Latest Updates
-
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.!
వాటర్ బాటిల్స్ ను ఇలా కూడా శుభ్రం చేయవచ్చు...
మనందరికీ నీళ్ళు అత్యంత ముఖ్యమైన అంశం. నీళ్ళు ప్రతి ప్రాణికీ తప్పక అవసరం అయ్యే ప్రాథమిక అంశం. పాత కాలం నుండి, నీరును వివిధ రకాలుగా ఉపయోగించుకోవడం కోసం పెద్ద..చిన్న కంటైనర్లలో భద్రపరచుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో, చాలా తేలికగా మోసుకెళ్ళడానికి మరియు నిల్వచేయడానికి ప్లాస్టిక్ బాటిల్ కంటైనర్స్ ఉపయోగిస్తున్నారు. అయితే మనకు నీటి అవసరం ఉన్నది, ప్రతి సారీ ప్లాస్టిక్ బాటిల్ అవసరం ఉందికదా అనీ, ప్రతి సారీ కొత్త బాటిల్స్ ను ఉపయోగించకూడదు . ప్రతి సారి కొత్త ప్లాస్టిక్ బాటిల్ ను ఉపయోగించడం సాధ్యం కాదు. ఎందుకంటే, వాటి ధర, అదే విధంగా, మనం ఉపయోగించిన బాటిల్స్ పారవేయడం వల్ల వాతావరణంలో మరో కొత్త సమస్య ఉత్పన్న అవుతుంది.
అందువల్ల, తిరిగి మనం దేనికైనా వాడుకోగలిగే అవసరం ఉన్న బాటిల్స్ ను ఉపయోగించడం మంచిది. ఇటువంటి బాటిల్స్ ను ఉపయోగించడం వల్ల వాతావరణ పరిరక్షింవచ్చు మరియు డబ్బు కూడా ఆదా అవుతుందనడానికి ఒక గొప్ప మార్గం. అయితే, కొన్ని రోజుల తర్వాత, ఈ బాటిల్స్ లోపల ఆకుపచ్చగా మారడం, లేదా చెడు వాసన రావడం మరియు ఫంక్ అభివృద్ధి చెందడం జరుగుతుంది. వీటిని తొలగించడం చాలా కష్టం అవుతుంది . కొన్ని ప్లేయిన్ డిష్ వాషర్ కడిగనంత సులభం కాకపోవచ్చు. కాబట్టి వాటర్ బాటిల్ పూర్తిగా శుభ్రం చేయాలంటే ఇక్కడ కొన్ని సులభ చిట్కాలు ఇవ్వబడ్డాయి. వాటిని ఒక సారి పరిశీలించండి...

1. ముందుగా ప్లాస్టిక్ బాటిల్లో కొద్దిగా వేడినీళ్ళు పోసి కొన్ని చిక్కుల డిష్ వాషర్ కూడా వేసి, బాటిల్ ను బాగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాటిల్లోని బ్యాక్టీరియా మరియు అన్ని రకాల ప్యాథోజెన్స్ ను నాశనం చేవచ్చు. ఇంకా ఇలా చేయడం వల్ల బాటిల్లో నిల్వ ఉన్నడర్టీని తొలగించడానికి సహాయపడుతుంది. వాటర్ ను 20-25నిముషాల అలాగే ఉంచడం వల్ల బాగా నాని బాటిల్ చివర్లో ఉన్న దుమ్ము, ధూలి, వదిలిపోతుంది. డర్టీ అలాగే ఉన్నట్లైతే అదే పద్దతిని అనుసరించి రాత్రంతా నీటిని అలాగే నింపేయాలి.
2. డ్రై ప్లాస్టిక్ బాటిల్లో బియ్యం మరియు బేకింగ్ సోడా వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి, 30-45నిముషాలు అలాగే ఉంచాలి. అలా ఉంచడం వల్ల బియ్యం, బేకింగ్ సోడా వాసనతో బాటిల్ నిండా నిండుతుంది . బేకింగ్ సోడా క్రిములు లేకుండా చేస్తుంది. అలాగే బాటిల్లో అనవసరపు వాసన మరియు బ్యాక్టీరియా పోతుంది. అవసరం అయితే తిరిగి అలాగే మరో సారి చేయండి.
3. బాటిల్ లో వెనిగర్, కొద్దిగా నీళ్ళు పోసి, బాగా షేక్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి . తర్వాత రోజు ఉదయం నీళ్ళు మరియు సోపు వేసి బాగా వాష్ చేయాలి . ఈ బాటిల్లో వెనిగర్ వాసన్ కొన్ని నిముషాల్లో తొలగిపోతుంది. తర్వాత చాలా త్వరగా వాసన వెళ్ళి పోయి తాజా వాసనతో నిండుతుంది. ఇది అనవసరమైన వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. బాటిల్ కొత్తదానిలా మెరుస్తుంటుంది.
4. బాటిల్ లో న్యూస్ పేపర్ ను నింపి, మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం మూత తీస్తే, వాసన పూర్తిగా తొలగిపోతుంది. ఇలా, వాటర్ బాటిల్, కంటైనర్, జార్స్ ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. మరియు చాలా సులభం కూడా.
5. వాటర్ బాటిల్ శుభ్రం చేయడానికి ఆక్సిజన్ లేదా క్లోరిన్ బేస్డ్ బ్లీచ్ డిటర్జెంట్ తో శుభ్రం చేయచ్చు. ఈ డిటర్జెంట్ తో శుభ్రం చేయడం వల్ల బాటిల్ యొక్క వాసన మరియు మురికి తొలగిపోయి కొత్తవాటిలో తాజాగా ఉంటాయి. ఇది చాలా ప్రభావతంమైన ఫలితాలను అంధిస్తాయి.



Click it and Unblock the Notifications