Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
బెడ్ ఎంపిక చేసుకోవడానికి ముందు గమనించాల్సి విషయాలు
రాత్రిపూట బాగా నిద్రపోవడం అనేది ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసర. ఇది కేవలం మీరు ఎన్ని గంటలు మంచి నిద్రపోతారు అనే సంఖ్యను బట్టే కాదు, మీరు సౌకర్యవంతంగా నిద్రపోవడానికి ఎంచుకున్న మాట్రేస్ పై కూడా ఆధారపడి ఉంటుంది. పరుపులు ప్రతివ్యక్తికి ఒకే విధంగా ఉండవు; కొంతమంది వ్యక్తులు వారి ఎత్తు, లావు, బరువు ప్రకారం ఆధారం ఏర్పాటుచేసుకోవడానికి వెనక గట్టిగా ఉండి మెత్తని ది౦డులాంటిది తయారుచేయించుకుంటారు. సాధారణంగా మనం పరుపులు కొనేముందు ఇటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టము; కానీ ఇలాంటి విషయాల పట్ల అశ్రద్ధ మన నిద్ర అలవాటుపై ప్రభావాన్ని చూపిస్తుంది.

మీరు పరుపులు ఎన్నుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఇవ్వబడ్డాయి...
1. ఇప్పటికే ఉన్న మీ పరుపు వయస్సు(గడువు): మీరు నిద్రపోయేటపుడు సమస్యగా ఉంటె, ఆ సమస్య మీ పరుపులో లేదు, దాని వయసులో ఉండవచ్చు. ప్రతి పరుపుకి గడువు తేదీ ఉంటుంది. కొంత సమయం అయిన తరువాత, పరుపులు వాటి సహజ సౌకర్య నాణ్యతను ఎక్కువకాలం కలిగిఉండవు. మీ శరీరానికి వచ్చిన కష్టాలను దూరం చేసుకోవాలంటే పరుపులను మార్చడానికి ఇదే సరైన సమయం.
2. మూడు ఎస్ లు: పరుపులో మృదుత్వం, ఆధారం, పరిమాణం అనే మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో, చాలామ౦ది వినియోగదారులు పరుపుల కొనుగోలులో ఇతర విషయాల కంటే ఎక్కువ ఖర్చుపై ప్రాధాన్యత చూపిస్తారు, తరువాత అసంతృప్తి చెందుతారు.
3. మీరు నిర్ధారించుకునే ముందు పరీక్షించండి : ఒకసారి మీ మనసు నిర్దిష్ట పరుపుపై ఉన్నట్లయితే, కనీసం 10 నుండి 15 నిముషాలు దానిపై కూర్చుని ప్రయత్నించండి. దీనివల్ల దాని సౌకర్యాన్ని, మన్నికను తెలుసుకోవచ్చు. పెద్ద కొనుగోలులో హడావిడి పడొద్దు, అమ్మకందారుని ప్రభావల్ల మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవద్దు.
4. అన్ని ఎంపికలని, వ్యత్యాసాలని తనిఖీ చేయండి: పరుపుల సంస్ధ, దాని అందమైన శైలి, పైన ది౦డుతో కలిసి ఉందో లేదో, దాని బ్రాండ్ హామీ అన్నీ చూడండి. మధ్యవర్తి ద్వారా నిర్ణయం తీసుకోవద్దు.
నిజమైన పరుపుల దుకాణంలో కొనుగోలు చేయండి .
5. డిపార్టుమెంటు స్టోర్ లో కొనుగోలు మానండి: పరుపుల దుకాణంలోని అమ్మకందారులు సాధారణంగా బాగా శిక్షణ పొంది ఉంటారు, మీరు సరైన ఎంపిక చేసుకోవడానికి వారి నైపుణ్యం ఎంతో సహాయ పడుతుంది.
6. వారెంటీ తనిఖీ చేయడం మరిచిపోవద్దు: మంచి పరుపులకు కనీసం 10 సంవత్సరాల ‘పూర్తి' వారెంటీ లేదా ‘నాన్-ప్రోరేటేడ్ వారెంటీ' ఉంటుంది.



Click it and Unblock the Notifications
