనాత్మక ఆలోచన చెప్పవచ్చు.

గిఫ్ట్ ప్యాకింగ్
రకరకాల చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఉపయోగించి గిఫ్ట్ ప్యాకింగ్ చేయటం అనేది ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. మీ బహుమతి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండటానికి రంగు రంగుల నిగనిగలాడే షీట్లను ఉపయోగించవచ్చు.

పేపర్ బ్యాగ్
మీరు వాతావరణం గురించి ఆలోచిస్తే,అప్పుడు సాధారణ కాగితం సంచులు తయారు చేయడానికి ఒక క్రొత్త మార్గంలో మీ పాత క్యాలెండర్లను ఉపయోగించండి. అంతేకాక మీరు రంగుల కాగితం సంచులు తయారుచేసి క్యారియర్ లేదా మీ పిల్లల యొక్క వస్తువులను ఉంచటానికి ఉపయోగించవచ్చు.

డెస్క్ క్యాలెండర్ ఫోటో స్టాండ్
మీరు డెస్క్ క్యాలెండర్ తో మీ సృజనాత్మకతను ఉపయోగించి ఆకర్షణీయమైన ఫోటో ఫ్రేమ్ తయారుచేయవచ్చు. మీ గది మరింత అందముగా చేయడానికి మీ టేబుల్ మీద పెట్టవచ్చు.

గిఫ్ట్ ట్యాగ్
పాత క్యాలెండర్లు లేదా వాటిలో ఒక ప్రత్యేక భాగంను తిరిగి ఉపయోగించవచ్చు. గిఫ్ట్ ట్యాగ్ చేయటం అనేది క్యాలెండర్లు ఉపయోగించి అందమైన ఆసక్తికరమైన సృజనాత్మక మార్గాలలో ఒకటి. గిఫ్ట్ ట్యాగ్ గా ఉపయోగించడానికి బయటకు చిత్రాలను కట్ చేసి లామినేట్ చేసే ఆలోచన కూడా బాగుంటుంది.

క్రాఫ్ట్ ప్రాజెక్టులు
మీరు ప్రయత్నించటానికి చిన్న మరియు పెద్ద ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మీరు ఈ అద్భుతమైన మరియు తక్కువ ఖర్చు ముడి పదార్థంను ఉపయోగించి క్రాఫ్ట్ ప్రాజెక్టులు తయారుచేయటం అనేది మీ పిల్లలలో ఆసక్తిని పెంచుతుంది. వివిధ సృజనాత్మక ఆలోచనలను ప్రయత్నించే వారికీ ఈ పనులు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
