Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఇంట్లో అద్దాలని మిలమిల మెరిపించే ట్రిక్స్ అండ్ టిప్స్
ఇంటిని అందంగా ఉంచుకోవడం అంటే కేవలం కనిపించే వస్తువులే కాదు కనిపించని వాటిని సైతం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఇల్లు నిజంగా బృందావనం అవుతుంది. గదుల అందాన్ని పెంచటంలో అద్దాల పాత్రను కాదనలేం. అయితే అద్దాలు ఎంత శుభ్రం చేస్తున్నా త్వరగా మరకలు పడటం గమనిస్తుంటాం. అపరిశుభ్రమైన అద్దాలు మీ అందాన్ని క్లియర్ గా చూపించవు. ఇంట్లో అద్దాలు శుభ్రం చేయడానికి కొన్ని మంచి ట్రిక్స్ ను ఉపయోగించాలి.
ఉదాహరణకు, ఒక చిన్న తేమ వస్త్రంతో తుడవటానికి వీలు లేదు. అలా తేమ వస్త్రంతో తుడిచినప్పుడు, అద్దం మీద నీళ్ళ మరకలు అలాగే నిలిచి ఉంటాయి. తేమ వస్త్రంతో అద్దాలను శుభ్రం చేయడానికి బదులు, న్యూస్ పేపర్లకు ప్రాధాన్యత ఇవ్వండి. న్యూస్ పేపర్ వాటర్ ను పూర్తిగా గ్రహిస్తుంది. మరియు అద్దం పూర్తిగా శుభ్రపడుతుంది. అందువల్ల అద్దాన్ని చిన్న పేపర్ తో తుడవటం వల్ల మంచి షైనింగ్ తో మరియు మరకలు లేని అద్దాన్ని పొందవచ్చు. శుభ్రమనైన, అద్దాన్నిపొండానికి మరికొన్ని చిట్కాలు మీకోసం...
1. అద్దాలను శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో ప్రత్యేక షాంపూలు లభిస్తున్నాయి. వాటిని పేపర్ టవల్‌మీద స్ప్రే చేసి దానితో అద్దాన్ని తుడిస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది. అద్దం వెనుక దుమ్ముపడితే గుడ్డతో తుడిచేయాలే కాని షాంపూ మాత్రం వాడకూడదు. అద్దాలు దుమ్ముపట్టి నల్లగా, అసహ్యంగా మారకూడదంటే పేపర్ టవల్‌పై షాంపూ వేసి అద్దాల అంచులను తరచుగా శుభ్రం చేయాలి.
2. అద్దాన్ని తుడిచేటప్పుడు, మధ్యలోనుంచి ప్రారంభించి చివరలతో ముగించాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు. అంచులపై షాంపూ ఎక్కువగా పడితే సిల్వర్ మెరుపు అంతా పోయి నల్లగా మారిపోవచ్చు.
3. సున్నితమైన వస్త్రం: ప్రతి రోజూ అద్దాలు శుభ్రం చేయడానికి ఒక సున్నితమైన వస్త్రాన్ని ఉపయోగించాలి. మెత్తని వస్త్రం అద్దం మీద ఉన్న దుమ్మును పూర్తిగా శుభ్ర పరుస్తుంది.
4. న్యూస్ పేపర్: అద్దం మీద ఎటువంటి మరకలు లేకుండా మంచి షైనింగ్ తో మెరుస్తుండాలంటే, కొన్ని నీళ్ళు చిలకరించాలి లేదా క్లీనింగ్ సొల్యూషన్ ను చిలకరించి తర్వాత న్యూస్ పేపర్ తో శుభ్రం చేసుకోవాలి. న్యూస్ పేపర్ ను రెండు మూడు మడతలుగా ఫోల్డ్ చేసి తర్వాత శుభ్రపరచడానికి ఉపయోగించాలి.
5. వైట్ వెనిగర్: గోరువెచ్చని నీటికి కొద్దిగా వైట్ వెనిగర్ ను మిక్స్ చేసి క్లీనింగ్ సొల్యూషన్ గా తయారు చేసుకోవాలి. ఈ లిక్విడ్ తోనే మీ అద్దాన్ని శుభ్రం చేసి, మెరిపించుకోవచ్చు. వైట్ వెనిగర్ ను నీటితో మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నింపుకొని ప్రతి రోజూ లేదా సమయం దొరికినప్పుడల్లా అద్దాలను శుభ్రపరుస్తుండాలి.
6. నిమ్మరసం: మురికి పట్టిని అద్దాలను శుభ్రం చేయడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలిపి బాటిల్లో నిల్వ చేసుకోవాలి. నిమ్మరసంతో అద్దాలు శుభ్రపర్చడంతోపాటు ఆ ప్రదేశంలో మంచి సువాసన వస్తుంటుంది.
7. ఆల్కహాల్ లేదా బోరాక్స్: అల్కహాల్ మరియు బొరాక్స్ ను ఉపయోగించి, అద్దాలను మెరిసేలా చేయవచ్చు. ఆల్కహాల్ ను నీళ్ళలో కలిపి అద్దాల మీద స్ప్రే చేసి శుభ్రం చేయడం వల్ల అద్ధాలు కొత్తవాటిలా మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications

