Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
ప్లోర్ మీద దీపాల నూనెమరకలను తొలగించే చిట్కాలు
దీపావళి సందర్భంగా దీపాల పండుగను జరుపుకుంటారు. మనం ఈ వేడుక పనుల కోసం ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటాము. ఈ పండుగ అనేది చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ చీకటిని పారద్రోలి వెలుగును,అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది. భారతదేశంలో ఈ రోజు ఇంచుమించు అన్ని ఇళ్ళల్లోను నూనె దీపాలను వెలిగిస్తారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని మరియు జీవితం యొక్క వెలుగును అందిస్తుంది. మనకు చాలా ప్రాక్టికల్ విషయాల గురించి ఆలోచించటానికి వీలు కల్పిస్తుంది.
దీపావళి అంటే సాహిత్యపరంగా దీపాల వరుస అని అర్ధం. ఆ రోజున ఇంటిలో దీపాలు వెలిగించినప్పుడు దీపాల నూనె నేల మీద పడే అవకాశం ఉన్నది. దీపములు వెలిగించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చిట్టచివరకు దీపాల నూనె నేలమీద పడకుండా వెలిగించటం కష్టతరంగా ఉంటుంది. ఇది చివరికి నేలపై మరక చేయవచ్చు. అదృష్టవశాత్తూ నూనె మరకలను తొలగించడానికి అందుబాటులో అనేక మార్గాలు ఉన్నాయి. అయితే దురదృష్ట విషయం ఏమిటంటే ఈ వాణిజ్య ఉత్పత్తులు యాసిడ్ ని కలిగి ఉంటాయి. నూనె మరకలను తొలగించడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. అయితే అవి నేల మీద హాని చేస్తాయో లేదో అనే సందేహాన్ని మాత్రం మాకు వదిలివేయండి.
దీపావళి రోజున నూనె మరకలను తొలగించటానికి సురక్షితమైన కొన్ని నివారణ మార్గాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఇక్కడ మీరు చదవండి.

1. చెత్తాచెదారం మీకు సహాయం చెయ్యవచ్చు
మీకు చెత్తాచెదారం సహాయం మరియు ఉపయోగకరముగా ఉండవచ్చు. నూనె చిందిన వెంటనే ఒక మంచి మోతాదులో చెత్తాచెదారంను చల్లుకోవాలి. రాత్రి పూట అలా వదిలేసి మరుసటి రోజు తుడవాలి. ఈ నూనె మరకలను తొలగించడానికి ఉత్తమ పద్ధతులలో ఒకటిగా చెప్పవచ్చు.
2. రంపపు పొట్టు మరియు పెయింట్
రంపపు పొట్టు మరియు పెయింట్ రెండింటిని కలిపి నూనె మరక పడిన చోట వేయాలి. 20 నిమిషాలలో నూనెను గ్రహించి మరక మటుమాయం అవుతుంది. అప్పుడు మిశ్రమాన్ని తుడిచివేయాలి. మీకు అవసరం అని భావిస్తే తిరిగి ఆ ప్రాంతంలో మరల వెయవచ్చు. మీకు ఈ దీపాల నూనె మరకలను తొలగించడానికి ఒక సులభమైన మార్గ అనుభూతి ఉందా లేదా?
3. బేకింగ్ సోడా ఉపయోగించండి
మీకు వంట కోసం మాత్రమే బేకింగ్ సోడా ఉపయోగించటం తెలిస్తే అప్పుడు నూనె మరకలను తొలగించటానికి కూడా ఉపయోగపడుతుందని తెలుసుకోండి. దీపావళి రోజున దీపాల నూనె మరకలను ఎలా తొలగించాలో భయం వేస్తె కనుక మీరు స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో అదనంగా బేకింగ్ సోడాను కూడా కొనుగోలు చేయండి. మీరు నూనె మరకలను తొలగించడానికి చేయవలసిందల్లా ఆ ప్రాంతంలో బేకింగ్ సోడా చల్లుకోని వేడి నీటితో శుభ్రంగా కడగాలి.
4. డిష్ వాషర్ డిటర్జెంట్
నూనె చిందిన ప్రాంతంలో డిష్ వాషర్ డిటర్జెంట్ ను ఉపయోగించవచ్చు. దీనిని దీపాల నూనె మరకలను తొలగించడానికి సులభమయిన మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు. కొన్ని నిమిషాల పాటు నూనెను గ్రహించటానికి అలా వదిలి వేయాలి. ఆ సమయంలో నీటిని వేడి చేసుకొని ఉంచుకోవాలి. ఆ వేడి నీటితో నూనె చిందిన ప్రాంతంలో శుభ్రంగా కడగాలి.
5. TSP సహాయపడుతుంది
TSP అంటే ట్రై సోడియం ఫాస్ఫేట్. ఇది మందంగా ఉన్న మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు నేలపై పడిన దీపాల నూనె మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక గ్యాలన్ నీటిలో TSP ని కలిపి నూనె మరక మీద వెదజల్లి 20-30 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.
6. WD40 ప్రభావం
WD40 అనేది ఇళ్లలో కనుగొన్న ఒక సాధారణ లూబ్రికెంట్ అని చెప్పవచ్చు. మీకు దీపాల నూనె మరకలను తొలగించడానికి ఈ లూబ్రికెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ లూబ్రికెంట్ ను మరక మీద స్ప్రే చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.
7. మొండి మరక అయితే
మందపాటి మరియు మొండి మరక అయితే అప్పుడు మరక తొలగించడానికి ఒక కాంక్రీట్ డిగ్రేసెర్ ను వినియోగించుకోవచ్చు. సాంద్రీకృత ఆల్కలీన్ సబ్బుతో మరక మీద రుద్ది శుభ్రం చేయాలి. దీనిని నూనె మరకలను తొలగించే పద్ధతులలో ఒకటిగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications